ఉత్తరాయణం

ఛైనా వస్తు బహిష్కరణ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో ఎక్కడ చూసినా చైనా బజార్లే. చైనా వస్తువుల విక్రయాలు యథేచ్చగా సాగుతున్నాయి. భారత్‌నుండి -ఆంధ్రనుండి ఎర్ర చందనం కలప ఎగుమతి అవుతోంది.అమరావతి నిర్మాణానికి చైనా కాంట్రాక్టు పొందింది. పవిత్ర మానస సరోవరం, టిబెట్టును కైవసం చేసుకుంది. నేపాలు హిందు రాజ్యం మావోల భోజ్యమైంది. భూటాన్ హిమాచల్ ప్రదేశ్ నుండి భారత్‌కి బదిలీ చేయదల్చింది. భారత్‌పై పాక్‌ను ఉసిగొల్పింది చైనాయే. అలాంటి చైనా శత్రురాజ్యాన్ని భారత్ వెలివేయాలి. చైనా వస్తువులు దిగుమతి నిషేధించాలి. చైనా వస్తువులు అమ్మకాలు తిరస్కరించాలి. భారతప్రభుత్వం ఇకనైనా చైనా వస్తువులు దిగుమతి, విక్రయాలను నిషేధించి సహాయ నిరాకరణ చేపడితేగానీ దుర్భుద్ధి మానదని తెలియజేస్తున్నాను.
-సీరపుమల్లేశ్వరరావు, కాశీబుగ్గ
చైనా దుశ్చర్యలు..
చైనా కమ్యూనిస్టుల ప్రభుత్వ నియంతృత్వానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతున్న నోబుల్ శాంతి బహుమతి గ్రహీత లియుజియబ్‌ని నిర్బంధించి, హింసించి మరణానికి కారణమైన చైనా అమానుష వైఖరిని యావత్ ప్రపంచం తీవ్రంగా ఖండించాలి. భారతదేశంలో టెర్రరిస్టులను, నక్సలైట్లను స మర్ధిస్తూ వారిపట్ల అపార సానుభూతిని కురిపిస్తున్న ఈ దేశం జాతిపట్ల వ్యతిరేక భావజాలం కలిగిన చైనా మానసపుత్రులైన వామపక్ష భావజాలం కలిగిన మేధావులు, రచయితలు, కళాకారులు-మరి అదే చైనాతో ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడుతూ బలిదానమైన లియుజియబ్ పట్ల కనీసం సానుభూతి చూపకపోవడం వెనుక వారి ఆంతర్యమేమిటి?
-వేదుల జనార్దనరావు, వంకాయవారిగూడెం
బెల్లంపై నిషేధమా?
ఇంట్లో ఎలుకలున్నవని ఇల్లు తగలబెట్టుకున్నట్టుగా వుంది మన ప్రభుత్వం వారి పనితీరు. వరంగల్ జిల్లాలో గత నెలరోజులుగా బెల్లం లభించడంలేదు. బెల్లాన్ని అమ్మినట్టయితే మీ మీద కేసులుపెడతాము అని అబ్కారీ శాఖ వారు చెప్పిన దరిమిలా కిరాణా దుకాణాల వారందరు బెల్లాన్ని అమ్మడం మానివేసారు. బెల్లం నిషిద్ధ వస్తువైంది. కారణం గుడుంబాను తయారు చేయువారు బెల్లాన్ని కాపుతారట. గుడుంబా తయారుచేసేవారెందరు, గుడుంబాను తాగేవారెందరు, వరంగల్లు జిల్లా జనాభాలో వారి శాతం ఎంత? బెల్లాన్ని వంటల్లో వినియోగించుకునే వారందరూ ఏమి కావాలి?
-వలిగొండ కాంతరావు, హనుమకొండ
ఫీజుల భారాన్ని తగ్గించాలి
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుండి 10వ తరగతి వరకు విద్యనభ్యసిస్తున్న పిల్లలకు పుస్తకాల భారాన్ని తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ వారు నిర్ణయం తీసుకోవడం హర్షణీయం.అలాగే ప్రైవేటు పాఠశాలల్లో విపరీతంగా పెరిగిపోతున్న ఫీజుల భారాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఫీజుల భారంతో సామాన్యులు నలిగిపోతున్నారు. దానికి తోడు విద్యార్థులకు కావాల్సిన అన్ని సామగ్రులను పాఠశాలల్లోనే కొనేలా నిబంధనలు విధించి అధిక రేట్లకు విక్రయించడం, వివిధ టాలెంటు టెస్టులు రిసార్టుల పేరుతో ఫీజులు వసూలు చేయడం చేస్తున్నారు. కాబట్టి ఫీజుల భారాన్ని తగ్గించాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం