ఉత్తరాయణం

పాడిపంటలను అభివృద్ధి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ గొర్రెలను, చేపలను పంపిణీ చేయించి సంబంధిత కులాల వారు అభివృద్ధి చెందాలని సెలవిచ్చారు. నిజంగా పేదవర్గాలు అభివృద్ధి చెందాలంటే వారికి గేదెలను, ఆవులను పంపిణీ చేసి పాలు, పాల ఉత్పత్తులను పెంచితే మంచి ఆదాయం లభిస్తుంది. ప్రజలకు కూడా ఇవి తక్కువ ధరలకు లభిస్తాయి. పాడి పరిశ్రమను ప్రభుత్వం అభివృద్ధిలోకి తేవాలి. పాడిపశువుల పేడతో సహజ ఎరువులను తయారు చేసి పొలాలకు ఉపయోగిస్తే రసాయన ఎరువుల వాడకం నుండి విముక్తి పొంది స్వచ్ఛమైన పంటలు పండి ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి అవకాశం వుంటుంది. పేడ నుండి గ్యాస్ ఉత్పత్తిచేసి వంటకు, ఇంట్లో బల్బులు వెలగించుకోవడానికి ఉపయోగించవచ్చు. ఆవుపాలు అందరికీ శ్రేష్ఠమైనవి, ఆరోగ్యకరమైనవి. గోమూత్రం కొన్ని వ్యాధులకు ఔషధంగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలోకెల్లా మన తెలుగు ప్రాంతంలోని ఒంగోలు జాతి ఆవులు చాలా మేలైనవి. వీటిని విదేశీయులు మన దేశం నుండి తీసుకువెళ్లి గోసంతతిని వృద్ధి చేసి లాభం పొందుతున్నారు. గోవునుండి లభించే పంచ గవ్యాలతో అనేక ఔషధాలు తయారుచేసి తిరిగి మనకే అమ్ముతున్నారు. బర్రెలు, గోసంతతిని పెంపొందింపచేసి వాటివల్ల ప్రజలంతా ఆరోగ్యవంతులై దేశం సుభిక్షం కావడానికి ప్రభుత్వం శ్రద్ధతో తగిన చర్యలు సత్వరం చేపట్టాలి. ప్రతి గ్రామంలో పశువుల మేతకు కొంత భూమిని కేటాయించాలి.
-యామా జనార్దన్, సూర్యాపేట
‘యాప్’లతో ఎంతో మేలు
‘ఆధార్ కార్డు’ లేనిదే ప్రస్తుతం ఏ పనీ జరిగే పరిస్థితి లేదు. అందువల్ల ఆధార్ కార్డును ఎల్లప్పుడూ జేబులో వుంచుకుని తిరగాల్సి వస్తోంది. దీన్ని నివారిస్తూ ఒక ‘యాప్’ వచ్చేసింది. స్మార్ట్ఫోన్ వున్నవాళ్లు ఎం-ఆధార్ ఆప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆధార్ వివరాలు ప్రదర్శించవచ్చు. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్సు, వాహన రిజిస్ట్రేషన్, బీమా తదితర సమాచారం ప్రదర్శించడానికి రవాణాశాఖ వారు ఒక యాప్‌ను తయారు చేసారు. ఈ యాప్ ద్వారా వాహనం, డ్రైవింగ్ లైసెన్సు వివరాలను పోలీసులకు రవాణా శాఖ అధికారులకు ప్రయాణాల్లో అడిగినపుడు ప్రదర్శించి తమను తాము నిరూపించుకోవచ్చు. ఇదే బాటలో బ్యాంకు ఖాతా, తపాలా బ్యాంకు ఖాతా, పాన్‌కార్డు, ఎంప్లాయి ఐడి, ఓటరు గుర్తింపు కార్డులు కూడా స్మార్ట్ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకునే యాప్‌లు తయారుకావాలి. ఇలాంటి కార్డులు పాస్‌బుక్‌లు అన్నీవెంట వుంచుకుని ఇబ్బందులుపడేకన్నా మన వెంట వుండే స్మార్ట్ఫోన్‌లో అన్నింటినీ భధ్రపరచుకుని అవసరమైనప్పుడు వాటిని ప్రదర్శించుకునే వెసులుబాటు వుండాలి. ఇప్పటికే రైల్వే, ఆర్టీసీ టికెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేయించుకున్నవారికి పేపర్‌లెస్ టికెట్లను మన ఫోన్‌కి సందేశాల రూపంలో పంపిస్తున్నారు. ప్రయాణంలో ఆ సంక్షిప్త సందేశాల రూపంలో వున్న టికెట్ వివరాలను సిబ్బందికి చూపిస్తే సరిపోతుంది. దీనిద్వారా కాగితాన్ని ఆదా చేయడమే కాకుండా పర్యావరణాన్ని రక్షించిన వారమవుతాము. కనుక కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల కార్డుల కోసం, బ్యాంకు, తపాలా ఖాతాల పాస్‌బుక్‌ల కోసం ప్రత్యేక యాప్‌లు తయారు చేయాలి.
-గూరుడు అశోక్, గోదూర్