ఉత్తరాయణం

నీతివీర.. నేతిబీర..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిహార్‌లో మహాకూటమికి మంగళం పాడి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జెడియు నేత నితీశ్‌కుమార్ ‘కమలం’ నీడకు చేరడం ఊహించిన పరిణామమే. గత కొన్ని నెలలుగా బిజెపితో ఆయన సఖ్యంగా మెలుగుతూ రావడం, కలిసి కాపురం చేస్తున్న లాలూ పార్టీతో ఎడమొహం పెడమొహంగా వుండడం లోక విదితమే. ‘కమలం’ నీడ కోరుకోవడం నితీశ్ అవసరమే కావచ్చు, రాజకీయంగా తప్పు కాకపోవచ్చు. కానీ అందుకుచూపిన కారణాలు ఏమాత్రం నమ్మదగినవి కావు. లాలూ ‘లాంతరు’ నిండా మసిమరకలే అన్నది ఈరోజు తెలిసిన నిజం కాదు. గతంలో నితీశ్ అదే లాంతరు వెలుగులో ముఖ్యమంత్రి పీఠానికి దారి చూసుకున్నారు. ఇప్పుడు తనస్వంత రాజకీయ వ్యూహానికి అనుగుణంగా ఆలోచించినప్పుడు అవే మరకలు భరింపరానివిగా కనబడడమే వింత. అవినీతికి దూరంగా జరగడం అభినందనీయమే అయినా తన అవకాశ వాదానికి నైతిక రంగు పులమడమే అభ్యంతరకరం. అవకాశవాదం పునాదులపై ఏర్పడిన పొత్తులు ఇలానే ఉంటాయి. బిహార్‌లో మహాకూటమి ప్రయోగం ఇలా విఫలమవ్వడం ప్రతిపక్షాలకు ఒక గుణపాఠం. మోదీని, బిజెపిని ఆడిపోసుకుంటే చాలు, ఆటోమేటిక్‌గా తమ బలం పెరుగుతుందన్న భ్రమల్ని విపక్ష పార్టీలు వదిలించుకోవాలి. అధకార పక్షానికి దీటుగా బలమైన ప్రతిపక్షముంటేనే ప్రజాస్వామ్యానికి మంచిది.
-డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
తెలుగు మహాసభలు
ప్రాంతాలు వేరైనా, మాండలికాల్లో తేడాలున్నా మాట్లాడే భాష తెలుగే. దేశభాషలందు తెలుగు లెస్స అన్నా, ఇటాలియన్ ఆఫ్‌ది ఈస్ట్ అన్నా- తెలుగు భాష వికాసానికి ఎంత సేవ చేశామో ఆలోచిస్తే ఏమీ లేదనిపిస్తోంది. అన్ని ప్రైవేటు స్కూళ్లలో ఆంగ్లమే అందలమెక్కి కూర్చుంది. పాలకులు అలా కూర్చోబెట్టారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలో నిర్వహించనున్న తెలుగు మహాసభలు మొక్కుబడి కారాదు. ఈ సభలను ఉభయ తెలుగు రాష్ట్రాలు కలసి నిర్వహించాలి. ఉభయ ప్రాంతాల కవులు, రచయితలు, రాజకీయ, ఇతర రంగాలలోని ప్రముఖులను ఆహ్వానించి వారి అమూల్య అభిప్రాయాలను సేకరించి తెలుగుభాషను పునరుద్ధరించాలి. రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినా మాట్లాడే భాష తెలుగే. తెలుగు భాషాభివృద్ధికి ఉపయోగపడేలా సభలు నిర్వహించాలే తప్ప ఏదో తప్పనిసరి తంతు అన్నట్టు వుండకూడదు.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
డిప్యుటేషన్లు రద్దుచేయండి
తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా ఒకే ప్రాంతంలో ఐదు, ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసిన ఉద్యోగులను బదిలీ చేసేందుకు పూనుకుంటుంటే రాజకీయ పలుకుబడితో కొందరు ఉద్యోగులు డిప్యుటేషన్ పేరుతో యథాస్థానానికి చేరుతున్నారు. స్థానికంగా స్థిరపడ్డ, అవినీతికి అలవాటుపడ్డ వారు కొత్త స్థానానికి వెడితే ఇబ్బందులు తప్పవని భావిస్తుంటారు. రవాణా, ఇతర ఖర్చులు తగ్గించుకునేలా సొంత ఇంట్లోనే మకాం ఉంటూ డిప్యుటేషన్ ద్వారా ఏళ్ల తరబడి అదే కుర్చీలకు అతుక్కుపోతున్నారు. కొంతమంది సీనియర్ అధికారులు ఈ తతంగానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఎంత పకడ్బందీగా ఉత్తర్వులు తయారు చేసినా అమలు చేయాల్సిన అధికారులు తూట్లు పొడుస్తున్నారు. ఒకే ప్రాంతంలో ఎక్కువ కాలం పని చేయడం వల్ల రాజకీయ పరిచయాలు పెరగడం, విధుల్లో నిర్లక్ష్యం, సంక్షేమ పథకాలు అర్హులకు అందని దురవస్థకు డిప్యుటేషన్లు కారణమవుతున్నాయి. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న డిప్యుటేషన్ సిబ్బందిని తిరిగి వెనక్కి పంపాలి.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం