ఉత్తరాయణం

బ్యాంకు నిబంధనలు దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ మధ్య బ్యాంకులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఎస్‌బిఐ సేవింగ్స్ బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వ మూడు వేల రూపాయలు ఉంచాలని, నెలలో ఎటిఎంను మూడు లావాదేవీలకు పరిమితం చేయడం సామాన్య ప్రజలకు ఇబ్బందిగా వుంది. పేదలు, విద్యార్థులు తమ ఖాతాల్లో కొంత నిల్వ చేయాలనుకుంటారు. ఒకప్పుడు కనీస నగదు నిల్వ 500 ఉంటే చాలని చాలామంది ఖాతాలు తెరిచారు. ఒక్కసారిగా దీన్ని మూడువేలకు పెంచడం వల్ల నిల్వ తగ్గితే నెలకు 90 రూపాయలు తగ్గించడం బాధపెడుతోంది. ఈ నిర్ణయాన్ని ఎస్‌బిఐ రద్దు చేస్తే బాగుంటుంది. ఒకవైపు జీరో బాలెన్స్ అకౌంట్లు తెరిపించి , మరొక వైపు కనీస మొత్తాన్ని 3 వేలకు పెంచడం సమంజసం కాదు. వీటికి తోడు 18 శాతం సర్వీసు చార్జీలు, చెక్‌బుక్ కావాలంటే వంద రూపాయల ఫీజు నిర్ణయించడం సబబుగా లేదు. నగదు రహిత లావాదేవీలు పెంచాలంటూ ఎటిఎంలు, చెక్‌బుక్‌లకు డబ్బు వసూలు చేయడం మంచిది కాదు. నగదు రహితం కావాలంటే ఎటిఎంలో కనీస డబ్బు తీసుకునే పద్ధతికి స్వస్తి పలకాలి. లేకపోతే చిన్న మధ్య తరగతుల ప్రజలు పొదుపు మొత్తాలు తగ్గిపోతాయి. ఇప్పటికే చాలా మంది రైతులు, పేదవారు, మధ్యతరగతి వారు బాంకులలో పొదుపు చేయడం తగ్గిపోయింది. దీనివల్ల పెట్టుబడులు తగ్గుతాయి. ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుంది.
-ఈశ్వర్, పొద్దుటూరు
మొక్కల సంరక్షణే ప్రధానం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమం భవిష్యత్తుకు బంగారు బాటగా ఉంటుంది. కానీ నాటిన మొక్కలు పెద్ద చెట్లుగా మారినప్పుడే ఫలితం వుంటుంది. ప్రతి గ్రామంలోనూ 40వేల మొక్కలు నాటినట్లు ప్రభుత్వానికి నివేదికలు చేరుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి మరో విధంగా ఉందన్నది ప్రజలకు తెలుసు. మొదటి విడత హరితహారంలో ఎన్నిమొక్కలు ఎండిపోయాయన్న విషయాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేకపోతున్నది. మొక్కలు బాగా ఎదిగితేనే ఈ పథకానికి సార్థకత ఉంటుంది. మొక్కల సంరక్షణ వివరాల సేకరణకు, ఆకస్మిక తనిఖీలకు ప్రత్యేక అధికారులను నియమిస్తే ఫలితం ఉంటుంది. అధికారుల వత్తిడి కారణంగా చాలా గ్రామాల్లో నామమాత్రంగా మొక్కలు నాటి గాలికి వదిలేసారు. ప్రభుత్వ పథకం బాగున్నా అమలు విధానమే కష్టంగా మారింది.
-వి.నవనీత్ రాజ్, మద్నూరు
న్యాయమైన తీర్పు
పనామా పేపర్స్ కేసులో లంచాలు మేసి, రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించడం వల్ల పాకిస్తాన్ సుప్రీం కోర్టులోని అయిదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ధర్మబద్ధంగా ఆ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను పదవి నుండి, రాజకీయాల నుండి శాశ్వత బహిష్కారం చేసి సరైన తీర్పునిచ్చింది. వేరేమార్గం దొరక్క షరీఫ్ పదవి నుండి వెంటనే తప్పుకోవాల్సి వచ్చింది. ఇలా గతంలో పదిహేడుమంది పాక్ ప్రధానులు తొలగించబడ్డారని వార్త. షరీఫ్ సిఫారసు చేసిన ఆయన సోదరుడు షెహనాజ్ ప్రధాని కాబోతుండడం విచిత్రం. ఉగ్రవాదం, అవినీతి, అధర్మపాలనలకు ఆలవాలమైన పాకిస్తాన్‌తో ప్రపంచ దేశాలన్నీ సంబంధాలను తెంచుకోవాలి. భారత్‌తో నిజమైన మైత్రి కోరుకునేంత వరకైనా దూరంగా ఉండాలి. పాక్‌కు దన్నుగా నిలుస్తున్న చైనా వైఖరి ఇకముందు ఎలా వుంటుందో?
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్