ఉత్తరాయణం

ఎగురవేయ్... ఎగురవేయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎగురవేయ్... ఎగురవేయ్ జాతీయ జెండా
సత్యధర్మ సూత్రాలను - శాంతి సౌఖ్య భావాలను
మేళవించి ముందుంచిరి ఎ

అదిగదిగో జయగీతం - జనగణమన సంగీతం
రవివర్యుని పదభరితం - మన దేశపు ఘన చరితం
గొంతెత్తి పాడగా - అరుణారుణ కాంతులీనగా ఎ

నీదేరా ఈ రాజ్యం - సుజల సుఫల సుమ రాజ్యం
నీ కృషియే ఆదర్శం - నవ యువతదేర సారథ్యం
త్యాగధనమె బలముగ - భరతమాత బిడ్డగ
సమ సమాజ స్థాపనకై - ప్రగతి సిరులు కురిపించగ ఎ

- మల్లాడి శ్రీనగేష్, హైదరాబాద్
వారంతా ఆర్థికవేత్తలేనా?
మోదీ విద్యావేత్త గాని, ఆర్థిక వేత్త గాని కాకపోవడంవల్ల పాలన పట్ల కనీస అవగాహన లేదని మాజీ ఎంపీ చింతామోహన్ చింత! ఇందిరా గాంధీ, రాజీవ్, తెరవెనుక ప్రధానిగా వెలుగొందిన సోనియా వీళ్లంతా విద్యావేత్తలా? ఆర్థిక వేత్తలా? ఇందిరను కోటరీ నడిపించింది, రాజీవ్‌ని మరో కోటరీ నడిపించింది. సోనియాని ఆమె ఏర్పరుచుకున్న సలహా కమిటీ నడిపింది. మోదీ విద్యావేత్త కాకపోయినా, తన వాగ్ధాటితో విదేశీయుల్ని అలరించాడు. జిఎస్టీ గురించి నిపుణులు, సిబ్బంది నెలల తరబడి కృషి చేసారని పత్రికల్లో వచ్చింది. ఏ ప్రధాని అయినా నిపుణులైన సలహాదారుల సూచన మేరకే పనిచేస్తారని కాంగ్రెస్ నేత చింతా మోహన్‌కి తెలియదా?
-్ధర్మతేజ, గొడారిగుంట