ఉత్తరాయణం

‘సెల్‌వన్’తో సమస్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిఎస్‌ఎన్‌ఎల్ (సెల్‌వన్) వినియోగదారులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సాయంత్రం పూట నెట్‌వర్క్ అందుబాటులో ఉండటం లేదు. ప్రైవేట్ నెట్‌ర్క్‌లు మెరుగైన సేవలు అందిస్తుంటే బిఎస్‌ఎన్‌ఎల్ మాత్రం బాగా వెనుకబడిపోతోంది. ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి చాలామంది ఈ నెట్‌వర్క్‌లో వున్నారు. ప్రైవేట్ నెట్‌వర్క్‌లు ఆకర్షణీయమన ఆఫర్‌లతో దూసుకునిపోతుంటే సెల్‌వన్ డీలా పడుతోంది. దీంతో సెల్‌వన్‌పై ఎవరూ ఆసక్తి చూపడం లేదు. వినియోగదారులకు సెల్‌వన్ ఇకనైనా మెరుగైన సెవలు అందించవలసిన అవసరం వుంది.
-షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్ (గద్వాల జిల్లా)
డిఎ మంజూరు చేయరా?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, విశ్రాంత ఉద్యోగులకు కరవుభత్యాన్ని (డిఎ) వెంటనే మంజూరు చేయాలి. 2016 జూలై, 2017 జనవరి నుంచి రెండు విడతల డిఎను మంజూరు చేయాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కరవుభత్యాన్ని మంజూరు చేసిన సంగతి తెలిసిందే. నిత్యావసర వస్తువుల ధరలు నానాటికీ పెరుగుతున్నప్పటికీ కరువుభత్యాన్ని మంజూరు చేయకపోవడం విచారకరం. అలాగే, వేతన సవరణ (పిఆర్‌సి) తర్వాత పది నెలలు బకాయిలు సైతం ఇంతవరకు విడుదల కాలేదు. ఉద్యోగుల సంక్షేమాన్ని గమనంలోకి తీసుకొని డిఎను మంజూరుచేస్తూ వెంటనే ఉత్తర్వులను జారీచేయాలి.
-వాండ్రంగి కొండలరావు, పొందూరు
యథేచ్ఛగా ఫీజుల దోపిడీ
అవి స్కూళ్లా? వ్యాపార సంస్థలా? అన్న అనుమానం మనకు అక్కర్లేదు. అవి కొద్దిపాటి పెట్టుబడితో భారీ లాభాలు ఆర్జించే వ్యాపార సంస్థలే. అక్కడ అమ్మేది విద్య, మార్కులు, సర్ట్ఫికెట్లు మాత్రమే కాదు పుస్తకాలు, యూనిఫాంలు, షూలు, పెన్నులు, పెన్సిళ్లు వగైరా.. మార్కెట్ రేట్లకంటే బాగా ఎక్కువ. సేల్స్‌టాక్స్, లైసెన్స్ లాంటివి కట్టరు. తెలుగు కూడా సరిగా మాట్లాడలేని ఒకటో తరగతి కుర్రాడికి ఫ్రెంచ్ భాష కూడా నేర్పుతారట! ఫీజు కేవలం నలభై వేలు. హైస్కూలు కుర్రాడి నుంచి లక్షల్లో ఫీజు దోపిడీ చేసే ‘అంతర్జాతీయ’ విద్యాసంస్థలూ ఉన్నాయి! ఏటా విద్యా సంవత్సరం మొదలైతే చాలు ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో ఫీజుల దోపిడీకి అంతే ఉండదు.
-హితేష్, రమణయ్యపేట
హింసను అణచివేయాలి
కాశ్మీర్‌లో అశాంతి వాతావరణం తరచూ ఏర్పడుతున్నది. పాకిస్తాన్ నుంచి చొరబడే ఉగ్రవాదులు చేసే బీభత్సమే కాకుండా వేర్పాటువాదులు ఏదో వంక పెట్టుకొని అల్లర్లకు దిగుతూ పోలీసులపై రాళ్లు రువ్వడం, పోలీసులు కాల్పులు జరపడం నిత్యకృత్యమైంది. పాక్ ఉగ్రవాదులను, వేర్పాటువాదులను, రాళ్లు రువ్వేవాళ్లని అరెస్టు చేసి కేసులు పెట్టాలి. వారిని బయట తిరగనిచ్చినా ఏదో అల్లర్లను పురిగొల్పడమో, చొరబాటుదారులకు మద్దతుగా ప్రవర్తించడమో జరుగుతున్నది. అలాగే, పలు రాష్ట్రాల్లో పేట్రేగిపోతున్న మావోయిస్టులను కట్టడి చేయాలి. వీరిని అంతం చేసేందుకు కేంద్ర హోం శాఖ ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలి. మావోయిస్టు సమస్య శాంతిభద్రతల సమస్యే కాదు, దేశ సార్వభౌమాధికారంపై దీన్ని సాయుధ తిరుగుబాటుగా గుర్తించాలి. దండకారణ్యం, కాశ్మీర్‌లను కల్లోలిత ప్రాంతాలుగా ప్రకటించి శాంతిభద్రతలను కాపాడాలి.
-వంగూరి వెంకట్రామయ్య, సిద్ధాంతం