ఉత్తరాయణం

ప్లాస్టిక్ బియ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినియోగదారులకు ఏ మాత్రం తెలియకుండా పాలు, పళ్లు, కూరలు, చివరకు నీళ్లు కూడా కల్తీమయం చేసి ఆరోగ్యాలను చెడగొడుతున్నారు. నీతి నియమాలు లేని లాభాపేక్షే పరమావధిగా భావించే వ్యాపారులు ఇప్పుడు కల్తీ బియ్యం ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారుచేసి మంచి బియ్యంలో కలిపి అమ్ముతున్నారని వింటున్నాం. ఈ దొంగ వ్యాపారాన్ని బహిర్గతం చేసిన వ్యక్తిని చితకబాదారుట. చైనా, పాకిస్తాన్‌లనుంచి ఈ ప్లాస్టిక్ బియ్యం దిగుమతి అవుతోందని వార్తల్లో వింటున్నాం. వ్యాపారులు ఇలా విచ్చలవిడిగా రెచ్చిపోవడానికి రెండు ముఖ్య కారణాలు- మొదటిది ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోవడం, రెండవది తమకేం కాదులే. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకునే వ్యాపారులు కృత్రిమ బియ్యం అమ్మేవారికి దొంగలకు, దోపిడీదారులకు తేడా ఏం లేదు.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
ప్రత్యేక హోదా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ మూడేళ్లుగా ఉద్యమిస్తున్నాం. రాహుల్ నేతృత్వంలో జాతీయ ఉద్యమ స్థాయికి తీసుకెళతాం అని రఘువీరా అనడం భలే కామెడీగా ఉంది. అధికారంలో ఉన్నప్పుడు హోదా విషయం విభజన చట్టంలో చేర్చకుండా గండికొట్టిన కాంగ్రెస్, అధికారం పోయాక హోదా కోసం పోరాటం నటించడం కామెడీ కాదు భరోసా సభకు లక్షమందిని సమీకరిస్తామని చెప్పి పదివేలమందిని కూడా సమీకరించలేని రఘువీరా హోదాపై జాతీయ స్థాయి ఉద్యమం నిర్మిస్తాననడం కామెడీ కదూ! రాష్ట్ర హితం కోరితే తమిళనాడుని ఆదర్శంగా తీసుకుని కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం మేలు.
-సి.మైథిలి, సర్పవరం
రాష్టప్రతి ఎన్నిక
భారత రాష్టప్రతి ఎన్నిక వచ్చే నెలలో జరుగబోతోంది. అయితే ఈ ఎన్నికలో చెల్లని ఓట్లు ప్రతిసారీ నమోదు అవుతున్నాయి. 2012లో జరిగిన రాష్టప్రతి ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఐదుగురు, దేశం మొత్తంమీద 81 మంది ఓట్లు చెల్లకుండా పోయాయి. ఇలా 2007లో, 2002లో, 1997లో, 1992లో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఒకప్పుడు చట్టసభల్లో చదువుకోనివారు ప్రాతినిధ్యం ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయినా ఓటుహక్కు కూడా సద్వినియోగం చేసుకోవడం తెలియనివారు ప్రజలకు ఏపాటి సేవలు అందించగలరు? ఎన్నికకముందు మన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఓటువేయడం గురించి శిక్షణా తరగతులు నిర్వహించాలి.
-డి.అశోక్, గోధూర్