ఉత్తరాయణం

ప్రాథమిక విద్య ప్రధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక కేసులో తీర్పునిస్తూ సుప్రీంకోర్టు ‘పద్నాలుగేళ్ల లోపు బాలబాలికలు తమ స్కూల్‌కై మూడు కిలోమీటర్ల దూరం నడవాల్సి రావడం అన్నది ఆమోదనీయం కాదు’ అంటూ వ్యాఖ్యానించడం ముదావహం. ఇది ప్రభుత్వాలకు పరోక్షంగా తమ బాధ్యతని గుర్తు చెయ్యడమే. ప్రాథమిక విద్య, పద్నాలుగేళ్ల వయసుదాకా అందరికీ నిర్బంధ ఉచిత విద్య అన్నది ప్రాథమిక హక్కు. దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. అయితే రకరకాల సాకులతో బడుల్ని మూసివేయడం సాధారణమైపోయింది. విద్యలో వెనకబడి ఉన్న ఆదివాసీ ప్రాంతాలతోసహా అన్ని చోట్లా ఇదే తంతు. ఫలితంగా అంతంత మాత్రంగా ఉన్న విద్య మరింత దూరంగా, భారంగా తయారై పేదలు చదువులకు స్వస్తిచెప్పే పరిస్థితుల్లోకి నెట్టివేయబడుతున్నారు. ప్రాథమిక విద్య అందించడం ప్రభుత్వం నైతిక బాధ్యత మాత్రమే కాదు, రాజ్యాంగ విధి కూడా. ప్రతి ఊరిలో బడుల్ని తెరవాలి. సుప్రీం ఆదేశంలో స్ఫూర్తిని అర్థం చేసుకోవాలి.
-డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం
హద్దుమీరిన దండన
కళాశాలలు, ప్రైవేటు విద్యాసంస్థల్లో పిల్లలపై దండన హద్దుమీరుతోంది. హోం వర్కు చేయలేదనో, యూనిఫామ్ వేసుకు రాలేదనో, శుభ్రంగా లేరనో కారణం చేత చిన్నారులను కర్కశంగా శిక్షిస్తున్నారు. లేతవయసులో ఉన్న చిన్నారులను దండిస్తున్నతీరు పసిమనసులపై దుష్ప్రభావం చూపిస్తోంది. నిజానికి శిక్షణ పొందిన ఉపాధ్యాయులు కూడా సరిగా వ్యవహరించడం లేదు. ఇలాంటి వారికి చైల్డ్ సైకాలజీపై శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రేమతో వారిని సన్మార్గంలో పెట్టడమే ఉపాధ్యాయుల బాధ్యత
-సరికొండ శ్రీనివాస రాజు, వనస్థలిపురం
రైతులకు భరోసా
రైతుల పంట రుణాలు మాఫీ చేసి, ఇన్‌పుట్ సబ్సిడీ అందించడం, ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడం వంటి చర్యలతో తెలంగాణలో రైతులకు కాస్తంత ధైర్యం వచ్చింది. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వలసలను నివారిస్తాయనడంలో సందేహం లేదు. సాదాబైనామాల వ్యవహారం కూడా పల్లెపట్టుల్లో సానుకూల ఫలితాలనే అందిస్తుంది. మొత్తం మీద ప్రస్తుత ప్రభుత్వం రైతులకు భరోసా కల్పించే దిశగా అడుగులు వేస్తోంది.
-గుండమల్ల సతీష్‌కుమార్, సంస్థాన్ నారాయణపూర్
చైనా సరుకులు వద్దు
చైనాలో తయారైన అనేక రకాల వస్తుసామాగ్రికి భారత్‌లో విపరీతమైన గిరాకీ ఉన్నదన్న సంగతి అందరకూ తెలుసు. ఈ వస్తువుల మీద పి.ఆర్.సి. అంటే పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అని ముద్రిస్తున్నారట. ఏటా రెండు లక్షల కోట్ల రూపాయలు మనదేశం నుంచి తరలిపోతున్నాయి. చైనా వస్తువులను కొనవద్దని ఎంత ప్రచారం చేస్తున్నా కొంటూనే ఉన్నారు. అందుచేత ప్రభుత్వమే ఈ వస్తువుల దిగుమతి కాకుండా చూడాలి. అప్పుడు తప్పనిసరిగా దేశీయంగా తయారైన వస్తువులనే వినియోగదారులు కొనుగోలు చేస్తారు. మన డబ్బు మనదేశంలోనే ఉంటుంది. ఈ విషయం ప్రభుత్వానికి తెలియదనుకోవాలా? చైనా వస్తువులను కొనవద్దని ప్రచారం చేసినంత మాత్రాన ఫలితం ఉండదు.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
సహకరించని సొసైటి
ఎపిస్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటి రెండు సంవత్సరాలుగా సమాచార హక్కు చట్టాన్ని అపహాస్యం చేస్తోంది. ఆరునెలలుగా ఆ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. తూర్పుగోదావరి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్‌గా విధులు, టూర్ డైరీ తదితర అంశాల అన్నీ వారి ఉద్యోగ విధుల సమాచారం కోరితే ఇవ్వడం లేదు. అది వారి వ్యక్తిగత సమాచారం కింద వస్తుందని అంటున్నారు. ఇది సమంజసం కాదు. బదిలీలు, పదోన్నతులు, బిల్లుల వ్యవహారాలలో అవకతవకలు జరిగాయన్నది ఆరోపణ. ప్రతి సమాచార దరఖాస్తుదారుడికి వాస్తవ వివరాలను అందిస్తే సమాజానికి మేలు జరుగుతుంది.
-టి.సురేశ్‌కుమార్, రాజమండ్రి