ఉత్తరాయణం

కఠిన చర్యలు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెఎన్‌యుకు కాదేదీ అనర్హం. నిరోధ్‌లు, డ్రగ్‌లు, దేశద్రోహులకు జిందాబాద్‌లు. పేరు సబర్మతీ దాభా. హాస్టల్ గోడలపై ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతుగా పోస్టర్లు ప్రత్యక్షం. గంగా దాభా వేదికగా కన్హయ్య కుమార్ జాతివ్యతిరేక ప్రసంగం. మొన్నటికి మొన్న ఓ ప్రొఫెసర్ మణిపూర్‌ను చైనాలో విలీనం చేయమని ప్రసంగం. సిపిఎంకు బెంగాల్, కేరళల్లో భావ ప్రకటన ఎవరైనా తెలియజేస్తే నచ్చదు కానీ జెఎన్‌యులో మాత్రం వారు స్వేచ్ఛగా జాతి వ్యతిరేకులను చంకనెత్తుకుంటారు. కుక్కగొడుగుల్లా పుట్టుకొచ్చిన రివల్యూషనరీ కల్చరల్ ఫ్రంట్, స్టూడెంట్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, క్రాంతికార నౌ జవాన్ సభ, అంబేద్కర్ పూలె స్టూడెంట్ అసోసియేషన్లకు జాతీయ భావనలు ఎంతమాత్రం గిట్టవు. ఈ విజాతీయ విద్యార్థి సంఘాలకు పలు ఎన్జీవోలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నాయి. కేంద్ర హోంశాఖ వీటి భరతం పట్టకపోతే జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం అఫ్జల్ గురు విశ్వవిద్యాలయంగా రూపొందుతుంది. మీనాక్షీ పురం రెహ్మత్ పురంగా మారుతుంది.
- దండు కృష్ణశర్మ, సికిందరాబాద్

లైబ్రేరియన్లను పర్మినెంట్ చేయాలి
తెలంగాణ రాష్టల్రోని వివిధ గ్రంథాలయాల్లో గత 28 ఏళ్లుగా పనిచేస్తున్న వారిని రెగ్యులర్ చేయాలి. చాలీ చాలని జీతంతో పనిచేస్తున్న వీరిని ప్రభుత్వం ఇప్పటి వరకు పర్మినెంట్ చేయలేదు. సిబ్బంది కొరత వల్ల ఒక్కొక్క లైబ్రేరియన్‌కు రెండు గ్రంథాలయాల బాధ్యతలను అప్పగిస్తున్నారు. జీతం పెంచడం కంటె, పర్మినెంట్ చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం వీరి విషయంలో సత్వరం తగిన నిర్ణయం తీసుకోవాలి.
-ఎం.్భస్కర్, గాంధారి, నిజామాబాద్ జిల్లా

పూర్తి ఫలితాన్నివ్వని స్వచ్ఛ్భారత్
స్వచ్ఛ్భారత్ కార్యక్రమ స్ఫూర్తి ప్రజల్లోకి వెళ్లినా, ఆచరణలో ఇంకా పూర్తిగా ఫలప్రదం కాలేదు. ఇంకా చాలా చోట్ల బహిరంగ మలవిసర్జన జరుగుతూనే ఉంది. శాస్త్రం విఫలమైన చోట్ల శస్త్ర ప్రయోగం విజయవంతమవుతుంది కాబట్టి, గ్రామ, పట్టణ శివార్లలో అపరిశుభ్రత తాండవిస్తే దానికి పంచాయతీ, మున్సిపాలిటీ పాలక మండళ్లను బాధ్యులను చేయాలి. కొన్ని చోట్ల మరుగుదొడ్ల సౌకర్యం ఉన్నవారు కూడా వాటిని వాడటం లేదు. ఇటువంటి వారిలో మార్పులకోసం కృషి చేయాలి. మరుగుదొడ్డి నిర్మాణానికి ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని ఇతర విధాలుగా ఉపయోగించడానికి రాజకీయ నాయకులు ప్రోత్సహించరాదు.
- పి.ఆర్.వి.ఎస్. ఆచార్యులు, నక్కపల్లి, విశాఖ

మారుతున్న విద్యావిధానాలు
స్వతంత్ర భారత్‌లో విద్యావిధానాలు తరచుగా మారుతున్నాయి. ఇదివరకటి విద్యా ప్రమాణాలు క్రమశిక్షణ ఇప్పుడు లేవు. ప్రభుత్వం మారితే విద్యా విధానం మారుతున్నది. ఇది సరైన పద్ధతి కాదు. నైతిక విలువల శిక్షణ తప్పనిసరిగా ఉండి తీరాలి. డొనేషన్లు ఎక్కువగా పెరగడం వల్ల, ధనికులకే ఉత్తమ విద్య అందుతోంది. అందుకే ధార్మిక నిష్టతో పిల్లలకు విద్యను నేర్పాలి. తరతమ భేదాలుండరాదు. అప్పుడు మాత్రమే అందరికీ సమానమైన విద్య అందుబాటులోకి వస్తుంది. సమాన విద్య అందుబాటులోకి వస్తేనే, సమసమాజం సాధ్యం.
- ఈమని సువర్ణం, కపిలేశ్వరపురం

మోదీ చేసిన తప్పేంటి?
బెయిల్‌పై విడుదలై వచ్చిన కన్నయ్య కుమార్, భాజపాపై, ఆరెస్సెస్ పై, ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకు పడటం ఎంతవరకు సమంజసం? దేశంలో ఆరు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన నిర్వాకాలకు వీరు బాధ్యులా? దేశాన్ని భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ వారిని ఇతగాడు పల్లెత్తుమాట కూడా అనలేదు. దేశంలో ఎన్ని బాంబుపేలుళ్లు జరిగాయ? ఎన్ని రైళ్లు తగలబెట్టారు? మహిళలపై అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు..ఇవన్నీ కన్హయ్యకుమార్‌కు కనిపించడం లేదా?
- గుడ్ల జగదీశ్వర్, న్యూ నల్లకుంట, హైదరాబాద్

నష్టాన్ని వసూలు చేయాలి
రిజర్వేషన్ల ముసుగులో దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న హింసాకాండ సందర్భంగా ప్రజల ఆస్తి అయిన రైల్వేలను, బస్సులను ధ్వంసం చేస్తున్నారు. అటువంటి ఉద్యమాలకు నాయకత్వం వహిస్తున్న నేతలు, సంస్థల నుంచే నష్టపరిహారాన్ని వసూలు చేసే విధంగా చట్టాన్ని సవరించాలి. హింస ద్వారా దేన్నీ సాధించడం సాధ్యం కాదు.
- వేదుల జనార్థన్ రావు, వంకాయలగూడెం