ఉత్తరాయణం

బోల్ట్ హుందాతనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జమైకా చిరుత’గా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నెంబర్ వన్ పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ తను పాల్గొన్న చివరి అంతర్జాతీయ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌కి తన హుందాతనం ద్వారా ప్రతిష్టను చేకూర్చాడు. క్రీడాస్ఫూర్తికి పట్టం గట్టాడు. దశాబ్దంగా తనకు తిరుగులేని వంద మీటర్ల పరుగుపందెంలో మొదటిస్థానం సాధించలేకపోయినా, మూడో స్థానంతో సరిపెట్టుకున్నా, సంతృప్తికరంగా కెరీర్‌కి వీడ్కోలు పలకడం ఆయన హృదయ పరిపక్వతకు నిదర్శనం. మొదటిస్థానంలో విజేతగా నిలిచిన జస్టిన్ గాల్టిన్ కాంస్య పతకం సాధించిన బోల్ట్ ముందు మోకరిల్లి తన గౌరవభావం ప్రకటించిన ఘట్టం అసలైన క్రీడాస్ఫూర్తికి దర్పణంగా క్రీడాభిమానుల జ్ఞాపకాల్లో నిక్షిప్తమై వుంటుంది. మాదక ద్రవ్యాల వినియోగంతో నిషేధానికి గురై శిక్ష అనుభవించి, తిరిగి ప్రపంచ విజేతగా నిలబడ్డ గాల్టికన్‌కు అదీ విఖ్యాత బోల్ట్‌ని చివరి పందెంలో వెనక్కు నెట్టి మరీ-ఇది అపురూప విజయం. సందేశాత్మక విజయం. దశాబ్ద కాలంగా వంద మీటర్ల పరుగులో ప్రపంచ రికార్డులు నెలకొల్పి, చివరి పోటీలో స్వర్ణ పతకం గెలవకపోయినా చిరస్థాయిలో అభిమానుల హృదయాలు గెలుచుకున్న బోల్ట్ ముందు తరాలకు ప్రేరణగా నిలుస్తాడు.
-డా.డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
నైజీరియన్లకు ఇక్కడ పనేంటి?
చదువుల కోసమా? వ్యాపారాల కోసమా? ఉద్యోగాల కోసమా? నైజీరియన్లు భారతదేశానికి ఎందుకొచ్చినట్టు? వీరి ‘వీసా’ గడువు ఎంతకాలం? గడువు పూర్తయినా వీరు తమ దేశానికి వెళ్లడం లేదు. మన దేశంలో ముఖ్యంగా హైదరాబాద్ నైజీరియన్లకు సదుపాయంగా ఉన్నదా? ‘వీసా’ గడువు తీరగానే సత్వరమే వారిని వెనక్కి పంపించి వేయాలి. ఇలా ఎందుకు జరగడం లేదు? సైబర్ నేరాలు, డ్రగ్స్ వ్యాపారంతో వీరు మమేకం అవుతున్నారు. ఇతర దేశాలలో అయితే వీసాల విషయంలో నిక్కచ్చిగా వుంటూ, కఠిన శిక్షలు వేస్తారు. ఈ వలస వచ్చిన నైజీరియన్లను వచ్చిన పనేమిటో చూసుకోకుండా అనేక అసాంఘిక కార్యకలాపాలకు ఒడిగట్టడం, డ్రగ్స్ మాఫియాగా మారి మన దేశస్థులకు మత్తు పదార్ధాలను సరఫరా చేస్తున్నారు. నేటి యువత కూడా సిగ్గు విడిచి డ్రగ్స్ సేవించి విచ్చలవిడిగా సంచరించడం, దేశ గౌరవాన్ని కించపరచడం జ రుగుతోంది. కన్నవారికి, మాతృదేశానికి ద్రోహం తలపెడుతున్న యువతకు కౌనె్సలింగ్ ద్వారా, కఠిన శిక్షల ద్వారా బుద్ధి చెప్పాలి. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఇందుకు నడుం కట్టాలి.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్