ఉత్తరాయణం

ప్రాణాలు తీస్తున్న సెల్ఫీ సరదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య అరకు వెళ్లే రైల్లోంచి ఒక విద్యార్థి సెల్ఫీ తీసుకుంటూ జారి పడి ప్రాణాలు కోల్పోవడం దయనీయం. గత వారమే ఉత్తరప్రదేశ్‌లో ఏడుగురు విద్యార్థులు నదిలో బోటు షికారు చేస్తూ సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఆ సెల్ఫీయే ఆఖరి జ్ఞాపకంగా మిగిలిపోయింది. వారి బంధువులకు, సమాజానికి ఎంత గుండెకోత! ఎంతో భవిష్యత్తు ఉన్న విద్యార్థులే అధికంగా ఇలాంటి సరదాలకు బలైపోతున్నారు. ఫోన్లో సెల్ఫీ తీసుకోవడం, వెంటనే సామాజిక మాధ్యమాల్లో పోస్టుచేయడం అన్నది వేలం వెర్రిగా మారింది. అది సరదా వరకే అయితే నష్టం లేదు. వచ్చిన చిక్కల్లా అది సాహసంగా మారిపోతుంది. ఒక పిచ్చివ్యసనంగా తయారై పరిసరాల్ని, ప్రమాదాలన్ని గుర్తించలేని స్థితిలోకి నెట్టివేస్తోంది. యువత ఆసక్తి గమనించే ఆయా ఫోన్ కంపెనీలు మెరుగైన ఫ్రంట్ కెమెరా, సెల్ఫీ ప్రత్యేకం అంటూ ఫీచర్లు ప్రకటిస్తున్నాయి. సాంకేతికత ఉన్నది ముచ్చట తీర్చుకోవడానికి అవ్వాలి తప్పితే ప్రాణాలమీదకి తెచ్చుకోవడానికి కారాదు. విద్యార్థులు ఎవరికి వారే ఆ తెలివిడి నేర్చుకోవాలి. సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం కూడా నరకానికి దగ్గిరదారే. ఈ సరికొత్త మారణాయుధాలపై మీడియా, పౌర సమాజం విస్తృతంగా ప్రచారం చేయాలి. తోటివాళ్లు ఈ ప్రమాదకర ధోరణుల్ని నిరుత్సాహ పరిచినపుడు కొంత మార్పు సాధ్యమవుతుంది.
-డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
మోదీ సాధించిందేమిటి?
ప్రధాని మోదీ చేస్తున్న విన్యాసాలు చూస్తుంటే ‘ఇంట్లో ఈగలమోత బయట పల్లకీ మోత’ అన్నట్టుగా ఉంది. పెద్దనోట్ల రద్దు అన్నారు, నల్లధనం ఏ మేరకు వెలికి తీసారో తెలియదు. ‘స్వచ్ఛ భారత్’ నినాదం ఇచ్చినంత మాత్రాన అపరిశుభ్రత తొలగిపోదు. ఇరుగు పొరుగు దేశాల మధ్య ఉండాల్సింది శాంతియుత వాతావరణమే కానీ ఉద్రిక్త వాతావరణం కాదు. ఇతర దేశాల పర్యటనల్లో మోదీ ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ పర్యటనల వలన వచ్చిన ఫలితం ఏమిటో ఆయనే చెప్పాలి. స్వదేశీ ముద్ర ఎక్కడా కనబడడం లేదు. ప్రతిపక్షాలు అనైక్యతతో వ్యవహరించడమే మోదీకి కలిసి వస్తున్న అంశం.
-మార్టూరు అజయ్‌కుమార్, రామచంద్రాపురం
ప్రైవేటు వైద్యుల వైభోగం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆదరణ లేక ప్రైవేటు ఆసుపత్రుల వైపు జనం మొగ్గు చూపుతున్నారు. ఇదే అదనుగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రవేశ రుసుము మూడు నుండి ఐదు వందల రూపాయలు అత్యవసరమైతే ఇంకా అదనంగా వసూలు చేస్తున్నారు. చిన్న వ్యాధికైనా రక్తం, మూత్రం, ఇసిజి, ఎక్స్‌రే, స్కానింగ్ వంటి పరీక్షలు చేస్తున్నారు. స్కానింగ్ కేంద్రాల నుంచి ప్రైవేటు వైద్యులు కమీషన్లు పొందుతున్నారు. మందులు, సెలైన్ సీసాలు రోగికి ఉపయోగించకుండా తిరిగి మందుల దుకాణాలకు చేరవేయడం, రోగి మరణించాక కూడా భారీగా బిల్లులు వసూలు చేయడం గమనార్హం. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజులపై నియంత్రణ ఉండేలా చట్టాలు తేవాలి.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం