ఉత్తరాయణం

తెలుగు రత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవితకు అందమమరె
తెలుగు వెలుగు కుదిరె
భావమధురిమదిరె
చాంగురే బంగారు మన సినారె

తెలుగులో గజలుకు జీవమిచ్చింది వీరె
కవులందరిలోన వీరి దారి వేరె
బహుళ శైలియందీయనారితేరె
తెలుగు భాషకు తెచ్చె గొప్ప పేరె
ఘనమైన కవివర్య మన సినారె

విశ్వంబరాన తన కీర్తియలరె
జ్ఞానపీఠాన తన స్థానమమరె
నిండుగా వెలిగేటి తెలుగు రత్నము వీరె
మట్టిలో మనిషివెళ్లి ఆకాశమును కోరె
తత్వబోధతోడ మనసు తట్టినారె
మనసున్న మారాజు మా సినారె

తనకు తానె సాటి భళారే సినారె
శాశ్వతంబైనట్టి కీర్తిశిఖ సినారె
అమర్ రహే సినారె..
అమర్ రహె సినారె
- చావలి శేషాద్రి సోమయాజులు, సాలూరు
కవిరాజుకు నివాళి

ఎవరి మాట పాటలా కవిత్వమైందో
ఎవరి శ్వాసలో సాహిత్య సౌరభాలు
పరిమళించాయో
ఎవరి సాహిత్య ఒరవడిలో మానవతా
ఫలాలు విరగపండాయో
ఎవరి సాహితీ సేద్యంలో తెలంగాణ మట్టి పరిమళం
దిగంతాలకు వ్యాపించిందో
ఎవరి పాటల పల్లవులతో చరణాలతో
సినీ పరిశ్రమ మేనంతా సొగసు పూచిందో
ఆ కవిరాజు సినారెకి
గులాబీల నీరాజన నివాళి
- గులాబీల మల్లారెడ్డి, కరీంనగర్