ఉత్తరాయణం

కుల ప్రాతిపదికపై సంక్షేమమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్రాహ్మణ కులస్థుల సంక్షేమానికి కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ఆహ్వానించదగ్గ పరిణామమే. కులంతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారిని పేదరికం నుంచి తప్పించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాల్సి ఉంది. మేధావి వర్గంగా, ఘనమైన సంస్కృతి కలిగిన బ్రాహ్మణులను అగ్రవర్ణాలుగా పరిగణిస్తున్నారు. ఆర్థికంగా చేయూతనిస్తే తప్ప ఎంతటి మేధావి వర్గమైనా మంచి జీవనాన్ని సాగించలేదు. అలాగే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అగ్రవర్ణాలుగా పేర్కొనబడుతున్న రెడ్డి, కమ్మ, వెలమ,వైశ్య, క్షత్రియ కులస్థుల్లోనూ ఎంతోమంది పేదలున్నారు. కులం ఆధారంగా వీరంతా అభివృద్ధి చెందినవారని భావించలేం. అగ్రవర్ణాల్లో పేదల కోసం మరిన్ని కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బిసి, ఎంబిసి కులాల వారికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. తమకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని, రిజర్వేషన్లు పెంచాలని వివిధ కులాలు, మతాల వారు డిమాండ్ చేస్తున్నారు. కులం, మతం ప్రాతిపదికగా సౌకర్యాలు పెంచాలనడం సరికాదు. ఆర్థిక స్థితిగతులను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. సమాజంలో కులాల వారీగా, మతాల వారీగా ఇప్పటికే ఏర్పడ్డ చీలికలు భవిష్యత్‌లో మరింత బలపడే ప్రమాదం ఉంది. ఇది జాతీయ సమగ్రతకు ఆటంకం కలిగిస్తుంది. కుల ఘర్షణలు, మతోన్మాదం వంటి విపరిణామాలు చోటుచేసుకునే అవకాశం లేకపోలేదు. సంక్షేమ పథకాలు పేదలను ఉద్ధరించాలే తప్ప కులమతాల పేరిట చీలికలు ఎల్లకాలం కొనసాగడానికి కాదని పాలకులు గ్రహించాలి.
- డా. టి.హనుమాన్ చౌదరి, సికింద్రాబాద్
శభాష్.. యోగి
గతంలో ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, హిందూ అతివాదిగా ముద్రపడిన ఆదిత్యనాథ్ యోగి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక పాలనలో సంస్కరణలు చేపడుతూ ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. పలు సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటూ పాలనావ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తూ అధికారులను ఆయన పరుగులు తీయిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు, బహిరంగ ప్రదేశాల్లో పాన్, గుట్కాల నిషేధం, ఈవ్ టీజింగ్ పాల్పడే వారిపై చర్యలు, రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా, మంత్రులు- ఉన్నతాధికారుల ఆస్తుల వెల్లడి.. వంటి చర్యలతో సిఎం యోగి జనం నుంచి జేజేలు అందుకుంటున్నారు. ఫిర్యాదులపై తక్షణ స్పందన, పోలీసు స్టేషన్లలో దాఖలయ్యే కేసులపై సత్వర విచారణకు సంబంధించి ఆయన ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛతను పరిరక్షించేందుకు కూడా ఆయన పలు చర్యలు ప్రారంభించడం హర్షణీయం. యోగి నిర్ణయాలను ఇతర ముఖ్యమంత్రులు కూడా ఆదర్శంగా తీసుకోవాలి.
- ఎం.కనకదుర్గ, తెనాలి