ఉత్తరాయణం

భయపెడుతున్న అవినీతి భూతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలోని ప్రభుత్వ కార్యాలయాలు అవినీతి అడ్డాలుగా మారాయి. సామాన్య ప్రజానీకం తమ పనుల నిమిత్తం మండల, డివిజన్, జిల్లా కేంద్రాలలోని ప్రభుత్వ కార్యాలయాలకు వెళితే పైసలివ్వనిదే ఫైలు కదలదన్న ఆరోపణలున్నాయి. ఉద్యోగులకు చేతులు తడిపితేనే పని అవుతుందన్నది బహిరంగ రహస్యం. లంచాలకు అలవాటుపడిన కొందరు అధికారులు ప్రతి పనికి ఓ రేటును నిర్ణయించి ప్రజలను నానారకాలుగా పీడించి అక్రమ సంపాదనకు మొగ్గుచూపుతున్నారు. ఒకవైపు అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ లంచగొండుల భరతం పడుతూ కేసులు నమోదుచేస్తున్నా అవినీతి తగ్గుముఖం పట్టడం లేదు. గత ప్రభుత్వంలో కంటే ప్రస్తుత ప్రభుత్వంలోనే అవినీతి తారస్థాయికి చేరిందని జనం బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ముఖ్యమంత్రి కె.సి.ఆర్ మంత్రివర్గ సమావేశాల్లో, సమీక్షా సమావేశాలలో అవినీతికి దూరంగా ఉండాలని అధికారులకు చెబుతున్నా పరిస్థితిలో మాత్రం ఎలాంటి మార్పు లేదనిపిస్తోంది. ముఖ్యంగా రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్, ఖజానా కార్యాలయం, మండల ప్రజాపరిషత్, పోలీసు, ట్రాన్స్‌పోర్టు శాఖలలో అవినీతి భారీ ఎత్తున జరుగుతోంది. గ్రామ స్థాయిలో రెవెన్యూ అధికారుల అవినీతి లీలలు చెప్పాల్సిన అవసరం లేదు. ‘మీ సేవ’ కేంద్రాలలో సైతం సర్ట్ఫికెట్లను జారీచేసినపుడు నిర్దేశించిన ధరకన్నా అధికంగా వసూలు చేస్తున్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పౌర సేవా పత్రాలను (సిటిజన్ ఛార్టర్) అమలు చేస్తేనే అవినీతి తగ్గుముఖం పడుతుంది. అవినీతికి పాల్పడే అధికారులను కఠినంగా శిక్షించాలి. చట్టాలను మరింత పకడ్బందీగా అమలుచేయాల్సిన అవసరం వుంది. అవినీతి రహిత, పారదర్శక పాలనను ప్రభుత్వం అందించాలి.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట