ఉత్తరాయణం

పిల్లలకు ఫాస్ట్ఫుడ్ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముక్కుపచ్చలారని వయసు నుండే చిన్నారుల ఆరోగ్యాన్ని తల్లిదండ్రులు తమ మూర్ఖత్వంతో చేజేతులా పాడుచేస్తున్నారు. చాక్లెట్లు, బిస్కెట్లు అలవాటు చేయడం, కూల్‌డ్రింక్స్‌కు బానిసలను చేయడం, పానీపూరీ, పిజ్జాలు, బర్గర్లు తదితర అనారోగ్యకర ఆహార పదార్థాలను తినిపించడం, ఫ్రిజ్‌లో వుంచిన నీటిని తాగించడం, కల్తీ నూనెలతో తయారైన ఫాస్ట్ఫుడ్స్‌కు బానిసలను చేయడం వంటివి పేరెంట్స్ చేస్తున్నారు. తత్ఫలితంగా పిల్లలు నిత్యం అనారోగ్యాలకు గురవుతూ నరకాన్ని అనుభవిస్తున్నారు. డబ్బును దుబారాగా ఖర్చు చేస్తూ పిల్లలను ఇలా హింసించడం అవసరమా? అదే డబ్బును పాలు, పండ్లు వంటి ఆహార పదార్థాలకు, వ్యాయామ శిక్షణకు ఖర్చు చేస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
కాశ్మీర్‌లో హింస.. పాక్ ఎజెండా
కాశ్మీర్ సమస్య రావణకాష్టంలా మారడానికి భారత్ మొండిపట్టుదలే కారణమని, ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ తన విధానాలు మార్చుకొనడం శుభ పరిణామమని, రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం జరపడానికి సిద్ధంగా ఉన్నానని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటానియో ప్రకటించడం బాధ్యతా రాహిత్యం. అవసరమైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహాయం తీసుకుంటానని ఆయన అనడం హాస్యాస్పదం. స్వాతంత్య్రం తర్వాత కాశ్మీర్ సమస్యను రగిలించి మరింత ఎగదోస్తున్న పాకిస్తాన్ దుష్టపాత్ర ప్రపంచం అంతటికీ తెలుసు. కోట్లు ఖర్చుపెట్టి ఉగ్రవాదులకు శిక్షణ ఇప్పించి కాశ్మీర్‌లోకి ప్రవేశపెట్టి విధ్వంసం సృష్టించడం పాకిస్తాన్ ఎజెండాలో ముఖ్య అంశం. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో కశ్మీర్ సమస్యను మరింత తీవ్రతరం చేయడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తోంది. కాశ్మీర్ సమస్యను పరిష్కరించే సత్తా మోదీకే ఉంది. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఆత్మహత్యల జోరు
ఈమధ్య దేశవ్యాప్తంగా ఆత్మహత్యలు అధికమయ్యాయి. ప్రేమ విఫలమై, అప్పులు తీర్చలేక, వ్యాపారంలో నష్టం వచ్చి, ఉద్యోగాలు దొరక్క, కుటుంబ కలహాలవల్ల, భర్త చనిపోవడం, భార్యాపిల్లలను సరిగా చూడకపోవడం, వదిలివేయడం.. ఇలా అనేక కారణాల వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లలను కూడా చంపేస్తున్నారు. కొందరైతే పిల్లలను అనాథలుగా చేసిపోతున్నారు. ఆర్థిక సమస్యలతో కొందరికి రోజులు గడవడం కష్టంగా ఉంటోంది. అభిమానం అడ్డొచ్చి ముష్టి ఎత్తుకోవడం అవమానంగా వీరు భావించడం అత్యంత సహజం. ఇక ఎలా బతకాలి? ఉన్నది ఒకటే దారి. అదే- ఆత్మహత్య. ఇది నేరమని భారతీయ శిక్షాస్మృతి చెప్పినా, ప్రాణం పోయిన తరువాత శిక్షేమిటి? బతికి చెడినవారికి చేయూతనిచ్చే సంస్థలు ముందుకు వచ్చి ఆదుకోవాలి. ఇందుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఎంతైనా కావాలి. లేకుంటే ఆత్మహత్యలకు అంతులేకుండా పోతుంది.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
ఉపాధి ఉత్తిమాటేనా?
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో సుమారు 35 వేల ఎకరాల భూమిని ఏపి ప్రభుత్వం సేకరించింది. భూములు ధారాదత్తం చేసిన రైతు కుటుంబాలలోని యువతకు స్కిల్ డవలప్‌మెంట్ సంస్థ సౌజన్యంతో శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు ఇప్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2015 డిసెంబర్ నాటికి 12 వేల మంది యువతీ యువకులు శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే వారిలో ఆరు వేలమంది మాత్రం శిక్షణకు అర్హులని ప్రభుత్వం ప్రకటించింది. ఏ ప్రాతిపదికన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించారన్న విషయం ఇప్పటివరకు తెలియజేయలేదు. శిక్షణ బాధ్యత తీసుకున్న సిఆర్‌డిఏ పదోవంతు దరఖాస్తుదారులకు నామమాత్రపు శిక్షణ ఇచ్చి చేతులు దులిపేసుకుంది. శిక్షణ పొందిన వారిలో సగం మందికి కూడా ఉద్యోగాలు రాలేదు. నాణ్యత లోపించినందున మొదట్లోనే చాలామంది శిక్షణ తీసుకోవడం మానేసారు. ఈ మధ్య జాబ్‌మేళా పేరిట అరకొర జీతం వచ్చే ఉద్యోగాలను ఇచ్చే కొత్తప్రహసనానికి సిఆర్‌డిఏ నాంది పలికింది. రాజధానిలో అరవై కోట్ల వ్యయంతో స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థను ఏర్పాటు చేస్తామన్న వాగ్దానం అమలుకు నోచుకోలేదు.
-ఎం.కనకదుర్గ, తెనాలి