ఉత్తరాయణం

యోగి కరక్టే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఈ దేశాన్ని పాలించిన మొఘల్ పాలకులంతా దురాక్రమణదారులే’ అని యుపి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అనడం ఆయన గుండెలోంచి వచ్చిన కఠిన వాస్తవం! ‘ఈ విషయాన్ని ఆమోదిస్తేనే దేశంలోని సమస్యలన్నీ సమసిపోతాయి. మనకి ఆదర్శ దేశ నాయకులు మహారాణా ప్రతాప్, గురు గోవిందసింగ్, ఛత్రపతి శివాజీలు’ అని ఆయన అన్నది కూడా వాస్తవమే. ఒట్టి దురాక్రమణదారులే కాదు, భయంకరమైన మతతత్వవాదులు కూడా అయిన బాబర్, ఔరంగజేబుల విషయం బాహాటంగానే అందరికీ తెలుసు. కానీ, అక్బరు కూడా నెహ్రూ కాలం నుంచి పైకి కనిపించకుండా దాచబడిన అంతటి భయంకరుడే. అక్బరు రాజస్తాన్‌లోని అజ్మీర్‌కు దిల్లీ నుంచి వస్తూ గ్రామాలకు గ్రామాలను బలవంతంగా కత్తితో మతాంతరీకరణ చేసాడు. అసలు నేడు దేశంలోని ముస్లిం మహిళలే అంటున్నారుగా ‘మేం హిందువులుగా మారిపోతాం’ అని. దీన్నిబట్టి ఒవైసీ లాంటి కొద్దిమందే వ్యతిరేకులు తప్ప, ఎక్కువమంది ముస్లింలు ఈ దేశభక్తులే. యోగి ఆదిత్యనాథ్‌ను పీఠం మీద కూర్చోబెట్టింది వీళ్లే కదా! నెట్‌లో చూస్తే ఎంతటి ఘోరాలు అక్బరు, తుగ్లక్, టిప్పు సుల్తాను వగైరాలు చేసారో మనకు తెలుస్తుంది. ఇతర మతాల వారిని హింసించని, మతతత్వం లేని, దురాక్రమణ చేయని ముస్లిం పాలకుడు ప్రపంచంలో ఇక ముందు పుట్టాలి తప్ప ఇంతవరకు లేడు! కనుక దురాక్రమణ దారుల గురించి గొప్పగా చరిత్ర రాయించి నేర్పేవాళ్లు కాదు మన నాయకులు, వాళ్లను చీల్చి చెండాడి దేశం కోసం తమ జీవితాలను అరగదీసుకున్న వారే మన అసలైన నాయకులు!.
-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు, ఏలూరు
కరవు రైతులను ఆదుకోండి
ఎపిలో అనంతపురం జిల్లా వ్యవసాయ రంగంతో పాటు అన్ని విషయాల్లోనూ వెనుకబడిపోతోంది. సాగునీటి కొరతతోపాటు తాగునీటి సమస్యను ప్రజలు తీవ్రస్థాయిలో ఎదుర్కొంటున్నారు. ఈ జిల్లాలో ప్రధాన పంట వేరుశెనగ వర్షాధారపు పంట. గత ఏడాది వర్షాలు లేవు. ఈ ఏడాది ఇలాగే వుంటే రైతుల పరిస్థితి అగమ్య గోచరం. కరవుకోరల్లో నలుగుతున్న జిల్లా రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. దాహార్తిని తీర్చాలి. రైతులకు రుణమాఫీతోపాటు ఆర్థిక సాయం అందించాలి. పనులు లేక చాలామంది గ్రామీణులు వలస పోయే పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ కూలీలను, చిన్న రైతులను ఆర్థికంగా ఆదుకోవాలి.
-ఎల్.ప్రపుల్ల చంద్ర, ధర్మవరం
విదేశీ సరకులు గొప్పవా?
విదేశీ వస్తువులు నాణ్యమైన ప్రమాణాలతో మన వస్తువుల కన్నా బాగా వుంటాయని మన నమ్మకం. అమెరికాలో ఏం జరిగిందో చూడండి. వర్జీనియాకు చెందిన ఫ్లెమ్ అనే మహిళ గత 40 ఏళ్లుగా జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ టాల్కం పౌడర్‌ను వాడుతూ క్యాన్సర్ బారిన పడిందట. ఆ వ్యాధి ఉదర భాగం నుంచి కాలేయానికి వ్యాపించగా సెయింట్ లూరుూస్ న్యాయస్థానంలో కేసు వేసింది. ఆ పొడర్‌ని పరీక్షింపచేసి, ఫ్లెమ్‌కి 700 కోట్లు పరిహారం ఇవ్వాలని సంబంధిత కంపెనీని కోర్టు ఆదేశించింది. గత కొంతకాలంగా సుమారు రెండు వేలమంది ఇలాంటి ఫిర్యాదులే చేసి పరిహారం పొందారట. విదేశీ వస్తువులు నాణ్యమైనవి అనుకోవడం భ్రమ.
-శుభ, కాకినాడ