ఉత్తరాయణం

అరచేతిలో స్వర్గం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘పాలిచ్చే ఆవును వదులుకొని తనే్న గాడిదను తెచ్చుకున్నట్లుంది’ నేడు దేశంలో ప్రజల పరిస్థితి. గత సాధారణ ఎన్నికల్లో కేంద్రంలో గెలిచిన భాజపా నేతలు మేనిఫెస్టోలో అందమైన హామీలు గుప్పించారు. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని, రూపాయి మారకం విలువ పెంచుతామని, ధరలను తగ్గిస్తామని అరచేతిలో స్వర్గం చూపారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాల కాలం పూర్తయినా జనం ఆశలు ఏవీ కార్యరూపం దాల్చలేదు. పెద్దనోట్లను రద్దు చేశాక నగదు కోసం జనం నానా అవస్థలు పడ్డారు. ఇప్పటికీ చాలా ఎటిఎంలలో నగదు లభించడం లేదు. పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు తరచూ పెరుగుతూనే ఉన్నాయి. పండగ నాడు సైతం పప్పన్నానికి నోచుకోని దుస్థితిని పేదలు ఎదుర్కొంటున్నారు. కొత్త కొత్త నిబంధనలతో బ్యాంకు సేవలు మరింత భారం అవుతున్నాయి. నగదు విత్ డ్రా చేసినా, కనీస నిల్వ లేకున్నా అదనపు చార్జీలు, పెనాల్టీలు తప్పవని బ్యాంకులు హెచ్చరిస్తున్నాయి. ముక్కుపిండి చార్జీలు వసూలు చేయడమే బ్యాంకుల పనిగా మారింది. మిగతా రంగాల్లోనూ దోపీడీ తప్ప ప్రజలకు ఎలాంటి న్యాయం జరగడం లేదు. అవినీతి కారణంగా వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టిపోతున్నా పాలకులు స్పందించడం లేదు.
- యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
ఇంటి నెంబర్లు ఎప్పుడిస్తారు?
ప్రస్తుతం ఉన్న ఇంటి నెంబర్ల స్థానంలో డిజిటల్ నెంబర్లు కేటాయిస్తామని విజయవాడలో మున్సిపల్ అధికారులు నానా హడావుడి చేశారు. ప్రతి ఇంటినీ సందర్శించి ఎన్ని పోర్షన్లు ఉన్నా వాటికి స్టిక్కర్లు అంటించి వెళ్లారు. ప్రతి కుటుంబం నివసించే పోర్షన్‌కు విడిగా ఇంటి నెంబర్లు ఇస్తామన్నారు. సకాలంలో ఆస్తిపన్ను, కుళాయి పన్ను చెల్లించాలని మైకుల్లో ప్రచారం చేస్తారు. డిజిటల్ ఇంటి నెంబర్ల ఊసే లేదు. ఆస్తిపన్ను వసూలు చేస్తున్నా ఎక్కడా నాణ్యమైన రోడ్లు, పారిశుద్ధ్యం కనిపించవు. కుళాయిల్లో తరచూ మంచినీరు రాదు. ప్రజాప్రతినిధులున్నా ఈ విషయాలు వారికి పట్టవు.
- బిఆర్‌సి మూర్తి, విజయవాడ
సర్వం కల్తీ మయం
వంటనూనెలు, కొబ్బరినూనె, కారం, పసుపు వంటివి కల్తీ కావడం నేడు చూస్తున్నాం. శరీర లేపనాలు, సుగంధ ద్రవ్యాల వంటివి కూడా కల్తీ అవుతున్నాయి. మార్కెట్‌కి వెళితే ఏది స్వచ్ఛమైన వస్తువో, ఏది కల్తీ వస్తువో తెలియక కొనుగోలుదారుడు అయోమయానికి గురవుతున్నాడు. కల్తీని నివారించాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఆహార పదార్థాల తయారీ, నిల్వ, పంపిణీపై ఆకస్మిక దాడులు నిర్వహించాలి. కల్తీ పదార్థాలను తినడం వల్ల పిల్లలు, వృద్ధులు ఎక్కువగా రోగాల బారిన పడుతున్నారు.
- డి.రాజారాం, అనకాపల్లి
యాచకుల బెడద
నగరాల్లో, పట్టణాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలకు అడ్డుపడుతూ యాచకులు సమస్యలు సృష్టిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. చిన్నపిల్లలను సైతం యాచక వృత్తిలోనికి దించడం, పసిపిల్లలను మండుటెండలో నిల్చోబెట్టి అడుక్కోవాలని కొందరు అలవాటు చేస్తున్నారు. బస్టాండు, రైల్వేస్టేషన్, కూడళ్ళు, ఆలయాలు.. ఎక్కడ పడితే అక్కడ యాచకుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. బిచ్చగాళ్ళ వేషంలో కొందరు దొంగతనాలకు పాల్పడుతున్నా పోలీసులలో స్పందన శూన్యం.
- అరుణ, పాడేరు