ఉత్తరాయణం

సమాజ భాగస్వామ్యం ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వచ్ఛ భారత్ పేర అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది విజయవంతం కావాలంటే సమాజ భాగస్వామ్యం తప్పనిసరి. దీనితో సమానంగా పర్యావరణ పరిరక్షణ కూడా భాగమే. ముఖ్యంగ మన దేశాన్ని ప్రపంచాన్ని ప్లాస్టిక్ భూతం పట్టి పీడిస్తోంది. దీన్ని నివారించాలంటే ప్రజలు సహకరించాలి. కాలుష్యం పెరగడానికి వర్షపాతం తగ్గడానికి ముఖ్య కారణం ఇదే. దీనికొరకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు గ్రామ పంచాయతీ ఇఓ సాహసోపేత నిర్ణయమైన ప్లాస్టిక్ నివారణకు చర్యలు తీసుకున్నారు. దీనిపై సామాజిక కార్యకర్తలు, అనేక సంఘాలు మొదట హర్షించారు. కానీ చిరు దుకాణాలవారికి ఇది చేదు నిర్ణయంగా మారింది. మన ఆరోగ్యాలు బాగుండాలన్నా, వర్షాలు రావాలన్నా ప్లాస్టిక్ నివారణే ముఖ్యం. దీనికి ప్రభుత్వాలు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ మార్గాలైన సహజ సంచుల ఉత్పత్తితో పాటు ప్రజలను చైతన్య పరిచే పని చేయాలి.
-కొత్తపల్లి పోషన్న, ములుగు
కల్తీ.. కల్తీ.. కల్తీ
అత్యాశాపరులు ధనార్జనే ధ్యేయంగా అడ్డదారులు తొక్కుతూ మానవ మనుగడకే ముప్పు తెస్తున్నారు. ఏమి తినాలన్నా భయం. ఏ ఆహారం చూసినా కల్తీ కల్తీ. ఇది వరకు బయట వండిన పదార్ధాలు తినొద్దు అవి తాజాగా వుండవు అని చెప్పేవారు. ఇటీవల ఆహారోత్పత్తులనే కల్తీ చేస్తున్నారని మీడియాల్లోను వార్తా పత్రికలు ప్రచారం చేస్తున్నాయి. ప్లాస్టిక్ బియ్యమని ప్లాస్టిక్ గుడ్డు అని అసలు వాటి బదులు మార్కెట్లకొచ్చాయని ప్రజలు ఏది అసలో ఏది నకిలీనో తెలియక అసలు మనమేం తింటున్నామో అర్థం కాక సతమతమవుతున్నారు. ఇక ఆర్యోం కోసం మనం వాడే మందులు చాలాకాలంనుండి కల్తీ జరుగుతున్నది. ప్రభుత్వాలు ఈ కల్తీని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలి.
-గర్నెపూడి వెంకట రత్నాకర్, హనుమకొండ
రౌండు ట్రాఫిక్ ఐలెండ్లే కట్టాలి
ఏ పిచ్చి మేధావికి ఈ పిచ్చి ఆలోచన వచ్చిందో లేకపోతే కొత్తొక వింత పాతొక రోత అనుకున్నాడో గానీ రాష్ట్రంలో గతంలో వుండే నాలుగు రోడ్ల కూడళ్ల వద్ద వుండే గుండ్రటి దిమ్మెగల ట్రాఫిక్ ఐలెండ్‌ను కొట్టి పారేసి ఏవో అర్థం పర్ధం లేని మార్పులు చేర్పులు చేసి పాదచారులకు వాహన చోదకులకు అయోమయానికి గురిచేస్తున్నారు. పైగా ఈ నూతన విధానం వలన ఏ మాత్రం ఉపయోగం కూడా లేదు. ప్రభుత్వం వెంటనే పాత పద్ధతిలో రౌండుట్రాఫిక్ ఐలెండ్లు కట్టి ప్రమాదాలను అరికట్టాలి. ఈ రౌండు ఐలెండ్ వలన వాహన చోదకులు తమ వేగాన్ని కూడా తగ్గిస్తారు.
-గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ