ఉత్తరాయణం

ఇధి ఆత్మవంచనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘దిగ్గజాల వల్ల సాధ్యం కానిది కోహ్లీ సేన సాధించింది’ అని మురిసిపోతున్నాడు క్రికెట్ కొత్త కోచ్ రవిశాస్ర్తీ. దశాబ్దాలుగా మన క్రికెట్ దిగ్గజాలు శ్రీలంకలో ఆ దేశాన్ని టెస్ట్‌మ్యాచ్‌లలో ఓడించలేకపోయారు. ప్రప్రథమంగా ఇప్పుడు కోహ్లీ సేన ఆ ఘనత సాధించిందని రవిశాస్ర్తీ మురిపెం! కానీ ఒక సంగతి ఆయన దాచిపెడుతున్నాడు. శ్రీలంకలో ఇప్పుడు ఆనాటి దిగ్గజాలు లేవు. ఉన్న వాళ్లంతా కొత్తవాళ్లు. అందుకే మనవాళ్లు మొదటి ఇన్నింగ్స్‌లో 600 పరగులు చేయగలిగారు. స్టేడియంలో చూడవచ్చిన వారి సంఖ్య బహుస్వల్పం. ఇలాంటి మ్యాచ్ గెలిచి మనవాళ్లు ఘనకార్యం చేశారనడం ఆత్మవంచన!
-సోనాలి, సూర్యారావుపేట
శత్రుత్వం-మిత్రత్వం
రాజకీయాలలో శాశ్వత శత్రుత్వం - శాశ్వత మిత్రత్వం ఉండవనే వాస్తవాన్ని బిహార్‌లో చూస్తున్నాం. గత ఎన్నికల్లో ఆర్‌జెడితో జెడియు జతకట్టిన తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ఇపుడు అవకాశవాదిగా మారడం పదవీ వ్యామోహానికి పరాకాష్ఠ. ఒకప్పుడు ప్రధాని మోదితో రాజకీయంగా విభేదించి తీవ్ర విమర్శలు చేసిన నితీశ్ ఇపుడు లాలూతో, ఆయన కుమారుడు తేజస్వి యాదవ్‌తో బంధం తెంచుకున్నాడు. బిజెపి చెంతకు చేరి మోదీ ఆశీర్వాదం పొంది, పదవికి రాజీనామా చేసిన 24 గంటలలోపే మళ్లీ నితీశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఏ విలువలకు దర్పణం? బిహార్‌లో జెడియు, బిజెపి సంకీర్ణ ప్రభుత్వం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం. రాజకీయాల్లో ఎవరు ఎవరికి ఎప్పుడు శత్రులవుతారో, మిత్రులవుతారో అంచనా వేయడం సాధ్యమయ్యే పనికాదు.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్
కార్బయిడ్ వాడకాన్ని నిరోధించాలి
వివిధ రకాల పండ్లను కృత్రిమంగా పండించేందుకు వాడుతున్న కాల్షియం కార్బయిడ్‌ను ప్రభుత్వం నిషేధించింది. అయినా దుర్మార్గులు గుట్టు చప్పుడు కాకుండా తమ పనిని తాము కానిస్తున్నారు. ఇటీవల కార్బయిడ్‌తో పట్టుబడిన వారు ఉన్నారు. పండ్లను కృత్రిమంగా మగ్గబెట్టడాన్ని నిషేధించడమే కాదు, కార్బయిడ్ ద్వారా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న దుర్మార్గులను అత్యంత కఠినంగా శిక్షించాలి. పండ్లను విషపూరితం చేసి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ తీయడం సహించరానిది. డ్రగ్స్ మీద నిఘా వేసినట్టే ప్రభుత్వం కార్బయిడ్‌తో పండ్లను మగ్గించే వారిపై నిఘా ఉంచి తగిన చర్యలను తీసుకోవాలి.
-సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం
నోరు పెగలని లౌకికవాదులు..
కేరళలో రచయిత కె.పి.రమనున్నిపై ముస్లింలకు కోపం వచ్చింది. ముస్లిం యువతను అతడు తప్పుదారి పట్టిస్తున్నాడని ఆరోపిస్తూ ఆరు నెలల్లో ఇస్లాం స్వీకరించకపోతే కుడిచేయి, ఎడమకాలు నరికేస్తామని లేఖ రాసారు. ఆ రచయిత పోలీసులకు రిపోర్టు చేస్తే విచారిస్తామన్నారు. ఘనమైన లౌకిక పార్టీలు పాలిస్తున్న లౌకిక రాష్ట్రంలో జరిగిన ఈ ముచ్చటపై లౌకికత్వం మూర్త్భీవించిన మహానుభావులెవరూ నోరు మెదపలేదు. మీడియా కిక్కురుమనలేదు. ఈ సంఘటనే ఏదైనా భాజపా పాలిత రాష్ట్రంలో జరిగితే లౌకికవాదులు నానా రభస చేసి ‘న్యూయార్క్ టైమ్స్’కి వినిపించేట్టు గట్టిగా అరిచేవారు. ఆ పత్రిక భారత్‌లో అసహనం పెరిగిపోతున్నదని గగ్గోలు పెట్టేది.
-స్నేహమాధురి, పెద్దాపురం