ఉత్తరాయణం

దూరదర్శన్‌లో మార్పేదీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న వివిధ కార్యక్రమాలకు ఆదీ అంతం లేదు. ఏ కార్యక్రమం ఎక్కడినుంచి మొదలవుతుందో, ఎక్కడ ముగుస్తుందో అర్థంకావడం లేదు. కార్యక్రమాల్లో వాడే తెలుగుభాష కొన్నిసార్లు గ్రాంథికంలోను, మరికొన్నిసార్లు వాడుకభాషలోనూ ఉంటోంది. ఒకే కార్యక్రమంలో ఇలా సాగడం వింతగా ఉంది. ఉన్నట్లుండి కార్యక్రమాలు మొదలవడం, అర్థంపర్థం లేకుండా సాగి అర్థంతరంగా ముగిసిపోవడం విసుగుతెప్పిస్తోంది. ప్రైవేటు చానళ్లనుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్న దూరదర్శన్, తన ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తోంది. ఆయా కార్యక్రమాలలో పాల్గొనే యాంకర్ల మాటలు సింక్ కావడం లేదు. ఇప్పటికైనా కార్యక్రమాల నిర్వహణపై దూరదర్శన్ శ్రద్ధ చూపాలి.
-కొవ్వూరు వెంకటేశ్వర ప్రసాద్, కందుకూరు
కోతులతో తంటాలు
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో ఓ వృద్ధురాలిని రెండు పందులు గాయపరిచిన సంఘటన అందరికీ తెలిసిందే. పట్టణంలో పందుల బెడదతోపాటు కోతులు, కుక్కల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై అవి స్వేచ్ఛగా తిరుగుతూ పాదచారులపై దాడి చేస్తున్నాయి. వీటిని అరికట్టేందుకు పురపాలక అధికారులు చర్యలు తీసుకోవాలి.
-ప్రొ. కె.నాగరాజరావు, కావలి.
వివరాలు లేని పట్టాలెందుకు?
ఉస్మానియా వర్శిటీ ప్రదానం చేసే ఎంబిఎ డిగ్రీ సర్ట్ఫికెట్‌లో సరైన వివరాలు ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఆయా విద్యార్థులు ఏ స్పెషలైజేషన్ చేశారన్న వివరం ఎంబిఎ పట్టాలో పేర్కొనడం లేదు. వివిధ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే పట్ట్భద్రుడు ఏదో ఒక విభాగానికి దరఖాస్తు చేసుకునే సందర్భంలో ఈ సర్ట్ఫికెట్లు సమస్యాత్మకమవుతున్నాయి. అందువల్ల ఇకముందైనా ఎంబిఎ సర్ట్ఫికెట్లలో ఆ విద్యార్థి ఏ స్పెషలైజేషన్ చేశాడో ఆ వివరాలను పేర్కొనాలి. మార్కుల జాబితాలో అన్ని సబ్జెక్టుల మార్కులు ఉంటాయిగానీ, స్పెషలైజేషన్ ఏ సబ్జెక్టో స్పష్టత ఉండదు. ఈ సమస్యను పరిష్కరించాలి.
-ఎస్.రామలక్ష్మి, సికింద్రాబాద్
రాహుల్ మారాలి
‘మా పాలనలో భారతదేశానికి పాక్, చైనా రెండే అమిత్ర దేశాలుండేవి. ఇప్పుడు మోదీ పాలనలో అన్నీ అమిత్ర దేశాలే..’ అంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అనడం అజ్ఞానమే. అసలు పాక్ పుట్టుకే నెహ్రూ, గాంధీల పొరపాటు వల్ల జరిగింది. అతిగా నమ్మి నెహ్రూ చైనాతో శత్రుత్వాన్ని సాధించాడు! సర్దార్ వల్లభభాయి పటేల్ తొలి ప్రధాని అయితే ఈ సమస్యలే వుండేవి కావు. రాహుల్ సామర్ధ్యం తెలియడం వల్లనే దశాబ్దాలుగా కాంగ్రెస్ సలహాదారుగా వున్న అహ్మద్ పటేల్ పగ్గాలు తీసుకోమని సోనియాని అర్థిస్తే, కొందరు కాంగ్రెస్ నేతలు ప్రియాంకను రంగంలోకి దించమంటున్నారు. ఇకనైనా రాహుల్ తన సలహాదార్లను, ప్రసంగాలు రాసే వారిని మార్చుకోవడం మంచిది.
-లంబకర్ణ, రాజేంద్రనగర్