ఉత్తరాయణం

అవనికి పండుగ చేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రోజురోజుకూ భూతాపం పెరిగిపోతోంది
మండే ఎండలకు బండైనా కరిగిపోతోంది
భూగర్భంలోని నీరంతా ఇంకిపోతోంది
చెట్లను నరికేసి, చెరువుల్ని మింగేసి,
పొగల్ని చిమ్మేస్తే ఏమవుతుంది?
మనం చేసిన పాపానికి ఫలితం
ఇదికాక మరేమవుతుంది?

సమయం లేదు మిత్రమా!
మరణమా? ఉపాయమా?
మనమంతా సంఘటితమై
జలయజ్ఞం సాగిద్దామా?
నేలతల్లి చలువకొరకు
తరువుల తోరణం కడదామా!
పచ్చదనం కళకళతో
మబ్బులనే ఆహ్వానిద్దామా!
గంగమ్మకు, భూమాతకు
మైత్రినే పెంచుదామా!

నీటిపొదుపు చేపట్టి,
ఇంకుడు గుంతలు తవ్విపెట్టి
మొక్కలను నాటి, కాలుష్యం అరికట్టే
ఉపాయమే చూద్దామా!
ఆలోచించు మిత్రమా! మన అశ్రద్ధకు
భారీ మూల్యం చెల్లించాలి సుమా!
మనలో చైతన్యం రగిలించి, భవిష్యత్తును
ఊహించి జలసంరక్షణ చేపడదామా!
జలములు నిండుగ, వనములు మెండుగ
పెంచేసి అవనికి పండుగ చేద్దామా!
-చావలి శేషాద్రి సోమయాజులు,
పాచిపెంట
*
కేరళ అందరికీ ఆదర్శం
మాతృభాష మలయాళాన్ని అన్ని పాఠశాలల్లో తప్పనిసరి చేస్తూ కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొనిరావడం శుభ పరిణామం. పదో తరగతి వరకు మలయాళాన్ని విధిగా బోధించాలని ఆ ఆర్డినెన్స్ సారాంశం. ఈ ఆదేశాలను నిర్లక్ష్యం చేసే పాఠశాలల గుర్తింపును రద్దు చేస్తారు. కేరళ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాన్ని తెలుగు రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తెలుగుకు బదులు సంస్కృతం కాంపోజిట్ కోర్సుతో విద్యార్థులు పరీక్షలు పాసవుతున్నారు. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకొని తెలుగు సబ్జెక్టును నిర్బంధం చేయాలి. ఇతర రాష్ట్రాల విద్యార్థులకు మాత్రం కేరళలో వలే మాతృభాష సబ్జెక్టుకు సంబంధించి మినహాయింపు ఇవ్వొచ్చు.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు