ఉత్తరాయణం

చైనాను ఎలా నమ్మడం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఘనమైన ఆదర్శ ఉమ్మడి ప్రయోజనాల స్వప్నాల్ని ఆవిష్కరిస్తూ చైనా తలపెట్టిన ‘ఒకే బెల్ట్, ఒకే రోడ్డు’ సందర్భంగా జరిగిన వాణిజ్య సదస్సుని భారత్ బహిష్కరించడం సరైన చర్యే. ఆ సదస్సులో యూరప్ దేశాలు కొన్ని అభ్యంతరాలు వ్యక్తపరచడం సమంజసమే. ఏ దేశపు వాదన ఏమైనప్పటికీ, భారత తన వాదన నుండి పక్కకు జరగకపోవడం ఒక సార్వభౌమిక దేశం చెయ్యాల్సిన విశ్వాస ప్రదర్శనే. ఆసియా, యూరప్, ఆఫ్రికా ఖండాల్ని కలుపుతూ ఒకే రోడ్డు మార్గం ఏర్పడితే దేశాల మధ్య వాణిజ్యం సులభతరవౌతుందని, ఉమ్మడి అభివృద్ధి సిద్ధిస్తుందని చైనా తలపెట్టిన ‘మహా మార్గం’ ఊహల్లో అద్భుతంగా ఉంది. గతంలో ఉన్న సిల్క్ మార్గాల్ని ఉటంకించడం మరింత ఆకర్షణీయంగా ఉంది. అయితే అదెప్పుడు సాధ్యం? ఆ మార్గానికి నిర్మాణ భాగస్వాములైన, భూ యజమానులైన దేశాల మధ్య ఆరోగ్యకర సంబంధాలున్నప్పుడు మాత్రమే లక్ష్యం సిద్ధిస్తుంది. ఆరోగ్యకర వాణిజ్యం, వసుధైక కుటుంబ భావన, ఉమ్మడి అభివృద్ధి ఉన్నపుడు, రహస్య ఎజెండాలు లేనప్పుడు అది సాధ్యం. వీటిని చైనా నుండి ఆశించగలమా!
పాకిస్తాన్ సంగతిని పక్కన పెడితే, చైనా ఒక్క విషయంలోనైనా భారత్ పట్ల ఉదారంగా ఆలోచించిన దాఖలాలున్నాయా? ముంబైలో దాడులకు పాల్పడి పాకిస్తాన్‌లో తలదాచుకున్న ఉగ్రవాదుల పెద్ద తలకాల్ని బోనెక్కించే ప్రయత్నాల్ని ప్రపంచమంతా గుర్తించినా, చైనా దొంగ నిద్ర నటిస్తోంది. వారిని గుర్తించడానికి చైనాకి కళ్ళముందున్న సాక్ష్యాలు ఏ మూలకు చాలవట. భారత్‌కి ఐక్యరాజ్యసమితిలో శాశ్వత సభ్యత్వం ఇచ్చే ప్రయత్నాలకు మోకాలడ్డుతోంది. అణు సరఫరా దేశాల సరసన సభ్యత్వానికి మనకు అడ్డు తగులుతోంది. అరుణాచల్ ప్రదేశ్‌ని కొత్త కొత్త పేర్లతో తన భూభాగామన్నట్టు ప్రకటిస్తోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో భారత్ ప్రమేయం, అంగీకారం లేకుండా రోడ్డు మార్గాల ప్రణాళికల్ని రచిస్తోంది. ఇవన్నీ సుహృద్భావం పాదుకొల్పే ప్రయత్నాలా? ఉమ్మడి లక్ష్యాలకు మార్గాలా? అలా అంటే భారత నమ్మేయాలా? మారుతున్న ప్రపంచ ముఖచిత్రంలో ఎవరికి ఎవరూ శాశ్వత మిత్రులూ కారు, శాశ్వత శత్రువులూ కారు. ఉమ్మడి ప్రయోజనాలకు దారుల్ని అనే్వషించాల్సిందే. ఉభయుల మధ్య ఆరోగ్యకర సంబంధాల్ని సాధించాకే ఇది కుదురుతుంది. ‘మీ నట్టింట్లోనుంచి మొదట రోడ్డేసిస్తాం, తర్వాత మీరూ దాన్ని వాడుకోవచ్చు’ తరహా ఆలోచనలకు అట్టే ఆయుష్షు ఉండదు. ఆచరణలో మెట్టు మెట్టూ పైకెక్కినప్పుడే ఆదర్శాలను అందుకోవడం సాధ్యం.
-డా. డివిజి శంకర్‌రావు, పార్వతీపురం

ఆమె అలా అనలేదు..
ఈ దేశపు తొలి మహిళా న్యాయమూర్తిగా పనిచేసిన లీలాసేథ్, ఆమె కుమారుడు విక్రమ్ సేథ్‌ల గురించి సోమవారం సంచికలో జి.లచ్చయ్య రాసిన వ్యాసంలో కొన్ని వివరాలు పూర్తిగా నిరాధారం. ‘ఆన్ బ్యాలెన్స్’ పేరిట లీలాసేథ్ రాసిన స్వీయచరిత్రలో- తన కుమారుడి లైంగిక ధోరణి గురించి ఎలాంటి అరమరికలు లేకుండా ఆమె విస్తృతంగా చర్చించారు. స్వలింగ సంపర్కుడైన తన కుమారుడి గురించి ప్రస్తావించినందున సహజంగానే చాలామంది సమీక్షకులు ఆమె రాసిన పుస్తకంపై ఎక్కువగానే ఆసక్తి చూపారు. కుమారుడి విపరీత లైంగిక ధోరణి నిజమేనని అంగీకరించిన ఆమె ఆ విషయాన్ని ఏ విధంగానూ ఖండించలేదు, ఎలాంటి తీర్పులు ఇవ్వలేదు. తన కుమారుడు అనైతిక కార్యకలాపాలలో పాల్గొనడం శిక్షార్హమని కూడా ఆమె అనలేదు. ‘ఆన్ బ్యాలెన్స్’ చదివితే ఆమె ఏం చెప్పారో, ఏం చెప్పలేదో మనకు అవగతమవుతుంది. కుమారుడి నేర ప్రవర్తనను ఆమె అంగీకరించారన్న ప్రశే్న ఉత్పన్నం కాదు. స్వలింగ సంపర్కం శిక్షార్హమైన నేరమని సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడానికి ముందు, ఆ తర్వాత కూడా లీలాసేథ్ అభిప్రాయాలు నిలకడగానే ఉన్నాయి. స్వలింగ సంపర్కం నేరమని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చాక- తన కుమారుడిపై నేరస్థుడన్న ముద్ర అన్యాయంగా పడిందని ఆమె వేదన చెందారు. స్వలింగ సంపర్కం నేరం కాదని, ఆ ప్రవర్తన గలవారిని అలాగే వదిలేయాలని, ఎలాంటి శిక్షలు విధించరాదని ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలోని చాలామంది న్యాయ నిపుణుల వలే ఆమె కూడా- ‘విచలనమైన ప్రవర్తన’ కలిగిన వారిని నేరస్థులుగా చూడరాదని భావించారు. తన కుమారుడికి అనుకూలంగా గాని, వ్యతిరేకంగా గాని లీలాసేథ్ ఎన్నడూ ఒక్క మాట కూడా చెప్పలేదు. విక్రమ్ సేథ్‌కు శిక్ష పడకుండా రక్షణ కవచంలా ఆమె ఏనాడూ నిలవలేదు.
palanki_suryanarayana@rediffmail.com