ఉత్తరాయణం

వెకిలిచేష్టలే కామెడీ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ అమాయక భర్త, అందమైన భార్య- ఆ దంపతుల మధ్యలో ఓ కొంటె మనిషి చేరడం, వారిమధ్య అల్లరి చే యడం, ఆ అమాయకుడి భార్యను లేవదీసుకుపోవడం- మధ్య మధ్యలో లేడీ యాంకర్‌పై జోకులు- దానికి ఆమె మెలికలు తిరిగిపోతూ వెకిలితనపు చేష్టలు.. ఇంకోసారి ఓ అమ్మాయికి లవ్ లెటర్ రాయడం, అది పొరపాటున తల్లికి ఇవ్వడం, ఆ తల్లి తన ప్రేమను అంగీకరించడం, మరొకసారి ఆడపిల్లల తండ్రి బ్యాచిలర్స్‌కి ఇల్లు అద్దెకివ్వడం- వాళ్లు ఇంట్లోంచి లేచిపోయేలా ప్రోత్సహించడం లేదా పనిమనిషితో యజమాని సంబంధం పెట్టుకోవడం- దానికి యజమానులు ఇంకేదో చేయడం.. ప్రసుతం ప్రతి టీవీ చానెల్‌లోనూ కామెడీ షోలు ఇదే ఫార్ములాను అనుసరిస్తున్నాయి. అటు తిప్పి ఇటు తిప్పి అక్రమ సంబంధాలు, అరుపులు, కేకలు, అరవై బూతులు ఉంటేనే కానీ- ఒక స్కిట్ కావట్లేదు. రియాలిటీ షోలు, కామెడీ షోల పుణ్యమాని ఆడామగా తేడా లేకుండా జనాలు విచ్చలవిడిగా బూతులు మాట్లాడేస్తున్నారు. రేపో మాపో ఈ పదాలన్నింటినీ తెలుగు నిఘంటువులో చేర్చాలేమో! అంతేకాదు, ‘పక్కింటివాడి పెళ్లాన్ని లేపుకుపోవడం’ అనే కానె్సప్టును చాలా చక్కగా ప్రమోట్ చేస్తున్నారు కామెడీ షోల నిర్వాహకులు. ఎవరు ఎక్కువ బూతులు పలుకుతారో, ఎవరు ఎంత వెకిలితనం ఒలకబోస్తారో వారికే న్యాయనిర్ణేతలు కూడా మార్కులు గుమ్మరిస్తున్నారు. పైగా న్యాయనిర్ణేతల నవ్వులకి టీవీ పగిలిపోతుందేమో అనిపిస్తుంది. అయినా జనాలు కూడా ఇవే చూస్తున్నారు లెండి. అవును మరి, వాళ్ళు చూపిస్తున్నారు కాబట్టి మనం చూస్తున్నాం.
-చావలి శేషాద్రి సోమయాజులు, సాలూరు
నలుపుదనం నేరమా?
‘మా దేశంలో వర్ణవివక్ష లేదు. దక్షిణాదివారు నల్లగా ఉన్నా వారితో కలిసి పనిచేస్తున్నాం..’ అని భాజపా ఎంపి అనడంలో తప్పు లేకపోయినా, ‘జనసేన’ అధినేత పవన్‌కల్యాణ్ సహా కొందరు నేతలు రభస చేస్తున్నారు. నిజానికి ‘నలుపుదనం’ పట్ల ఆంధ్రులకు వివక్ష లేదా? నల్లగా ఉన్న కొందరు నటీనటులు అంగుళం మందాన ముఖానికి పౌడర్లు పూసుకొని తెరమీద ఎర్రగా కనిపించడం లేదా? నటుడు బాబూమోహన్ రంగు, ఆకారంపై హాస్యం పేరిట సినిమాల్లో ఎన్ని సెటైర్లు వేయలేదు? ఆయన ఎన్నిసార్లు తన్నులు తినడం మనం చూడలేదు. నలుపుని వెక్కిరిస్తూ ఎన్ని టీవీ షోలు రావడం లేదు? చర్మాన్ని మెరిపించే సౌందర్య పోషకాల ప్రకటనలు ఎందుకు వెల్లువెత్తుతున్నాయి? నల్లగా ఉన్న అబ్బాయిలు సైతం తెల్లటి వధువుల కోసం వెంపర్లాడడం లేదా? నలుపు నేరమా?
-మరుద కాశి, కరప