ఉత్తరాయణం

ఆరోగ్య పరిరక్షణ దీక్ష ఏదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈనెల మొదటి వారంలో నవ నిర్మాణ దీక్ష పాటించింది. ఇక జరగాల్సింది ‘ఆరోగ్య పరిరక్షణ దీక్ష’. కొత్త విద్యా సంవత్సరంలో బడులు తెరుచుకున్నాయి. వర్షాలు మొదలయ్యాయి. విష జ్వరాల సీజన్ కూడా ప్రవేశించినట్టే. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మన్య ప్రాంతం ఏటేటా ఇదే సీజన్లో మంచాన పడడం మొదలవుతుంది. సంక్షేమ హాస్టళ్లు కూడా అనారోగ్య కేంద్రాలుగా మారడం, వందల సంఖ్యలో విద్యార్థులు రోగ పీడితులుగా మారడం, పదుల సంఖ్యలో పిల్లలు మృత్యువాత పడడం గత కొనే్నళ్లుగా క్రమం తప్పకుండా జరుగుతున్న విషాద ఘట్టం. ఈసారి కూడా పొంచి ఉన్న ఈప్రమాదాన్ని వీలైనంత మేర నిలువరించడానికి ప్రభుత్వం ముందస్తు చర్యలు గైకొనాలి. ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కోవడానికి ఎలాగైతే సన్నద్ధతా ప్రణాళికలుంటాయో, అదే తరహాలో రానున్న అనారోగ్య ఉపద్రవానికి కూడా ప్రణాళికలుండాలి. వసతి గృహాల్లో రక్షిత మంచినీరు, పౌష్టికాహారం, పరిశుభ్ర పరిసరాలు, దోమల నివారణ చర్యలు, ప్రాథమికంగా అవసరమయ్యే మందులు వుంచడంతోపాటు ఆరోగ్య సహాయకులను ఇరవైనాలుగు గంటలు అందుబాటులో ఉండేలా నియమించాలి. హాస్టళ్లలో వైద్యుల తనిఖీ ప్రతి వారం జరగాలి. అనారోగ్య పీడితులను మెరుగైన చికిత్సకు ఆసుపత్రికి వెంటనే పంపేలా ఒక బాధ్యుడ్ని ప్రతి వసతి గృహానికి నియమించాలి. ఈ చర్యలన్నింటినీ సమగ్రంగా నిర్ణీత వ్యవధిలో ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి అధికారి సమీక్ష చేస్తుండాలి. మన్య ప్రాంతంలో చాలాచోట్ల వైద్యాధికారుల, ఇతర సిబ్బంది ఖాళీల్ని వెంటనే భర్తీ చేయాలి. మెడికల్ కాంపుల్ని నిర్వహించాలి. రాబోతున్న ఆరోగ్య అత్యయిక స్థితిని ముందుగానే ఎదుర్కొనేలా సిద్ధమైతే చాలామటుకు తీవ్రతను తగ్గించవచ్చు. ముఖ్యమంత్రి జాగు చేయకుండా ఆరోగ్య పరిరక్షణ దీక్ష ప్రకటించడం అత్యవసరం.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
ఆ సంతకం దూరమైంది..
ఒక మహా సాహితీ నక్షత్రం భువి నుండి ధృవతారై నింగిన వెలసింది. హనుమాజీపేటలో తనువు దిద్దుకున్న ఆనవాలు కనుమరుగైంది. పేటపేటంతా రోదించింది. ‘గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి’ల ప్రవాహం ఆగిపోయి కన్నీళ్లు ఉబికాయి. రవీంద్ర భారతి, త్యాగరాయ గానసభ ప్రాంగణాలు మా ‘సినారె’ జాడేదని మూగచూపులు చూస్తున్నాయ్. తెలుగునేల నలు చెరగులా విస్తరించిన రచయితలందరి గుండెలు గుభేలుమని.. ఏడి మా విశ్వంభరుడని.. అతని జాడకై వెతుకుతున్నాయ్. ఒయ్యారాలు పోయి, వంపులొలికే సినారె సంతకం ఏ రీతి మాకు దక్కుతుందని బిక్కుబిక్కుమంటున్న వారెందరో! శుభాశీస్సులు-ప్రోత్సాహకాలు-శుభాకాంక్షలందించే మనోహర ‘సినారె’ రూపం మాకిక కలేనా-కల్లయేనా! అని భావి కవుల బారులు తీరిన మనస్సులు మ్రాన్పడిపోతున్నాయి! తెలుగు సాహితీ సమరాంగణ సార్వభౌముడై సాహితీ క్షేత్రానికి కుల, మత, ప్రాంత, జాతి ఏవీ ఎల్లలు కావని నీతిని నమ్మిన నిఖార్సైన -పుంభావ సరస్వతీ రూపం మన కనులకింక కనిపించదా? అని కలవరిస్తూ కన్నీటిమయమైంది జన సంద్రం. ‘మరణం నన్ను వరించి వస్తే ఏమంటాను’ అన్న గజల్‌లోని భావం ‘ఏమీ అనలేను.. ఆహ్వానిస్తానన్న’ట్టు కవిరాజు మహాప్రస్థానం చేశాడు. ‘తనే ప్రశ్న-తనే సమాధానం’గా ఆ జీవితం సాగింది.
- మడిపల్లి భద్రయ్య, నిర్మల్