ఉత్తరాయణం

వృద్ధి రేటు నిరాశాజనకమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అధికారిక మధ్యంతర ఆర్థిక సర్వే ప్రకారం రాబోయే సంవత్సరం వృద్ధిపరంగా ఆశాజనకంగా ఉండదు. తొలుత భావించినట్లు స్థూల జాతీయోత్పత్తి 7 శాతం సాధించడం దుర్లభం. తక్కువగా ఉండే అవకాశాలే ఎక్కువ. దాదాపు అన్ని రంగాలూ వృద్ధిలో నేల చూపులు చూడడమే ఇందుకు కారణం. పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి వంటి చర్యలతో దేశాన్ని ఆర్థికంగా కొత్త పుంతలు తొక్కిస్తున్నట్లు నమ్ముతున్న ప్రభుత్వం ఈ గణాంకాలతోనైనా కళ్లు తెరవాలి. ప్రమాద ఘంటికల్ని గుర్తించాలి. ప్రభుత్వ ఖజానాకు పన్నుల రాబడి పెరిగిందని, రాయితీల వ్యయం తగ్గిస్తున్నామని ఆలోచించే ముందు క్షేత్ర స్థాయిలో మందగించిన అభివృద్ధిని గుర్తించాలి. పెద్దనోట్ల రద్దు తరువాత స్థిరంగాప్రజలకు జరిగిన మేలు ఇదీ అని చెప్పే పరిస్థితి లేదు. అందుబాటులో ఉన్న గణాంకాల ద్వారా వృద్ధి రేటు తగ్గడమే తెలియవచ్చింది. పూర్తిస్థాయి మదింపు ఉంటే కరెన్సీ అందుబాటులో లేక కుదేలైన ఇన్‌ఫార్మల్ సెక్టార్‌కి తగిలిన దెబ్బ తీవ్రత తెలిసివచ్చేది. నిర్మాణ రంగం, వ్యవసాయం, పారిశ్రామిక రంగం, తదితర ఉపాధి కల్పనల్లో ముఖ్య రంగాలు అనుకొన్న తీరులో ముందుకు నడవలేకపోవడం వల్ల సర్వేలో ప్రతిబింబించిన దానికన్నా వాస్తవంలో నష్టం అత్యధికం. ప్రధాని నరేంద్ర మోదీ ‘క్విట్ ఇండియా’ స్ఫూర్తితో పేదరికం, అవినీతి, పౌష్టికాహార లేమిపై యుద్ధం ప్రకటించి ఐదేళ్ళలో విజయం సాధిద్దామంటున్నారు. విప్లవాత్మక నిర్ణయాలతో దేశం ఆర్థికంగా బలోపేతమైందని, మరింత వృద్ధి సాధిద్దామంటూ చెప్తున్నారు. అధికారిక లెక్కలే అపశకునం పలుకుతున్నాయని ఆయన గుర్తించాలి. వ్యవసాయ రుణాల మాఫీ లాంటి చర్యలవల్ల వృద్ధి రేటు పడిపోతుందన్న కుహనా వాదాలకు, పేదలకిచ్చే రాయితీల్ని ఉపసంహరించడం ద్వారా ఆర్థిక అద్భుతాలు సాధించగలమన్న తప్పుడు భావనలకు స్వస్తి పలకాలి. ఇంటా బయటా ఉపాధి, ఉద్యోగాలు తగ్గుతున్న వేళ, వ్యవసాయం సంక్షోభంలో ఉన్న వేళ మరింత వాస్తవిక దృక్పథం అవసరం. అందరి అభివృద్ధితోనే ఆర్థిక వృద్ధి సాధ్యం. అందుకు తగ్గ ప్రణాళికలు అవసరం.
-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
మాటలు కాదు, చేతలు కావాలి...
‘ప్రభుత్వ బడుల్లోనే చదివించండి, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే వైద్యం పొందండి’ అంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రజలకు పదే పదే చెబుతుంటారు. కాని వారు మాత్రం ఆచరించరు. అయితే, ఇందుకు భిన్నంగా తమ మాటలను చేతల్లో చూపిన రంపచోడరం ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి దినేష్‌కుమార్, ఆయన భార్య రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయకృష్ణన్ అభినందనీయులు. రంపచోడవరం ప్ర భుత్వ ఆసుపత్రిలో విజయకృష్ణన్ ప్రసూతి సేవలు పొంది మగ బిడ్డకు జన్మనిచ్చారు. కాగా, నేడు చిరుద్యోగులు సైతం అప్పులు చేసి మరీ తమ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తూ, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్యం చేయిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో, విద్యాసంస్థల్లో సిబ్బంది అలసత్వం కారణంగా సామాన్య ప్రజలు సేవలకు దూరవౌతున్నారు. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రభుత్వ ఆస్పత్రులను, పాఠశాలలను ఉపయోగించుకుంటే వారిని చూసైనా పేదలు, మధ్య తరగతి వారు సక్రమ సేవలు పొందగలరు. పాలకులు చెప్పే మాటలు చేతలలో చూపితే ప్రభుత్వ సంస్థలు బలోపేతం కాగలవు.
-యర్రమోతు ధర్మరాజు, ధవళేశ్వరం