ఉత్తరాయణం

చెత్తపోస్తున్న అమెరికా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్యావరణ పరిరక్షణకై 196 దేశాల మధ్య జరిగిన ‘పారిస్ ఒప్పందం’ నుండి అమెరికా నిష్క్రమించడం పూర్తిగా బాధ్యతా రాహిత్యం. పారిశ్రామికీకరణ అనంతరం గత శతాబ్దంలో భూమిపై పేరుకుపోయిన టన్నుల కొద్దీ వ్యర్థ పదార్థాలలో 27 శాతం అమెరికావారి చలవే. పర్యావరణాన్ని పాడుచేసే కర్బన ఉద్గారాలు వెలువడుతున్న ప్రపంచ దేశాల్లో అమెరికాది రెండో స్థానం. అది గత సంవత్సరం 16 శాతం మేరకు ఉంది. భారత్ వాటా 6 శాతానికి మించదు. అయినా, బాధ్యతగా భారత్ పారిస్ ఒప్పందానికి కట్టుబడి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నప్పుడు 16 శాతం కాలుష్య కారకమైన అమెరికా తప్పుకోవడం సరికాదు. పైగా ఈ ఒప్పందంతో భారత్, చైనాలు ఇబ్బడిముబ్బడిగా లాభపడతాయని, తమ దేశం ఉద్యోగాలు, వనరులు కోల్పోతుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దొంగ ఏడుపులు మొదలుపెట్టాడు. ఇలాంటి తీరునే ‘మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కడం’ అంటారు. ‘ఇల్లంతా చెత్తపోసి, మీరే సర్దుకోండ’ని జారిపోయిన పెద్దన్నగా అమెరికా ప్రవర్తించడం అసహ్యకరం. అయితే ఒక్క దుందుడుకు దేశం వల్ల మొత్తం కార్యక్రమం పట్టాలు తప్పరాదు. ఇప్పటికే భూతాపం పెరిగి వాతావరణం, రుతువులు, వర్షపాతం అస్తవ్యస్తమయ్యాయి. ఇదేతీరు కొనసాగిస్తే భూగోళం జీవరాశులకు నరక లోకంగా తయారవ్వడం ఖాయం. ఆ స్థితిని కనీసం కొంత కాలం వాయిదా వెయ్యడానికి జరుగుతున్న ప్రయత్నాలే ఈ అంతర్జాతీయ ఒప్పందాలు. వీటికి ఉద్దేశ పూర్వకంగా తూట్లుపొడిచే దేశాలపై ఇతర దేశాలన్నీ కలిసి ఒత్తిడి తీసుకురావాలి, ఆంక్షలు విధించాలి, మెడలు వంచాలి. ధరిత్రిని మాతృమూర్తిగా భావించి, పూజించే సంస్కారం ఆది నుండి ఉన్న భారత్ అందుకు నాయకత్వం వహించాలి.
- డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
అమిత్ షా అత్యుత్సాహం!
తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలకు అసంతృప్తి ఉందేమో కానీ, ప్రజల్లో ఆ భావన లేదు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రావాలన్న తపనతో స్థానిక భాజపా నేతలు రాసి ఇచ్చిన ఉపన్యాసాన్ని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవల తెలంగాణ పర్యటనలో చదివి వినిపించినట్టుంది. తెలంగాణ ప్రభుత్వంపై అమిత్ షా దుమ్మెత్తి పోశారు. కానీ, ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఆ ప్రభుత్వ పనితీరుపై ఆయన ఒక్క విమర్శ కూడా చేయలేదు. కేవలం రాజకీయ కోణంలోనే ఆయన తెలంగాణలో పర్యటించారు. తెలంగాణలో అధికారంలోకి వచ్చేంత స్థాయి బిజెపికి ఇప్పటికైతే లేదు. ఆంధ్రలోనూ ఆ పార్టీ క్యాడర్ అంతంత మాత్రమే. ప్రధాని మోదీ తెలుగురాష్ట్రాల సిఎంలతో సఖ్యతగానే ఉన్నారు. కానీ- రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించాల్సిన అమిత్ షా రాజకీయ ద్వేషంతో మాట్లాడడం సరికాదు.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్