ఉత్తరాయణం

మత్తులో యువత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాదకద్రవ్యాలు వాడి మత్తులో పడి ఆరోగ్యాన్ని, భవిష్యత్తును సర్వనాశనం చేసుకుంటున్న యువతీ యువకులు, ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈమధ్య సుమారు వెయ్యిమందికిపైగా విద్యార్థులు ఈ విషవలయంలో చిక్కుకున్నారని వస్తున్న వార్తలు మనసును కలచివేస్తున్నాయి. మత్తుమందుకోసం ఓ ఆడపిల్ల నగ్నంగా ఫొటో తీయించుకుందని విని ఆశ్చర్యం, బాధ కలిగాయి. తల్లిదండ్రులు కూడా కొంతవరకు ఈ దుస్థితికి బాధ్యత వహించాలి. పిల్లలకు అతి ఖరీదైన స్మార్ట్ ఫోన్లను కొనివ్వడం, వాటిలో అసభ్యకర దశ్యాలను వీక్షించి క్షణికావేశంలో కొందరు తప్పులు చేస్తూ జీవితాలను విషాదమయం చేసుకుంటున్నారు. చేతులు కాలాక కాలాన్ని వెనక్కి తీసుకెళ్లడం అసాధ్యమని తెలుసుకోవాలి.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
డ్రగ్స్ దందాను అణచివేయాలి
డ్రగ్స్, కల్తీల విషయంలో మరింత దూకుడుగా వెళ్లాలని, ఈ దందాలో మంత్రులు, నేతలు, ఎవరున్నా సరే కేసులు పెట్టండంటూ సాక్షాత్తూ తెలంగాణ సిఎం కెసిఆర్ పోలీస్, ఎక్సైజ్ అధికారులను ఆదేశించడం ఆయన పరిపాలనా దక్షతకు నిదర్శనం. అంతర్జాతీయ డ్రగ్స్ దళారీ కెల్విన్ తన విచారణలో కొందరు సినీ నటీనటులు, నిర్మాతలు, దర్శకులు, రాజకీయ ప్రముఖుల పేర్లు వెల్లడించాడు. డ్రగ్స్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉన్నట్టు చెబుతున్నారు. చారిత్రక నగరమైన హైదరాబాదుకి ఉన్న ఇమేజ్ డ్రగ్స్ దందాతో దెబ్బ తింటుంది. కొన్ని సంవత్సరాల నుండి డ్రగ్స్ వినియోగం చాపకింద నీరులా సాగుతోందన్నది నిజం. గత ప్రభుత్వాలు చూసీ చూడనట్టుగా వ్యవహరించాయి. హైదరాబాద్‌లో యువత, విద్యార్థులు, డ్రగ్స్ బారిన పడి తమ ఆరోగ్యం గుల్ల చేసుకుంటున్నారు. ఏజెంట్లు, బ్రోకర్ల ద్వారా డ్రగ్స్ వ్యాపారం జోరుగా సాగుతోంది. అలాగే కల్తీ వస్తువులు విచ్చలవిడిగా తయారవుతున్నాయి. వినియోగదారులు ఏది అసలైందో? ఏది కల్తీయో? తేల్చుకోలేకపోతున్నారు. కల్తీ ఆహార పదార్ధాలను వాడి అనారోగ్యం పాలవుతున్నారు. డ్రగ్స్ దందాపై ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టర్ అకున్ సబర్వాల్ ఉక్కుపాదం మోపుతున్నారు. ఆయన సెలవును ప్రభుత్వం రద్దు చేయడంతో విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని చెప్పవచ్చు. డ్రగ్స్ దందాతో సంబంధం ఉన్నవారిని కఠినంగా శిక్షించాలి. హైదరాబాద్‌ను డ్రగ్ ఫ్రీ సిటీగా మార్చాలి. యువత, విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట
‘తమ్ముళ్ల’ ధిక్కార స్వరం
గత కొంతకాలంగా టిడిపి అధినేత, ఏపి సిఎం చంద్రబాబు తన పార్టీపై పట్టు కోల్పోతున్టన్లు ప్రజలు గమనిస్తున్నారు. ఆయన ఎన్నిసార్లు హెచ్చరించినా పలు జిల్లాల్లో తెలుగు తమ్ముళ్ళు బాహాబాహీకి దిగి రచ్చకెక్కుతున్నారు. ఆయన ఎంత ఆగ్రహించినా కంట్రాక్టర్లు సకాలంలో సవ్యంగా పనులు పూర్తిచేయడం లేదు. దీంతో ఆయన స్వయంగా ‘పాత చంద్రబాబునైతే మీ పని పట్టేవాడిని’ అంటూ ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగులను హెచ్చరించడంతో తను పట్టు కోల్పోయినట్లు ఒప్పుకున్నట్టయింది. ఏ పని అయినా గుంభనగా చేసే ఆయన ఇలా బయటపడటం ప్రభుత్వానికి, పార్టీకి మంచిది కాదు.
-చంద్రిక, కాకినాడ
బోల్తాకొడుతున్న గరుడ బస్సులు
తెలుగు రాష్ట్రాలలో గరుడ బస్సుల సంఖ్య స్వల్పం. ఆ కొద్ది బస్సులే ఇప్పటికి నాలుగైదు సార్లు బోల్తాకొట్టి ప్రమాదాలకు లోనై ప్రయాణికులు తీవ్రంగా గాయపడటం, కోలుకోలేనంతగా అంగవైకల్యం కలగడం వంటి ఉదంతాలెన్నో. ఒకరిద్దరు మృత్యువాత కూడా పడ్డారు. ఈమధ్య సూర్యాపేట సమీపంలో గరుడ బస్సు బోల్తాకొట్టి నలుగురు ప్రయాణీకులు గాయపడ్డారు. సాంకేతిక లోపాల వల్ల ఈ బస్సులు బోల్తాకొడుతున్నట్లు అధికారులు కనుగొన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలు వెంటనే గరుడ బస్సులను నిపుణుల చేత పరీక్షింపజేసి, ఎలాంటి లోపాలు లేవని తేలిన తరువాతనే వాటిని నడపాలి. అప్పటివరకు వాటిని నడుపరాదు.
-యామా జనార్దన్, సూర్యాపేట