ఉత్తరాయణం

ఇంటినెంబర్ల విధానం మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ నగరంలో హౌస్‌నెంబర్ ఆధారంగా అడ్రస్ కనుక్కోవడం అంత సులువుకాదు. ఉదాహరణకు సీతాఫల్‌మండిలోని ఒక అపార్టుమెంట్ ఇంటినెంబర్ 12-10- 335-7/1/ఎ/బి అని ఉంది. నగరంలో ఏళ్ల తరబడి నివసిస్తున్నవారికైనా ఇంత సంక్లిష్టంగా ఉన్న నెంబరుతో ఇంటిని గుర్తుపట్టడం సులువేం కాదు. ఇక బయటి ప్రాంతాలనుంచి వచ్చేవారికి ఇది పెద్దసమస్యే. చెన్నై, ముంబై, బెంగళూరు తరహాలో ఇంటినెంబర్లను ప్రకటించే విధానాన్ని జిహెచ్‌ఎమ్‌సి పరిశీలిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒకేసారి అన్ని సర్కిళ్లలో అమలు చేస్తే గందరగోళం ఉండదు.
-కె.హెచ్.శివాజీరావు, హైదరాబాద్
ఆకతాయిలను అడ్డుకోండి
విశాఖ నగరంలో ఆకతాయిలకు హద్దులేకుండాపోయింది. పార్కులు, పెద్దగా రద్దీ ఉండని ప్రభుత్వ భవనాలు, స్థలాల్లో వీరు తిష్టవేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పార్కులు, ఉద్యానవనాలు, పబ్లిక్ ప్రాంతాల్లో ఎవరైనా వీరిని మందలిస్తే దాడికి పాల్పడుతున్నారు. బెదరించి చోరీలూ చేస్తున్నారు. అధికారులు, పోలీసులు స్పందించి ఆయా ప్రాంతాల్లో ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలి.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం
అధిక ధరలతో అవస్థలు
దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా బాగున్నాయని అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటిస్తున్నారు. ఎన్నో కొత్తకొత్త పథకాలను అమలు చేస్తున్నారు. కానీ సామాన్యులకు అవసరమైన నిత్యావసరాలు, పెట్రోల్, డీజిల్ వంటి ధరలకు మాత్రం కళ్లెం పడటం లేదు. పెట్రో ఉత్పత్తుల ధరలు నెలకో రెండునెలలకో పెరుగుతూనే ఉన్నాయి. దాని ప్రభావం నిత్యావసరాలపై పడుతోంది. ఏతావతా సామాన్యుడికి భారమవుతోంది. నగదురహిత విధానాలకు అలవాటుపడాలన్న ప్రభుత్వ ఆశయం మంచిదే. కానీ దానిని అమలు చేయడం కోసం బ్యాంకులు విధిస్తున్న చార్జీలు, తప్పనిసరి వసూళ్లు సామాన్యులకు భారమవుతున్నాయి. పేదలకు కష్టాలు కలిగించని చట్టాలు చేసి ఆదుకోవలసి ఉంది.
-ఈశ్వర్, ప్రొద్దుటూరు
పెద్దపల్లి జిల్లా పేరు మార్చాలి
ఒకప్పటి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిని ఇప్పుడు కొత్త జిల్లాగా మార్చారు. గతంలో ఇక్కడినుంచి లోక్‌సభకు ప్రాతనిధ్యం వహించిన జి.వెంకటస్వామి పేరును పెట్టాల్సిన అవసరం ఉంది. తెలుగు రాష్ట్రాలకు, కరీంనగర్ జిల్లాకు ఆయన చేసిన సేవలు నిరుపమానమైనవి. ప్రజాసేవలో తరించిన ఆయన పేరును పెద్దపల్లికి బదులుగా పెడితే నిజమైన నివాళి అర్పించినట్లు అవుతుంది.
-కోలిపాక శ్రీనివాస్, బెల్లంపల్లి