Others

వలస కూలీల బతుకులు మారవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో జరిగే ఆదివారం సంతకు ఒక ప్రత్యేకత ఉంది. సమీప గ్రామాల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో ఈ సంతకు వస్తుంటారు. ఇక్కడ పేదవర్గాల వారు పాతబట్టలను ఎగబడి మరీ కొంటారు. చౌటుప్పల్ ప్రాంతంలో వందకు పైగా చిన్న పరిశ్రమలు, ప్రైవేటు కంపెనీలు ఉంటాయి. చత్తీస్‌గఢ్, ఒడిశా, బెంగాల్, మహారాష్ట్ర, బిహార్ ప్రాంతాల నుంచి వలస వచ్చిన పేదలే ఈ కంపెనీల్లో కూలిపనులు చేస్తుంటారు. వేతనాలు సరిపడక తమ వంటిమీద దుస్తులు కూడా కొత్తవి కొనలేని దుస్థితి వీరిది. అందుకే వీరు పాతబట్టలు కొనేందుకు భారీ సంఖ్యలో సంతకు వస్తారు. ఈ వలస కూలీల బతుకులకు ఎలాంటి భరోసా లేదు. వీరిని పట్టించుకునే వారే లేరు. అభివృద్ధిలో మనం ముందుకు దూసుకువెళుతున్నామని పాలకులు చెబుతుంటారు. ఇదేనా అభివృద్ధి? ఒకరు తొడిగేసిన బట్టలను మరొకరు ఎగబడి కొనుగోలు చేస్తే అభివృద్ధా? ఇక, పాతబట్టలు అమ్మే చిరు వ్యాపారుల సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఈ చిరు వ్యాపారులకు ప్రభుత్వాలు రుణాలు అందజేసి, వారిచేత కొత్తబట్టలు విక్రయించే దుకాణాలను తెరిపించాలి. వలస కూలీలకు సరైన వేతనాలు, తగిన వసతి సౌకర్యాలను అందజేయాలి. అప్పుడే వీరు పాతబట్టలను కొనడం మానేస్తారు.
-గుండమల్ల సతీశ్‌కుమార్, సంస్థాన్ నారాయణపురం