ఉత్తరాయణం

మలేరియాతో మన్యం గజగజ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాధారణంగా చినుకు పడిందంటే ఊరు వాడా పులకించాలి. కాని మన్యం పరిస్థితి వేరు. చినుకుల ఋతువు వస్తుందంటేనే వెన్నులో వణుకు మొదలౌతుంది. ఇక్కడ రుతుపవనాలు మృత్యు పవనాలౌతున్నాయి. వరుణుడి కంటే ముందుగానే యముడు వస్తున్నట్లుంది. గత కొనే్నళ్లుగా ఏటా జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో ఆంధ్రప్రదేశ్‌లో మన్యం మరణశయ్యగా, అనారోగ్యానికి కేంద్రంగా మారడం రివాజు అయ్యింది. ఉత్తరాంధ్ర, తూర్పు గోదావరి జిల్లాలోని మన్య ప్రాంతం యావత్తూ మలేరియా నీడలో వణుకుతోంది. ఈ ఏడాది కూడా మినహాయింపు లేదన్నది క్షేత్ర స్థాయిలో అధికారిక గణాంకాలే చెప్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో చాపరాయి ఊరిలో కేవలం రెండు వారాల్లో 16 మంది గిరిజనులు మృత్యువాతపడటం పరిస్థితి తీవ్రతను తెలియజేసేదే. ఉత్తరాంధ్ర మన్యం పరిస్థితి ఇంతకన్నా మెరుగేమీ కాదు. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ఏ స్థాయిలో సన్నద్ధత అవసరమో అదే స్థాయిలో ప్రజారోగ్య వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి వుంది. రోగ నివారణ, నియంత్రణ, తక్షణ స్పందన కోణాల్లో ముందుగానే ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధం కావాలి. రక్షిత మంచినీరు, పౌష్టికాహారం, వైద్య సిబ్బంది పర్యవేక్షణ, మందుల సరఫరా, చికిత్స విషయాల్లో సరైన చర్యలు లేనందునే పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. దట్టమైన అడవులు, గ్రామీణ ప్రాంతాలు, పేదరికం లాంటి అననుకూలతలున్న దేశాలే మలేరియాపై పూర్తి నియంత్రణ సాధించగలిగినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏటేటా వందల ప్రాణాల్ని మలేరియాకి, విషజ్వరాలకి అర్పించుకోవాల్సి రావడం సిగ్గుచేటు. ఇకనైనా ముఖ్యమంత్రి ఆరోగ్య పరిరక్షణ దీక్ష చేపట్టాలి. మన్యంలో ఆరోగ్య అత్యాయిక స్థితి ప్రకటించాలి. యుద్ధ ప్రాతిపదికన ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చాలి.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
వడ్డీరేట్లలో తేడాలు
ప్రభుత్వ బ్యాంకులలో వడ్డీరేట్లు రకరకాలుగా ఉన్నాయి. దీనివల్ల ఖాతాదారులు ఎక్కడ ఎక్కువ వడ్డీ వస్తున్నదో ఆ బ్యాంకులోకి తమ డబ్బును ప్రస్తుతం ఖాతా ఉన్న బ్యాంకు నుంచి తరలిస్తున్నారు. అలాగే, తక్కువ వడ్డీకి రుణం ఇచ్చే బ్యాంకుల ముందు ‘క్యూ’ కడుతున్నారు. ఇలా ఎందుగు జరుగుతోంది? కేంద్ర ప్రభుత్వ యాజమాన్యం కింద పనిచేస్తున్నపుడు జాతీయ బ్యాంకుల్లో ఈ తేడాలెందుకు? ప్రైవేటు బ్యాంకులు వారిష్టం వచ్చినట్లు వడ్డీరేట్లను నిర్ణయిస్తాయి. ప్రభుత్వ బ్యాంకుల్లో కూడా పోటీతత్త్వం పెరిగిందా? వడ్డీరేట్లపై ప్రభుత్వానికి అజమాయిషీ ఉండదా?
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
ఎందుకీ రాద్ధాంతం..
చిన్నపాటి వర్షానికే వెలగపూడిలోని ఏపి అసెంబ్లీలోకి నీళ్లు వచ్చేశాయనీ, ‘అదిగో పులి అంటే ఇదిగో తోక’ మాదిరి మీడియాలో కథనాలు, చర్చల పేరిట అరుపులు వెల్లువెత్తాయి. ఎవరూ ప్రత్యక్షంగా చూసింది లేదు కాని ‘అవునట!’ అంటూ విమర్శలు! అసెంబ్లీ భవనం మొత్తం ఎక్కడా ఒక్క చుక్క నీరు లేదు కాని విపక్ష నేత జగన్‌కి కేటాయించిన గది వద్దనే నీరు ఉంది. శ్లాబు లీకేజీ అయితే గోడల మీద చారలు ఉండాలి కదా, అవి లేవు. ఏసిని కలిపే గొట్టం విరిగి ఉంది. అందులోనుంచి నీళ్లు వచ్చాయి. ఇదో కుట్రలా వుందంటూ అసెంబ్లీ స్పీకర్ సిఐడి విచారణకు ఆదేశించారు. వైకాపాకు నిజనిర్థారణ కన్నా ప్రచారం కావాలి. మీడియా తమ వెంట లేకుండా స్థల పరిశీలనకు వెళ్లేది లేదని విపక్షం నిరసనకు దిగడం విడ్డూరం.
-స్నేహమాధురి, పెద్దాపురం