Others

బూడిదలో పోసిన పన్నీరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతిలో అధికారులకు, ఉద్యోగులకు ప్రభుత్వ క్వార్టర్లు నిర్మించడం అభినందనీయమే. దశాబ్దాల క్రితం ఉద్యోగులకు కొన్ని చోట్ల వందలాది క్వార్టర్లు నిర్మించారు. అప్పట్లో మూలవేతనంతో అదనంగా పదిశాతం ఇంటి అద్దె అలవెన్స్‌గా చెల్లించేవారు. గత ఐదు వేతన సవరణల మూలంగా మూలవేతనం విపరీతంగా పెరిగింది. గుమాస్తా స్థాయి ఉద్యోగికి కనీసం ఏభై వేలు వుండగా సిఆర్‌డిఏ పరిధిలో ముప్పై శాతం అదనంగా వెరసి ఇరవ వేలు చెల్లించాల్సి వస్తుంది. అంత అద్దె గుమాస్తా స్థాయి ఉద్యోగులు చెల్లించేందుకు సుముఖత చూపకపోవచ్చు. ఫలితంగా కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించే అపార్టుమెంట్లలో ఎవరూ నివాసం ఉండకపోతే నిధులు బూడిదలో పోసిన పన్నీరు కాగలదు. ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగులంతా అందుబాటులో ఉండాలనుకుంటే ఇంటి అద్దె నుండి మినహాయించాలి. గతంలో నిర్మించిన క్వార్టర్సు శిథిలావస్థకు చేరుకున్నాయి. అమరావతిలో సిబ్బంది కోసం నిర్మించే అపార్టుమెంట్లకు ఈ దుర్గతి పట్టకూడదు.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం
మారని పాక్ దూకుడు
జమ్ము- కాశ్మీర్‌లో 2008లో ప్రారంభమైన సీమాంతర వాణిజ్యం భారతదేశంలో ఉగ్రవాద దుశ్చర్యలకు దోహదం చేస్తోందన్న నిఘా వర్గాల నివేదిక పట్ల మన ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ నుండి అధీన రేఖను దాటి వస్తున్న వాణిజ్య వాహనాలలో ఆయుధాలు, బాంబులు, ఆర్‌డిఎక్స్ వంటి పేలుడు పదార్ధాలు అక్రమంగా తరలిస్తున్నట్లు జాతీయ నేర పరిశోధక సంస్థ తెలియజేసింది. పేలుడు పదార్ధాలు, ఆయుధాలు చైనాలో తయారైనట్టు ధ్రువపడడం సీమాంతర వాణిజ్యం ముసుగులో ముంచుకొస్తున్న పెను ముప్పుకు నిదర్శనం. భారత్‌లో బీభత్సకాండ సృష్టించేందుకు పాకిస్తాన్ చేస్తున్న దుశ్చర్యలకు చైనా పరోక్షంగా సహాయ సహకారాలు అందిస్తున్నట్టు ఇటీవలే పట్టుబడిన ఉగ్రవాదుల ద్వారా మరొకసారి స్పష్టమైంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు, మన అధీనంలో ఉన్న జమ్ము- కాశ్మీర్‌కు మధ్య సత్సంబంధాలు నెలకొల్పేందుకు 2008లో వాజపేయి ప్రభుత్వం హయాంలో రహదారులు నిర్మించారు. మన దేశం అందించిన స్నేహహస్తాన్ని జారవిడుచుకోవడంతో పాకిస్తాన్ వికృత స్వరూపం బయటపడింది. సీమాంతర వాణిజ్యాన్ని మోదీ ప్రభుత్వం తక్షణం నిలిపివేయాలి. అధీనరేఖ పొడవునా గస్తీ ఏర్పాటు చేసి ఉగ్రవాదులు దేశంలోకి చొరబడకుండా చర్యలు చేపట్టాలి.
-ఎం.కనకదుర్గ, తెనాలి
సీట్లు పెరిగితే ప్రజలకు ఒరిగేదేమిటి?
కొన్ని పట్టణాలను వేరే జిల్లాల్లో, నియోజకవర్గాల్లో చేర్చడం వల్ల తెలంగాణలో జిల్లాల స్వరూపమే మారిపోయింది. భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని కొన్ని గ్రామాలను ఆంధ్రలో కలపడంవల్ల అగమ్య గోచరంగా వుంది. కొత్త జిల్లాల వల్ల నియోజకవర్గాల స్వరూప స్వభావాలు మారాయి. ఇప్పుడు అసెంబ్లీలో సీట్ల సంఖ్య పెంచితే ఇంకా చిన్న నియోజకవర్గాలు ఏర్పడతాయి. రాజకీయ నాయకులకు ఉపాధి కల్పించేందుకు చేస్తున్న దుర్నీతిగా దీనిని చెప్పవచ్చు. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే నేతలకు పదవులు వస్తాయే తప్ప- ప్రజలకు ఎలాంటి ప్రయోజనం వుండదు. ప్రస్తుత పాలకులు ప్రజా సమస్యలు వదిలేసి నియోజకవర్గాల పెంపు మీద దృష్టి పెడుతున్నారు. కొత్త జిల్లాలలో అభివృద్ధి పనులు విరివిగా చేపట్టాల్సిన అవసరం ఉంది. అధికారంలో ఉన్నా, లేకున్నా ఏ పార్టీ అయినా నియోజకవర్గలపైనే దృష్టి సారించాలి. కానీ, పదవులపై ఆసక్తే తప్ప ప్రజా సమస్యలపై ఎవరూ పోరాటాలు సాగించడం లేదు.
-అయినం రఘురామారావు, ఖమ్మం