ఉత్తరాయణం

ఉచిత పథకాలతో అనర్థమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశంలోని అనేక రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఉచిత పథకాల హామీలను తెగ గుప్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో అయతే ఉచిత విద్యుత్, ఋణ మాఫీ, సబ్సిడీ బియ్యం, ఉచిత కరెంట్, సబ్సిడీ క్యాంటిన్‌లు, పింఛన్‌లు అంటూ అడగకపోయినా ఉచితంగా అన్నీ ప్రజలకు వడ్డించడంలో ఈ రాష్ట్రాలు పోటీపడుతున్నాయి. వీటివల్ల కోట్లాది రూపాయలు ఖర్చయి, అంతిమంగా ఆ బరువు రాష్ట్ర ప్రజల నెత్తినే పన్నుల రూపంలో పడుతున్నా పట్టించుకునే వారే లేరు. విదేశాలలో, అందునా అభివృద్ధి చెందిన దేశాలలో పరిస్థితి భిన్నంగా వుంది. ఉచితాలవలన ప్రజల్లో కష్టపడే గుణం తగ్గి విలాసాలకు అలవాటు అయ్యే ప్రమాదం వుందని వారు గ్రహించారు. ప్రజాకర్షక పథకాలు నేడు వికృత రూపం దాలుస్తున్నాయి. పథకాల అమలులో ప్రభుత్వ నిఘా లోపించిన కారణంగా దళారులు, అధికారులు మధ్యలో సగం స్వాహా చేస్తున్నారు.
- వి. రవిశంకర్, జనగామ
బాలకార్మిక చట్టం ఎందుకో?
ఆటపాటలతో, చదువులతో ఆనందంగా గడపాల్సిన లక్షలాది మంది బాలల జీవితాలు కళ్లముందే బుగ్గిపాలవుతున్నాయి. పాలకుల మాటలు నీటిమూటలవుతున్నాయి. పాత చట్టాలకు మరింత పదునుపెట్టి పకడ్బందీగా సరికొత్త చట్టాలను తీసుకొచ్చామని నేతలు చెప్పుకుంటున్నా ఏదో ఒక మార్గంలో ఈ వ్యవస్థ కొనసాగుతూనే ఉంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాల మీద చట్టాల ను చేస్తున్నారు. కఠిన శిక్షలు తప్పవని ప్రకటనలు, హెచ్చరికలు చేస్తున్నా అవేమీ ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నాయి. 14 ఏళ్ల లోపు పిల్లలు తమ కుటుంబానికి ఏదైనా పనిలో సహాయపడవచ్చు. కానీ ఇతరులు వారిని ఎలాంటి పనిచేయడానికి వినియోగించినా జైలుశిక్ష తప్పదని నేరంగా పరిగణిస్తున్నట్లు ఆ మధ్య పార్లమెంటులో ఆమోదించిన కొత్త బిల్లులో పొందుపరిచారు. ఈ పిల్లల తల్లిదండ్రులు కూడా జరిమానా కట్టాల్సి ఉంటుందని బిల్లులో స్పష్టం చేశారు. అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఎన్నిచోట్ల బాల కార్మికులు పనిచేస్తున్నారో చూసి కూడా చూడనట్లే ప్రవర్తిస్తున్నారు అధికారులు.
- సాయ పవన్, కర్నూలు
నిరుద్యోగులకు భరోసా ఇవ్వండి
రాజ్యాంగంలోని ఆర్టికల్ 41ని అమలుచేస్తూ ఏ ఆధారం లేని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని ప్రభుత్వం మంజూరు చేయాలి. సాధ్యమైనంత వరకు ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వరంగ సంస్థలలో ప్రైవేట్ పరిశ్రమలలో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. పట్టణీకరణ, నగరీకరణలు జరుగుతూ పారిశ్రామికీకరణతో రాష్ట్రాలు ముందడుగు వేస్తున్నా నిరుద్యోగాన్ని రూపుమాపలేకపోతున్నాయ. చదువుకున్న విద్యావంతులెవరు ఉ ద్యోగం లేకుండా నిరాశా నిస్పృహలతో కాలం వెళ్ళదీయడమనే పరిస్థితి ఇక రాకూడదు.
- పి. ఆనందరావు, విశాఖ