ఉత్తరాయణం

నీతులు చెబుతున్న లాలూ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనపై దాఖలైన అవినీతి కేసు భాజాపా కుట్ర, కక్ష సాధింపు అని బిహార్ మాజీ సిఎం, ఆర్‌జెడి పార్టీ అధినేత లాలూప్రసాద్ అనడం సహజమే. అయితే కుట్రలు పన్నడం, కక్ష సాధించడంలో ఆయనేమీ తక్కువ తినలేదు. గోద్రా రైలు దహనం ఘటనలో బోగీ తలుపులు బిగించి ఓ మతస్థులు రైల్వే ప్లాట్‌ఫామ్ నుంచి కిరోసిన్, పెట్రోలు వెదజల్లి నిప్పు పెట్టారని ప్రజలకు తెలుసు. రాష్ట్ర ప్రభుత్వం వేసిన విచారణ కమిషన్ దర్యాప్తు చేస్తుండగా అప్పటి రైల్వే మంత్రిగా లాలూ విచారణకు బెనర్జీ కమిషన్‌ను నియమించాడు. ‘రైలు బోగీలోని భక్తులు వంట చేసుకోవడానికి స్టౌ వెలిగించగా అగ్నిప్రమాదం జరిగింది. బయటి నుంచి మంటలు రాలేదని’ బెనర్జీ నివేదిక ఇచ్చి స్వామిభక్తి నిరూపించుకున్నా, ఆ నివేదికను బహిర్గతం చేయరాదని, ఎన్నికల ప్రచారంలో వాడరాదని సుప్రీంకోర్టు అడ్డుకుంది.

-గునే్నశ్, కొవ్వాడ
పనివేళల్లో ‘సెల్’ ఎందుకు?
సెల్‌ఫోన్ అతి వినియోగం నేడు ఎంతోమందికి తలనొప్పిని కలిగిస్తున్నది. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోనూ, వ్యాపార సంస్థల్లోనూ పనివేళల్లో నిమిషాల తరబడి ఫోన్లు మాటిమాటికీ మాట్లాడుతూ- ఎంతోమందికి ఇబ్బందిని కలిగిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కార్యాలయాల్లో పనులకు ఆటంకం, ప్రజలకు ఇబ్బంది కలుగుతోంది. అందుకే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనివేళల్లో సెల్‌ఫోన్ వినియోగాన్ని సంపూర్ణంగా నిషేధించాలి. ఆర్టీసీ బస్సులలోనూ విధి నిర్వహణలో ఉన్నపుడు డ్రైవర్లు సెల్‌ఫోన్ వినియోగించకుండా చూడాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం