Others

నోట్ల రద్దుపై పుకార్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండువేల రూపాయల నోటును రద్దు చేసే ఉద్దేశం లేదు మొర్రో అని సాక్షాత్తు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటనలు ఇస్తున్నప్పటికీ ప్రజలు విశ్వసించకపోవడం విడ్డూరం. ఈ నోటును రద్దు చేస్తారన్న ప్రచారం బలంగా వినిపిస్తోంది. చాలామంది తమవద్ద ఉన్న 2వేల నోట్లను మార్చుకుంటున్నారు. 500, 200 నోట్లను ఎక్కువ సంఖ్యలో తమవద్ద ఉంచుకుంటున్నారు. ఇలా నోట్లు దాచుకుంటే ఎలా? అవన్నీ చలామణిలోకి రావలసిన అవసరం ఉంది. ప్రజల్లో ఉన్న అపోహను తొలగించి, దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్
ఇదేం లౌకికవాదం?
గౌరీలంకేశ్ హత్య ప్రజాస్వామ్యానికి ముంచుకొస్తున్న ముప్పును తెలియజేస్తున్నదని కుహనా లౌకికవాదులు గుండెలు బాదుకుంటున్నారు. గౌరి వామపక్షానికి చెందిన వ్యక్తికాకపోతే వీళ్లకు ఇంత చింత ఉండేదికాదు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం ఉగ్రవాదికి మరణశిక్ష అమలుచేస్తే ఆ ఉగ్రవాదికి జేజేలు పలుకుతూ యూనివర్శిటీల్లోనూ బయట సంస్మరణ దినాలు జరపడం ప్రజాస్వామ్యానికి పెనుముప్పు కాదా? అయినదానికీ, కానిదానికీ పార్లమెంటులో రచ్చచేసి ఓ డజనుమంది సభ జరగకుండా బ్లాక్‌మెయిల్ చేస్తుంటే వీళ్లకది ప్రజాస్వామ్యానికి ముప్పుగా అనిపించదు. ఆహా! ఏం లౌకికవాదులు వీళ్లు?
-బి.స్నేహమాధురి, పెద్దాపురం
అంత ఆర్భాటం అవసరమా?
తిరుమల శ్రీవారి దర్శనం సులభంగా, సంతృప్తికరంగా సాధ్యం కావడం అంత సులువు కాదు. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం గంటల తరబడి వేచిచూస్తే కొన్ని సెకన్లు దొరకడం దుర్లభం. అదే వివిఐపిలు, మంత్రులు, రాజ్యాంగ ఉన్నత పదవుల్లో ఉన్నవారికైతే టిటిడి అధికారులు, ప్రభుత్వ యంత్రాంగం దగ్గరుండి సేవచేస్తూ స్వామివారి దర్శన ఏర్పాట్లు చేస్తారు. ఆశీర్వచనం అందిస్తారు. కొత్తగా పదవులు అధిష్టించిన నాయకులకు సన్మానాలు, పేజీలకొద్దీ ప్రభుత్వ ప్రకటనలు ప్రత్యక్షమవుతాయి. ఇంత ఆర్భాటం అవసరమా? ప్రజాధనం ఇలా ఖర్చు చేయడం ఎందుకు. తిరుమలలో సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయడమే సముచితం. వీఐపీలకు ప్రత్యేక, ఆర్భాటపు ఏర్పాట్లవల్ల సాధారణ భక్తులకు అసౌకర్యం కలిగించడం భావ్యం కాదు.
-ఎ.వి.సోమయాజులు, కాకినాడ
బాధితులను ఆదుకోవాలి
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద జరుగుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల టనె్నల్ పనులలో భాగంగా పైకప్పు నుంచి బండరాళ్లు పడటంతో ఏడుగురు కార్మికులు మృత్యువాతపడటంతో వారి కుటుంబాలు రోడ్డునపడ్డట్టయింది. మరెంతోమంది క్షతగాత్రులయ్యారు. మృతులంతా వలస కార్మికులు. ఒడిశా, జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుండి వచ్చినవారు. కడుపుచేతపట్టుకుని వచ్చిన వారు ఇలా మృత్యువాతపడటంతో ఆయా కుటుంబాలవారు వీధినపడ్డారు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం సంభవించింది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం మానవతా దక్పథంతో ఆదుకోవాలి. ఈ ప్రమాదానికి అధికారుల పర్యవేక్షణ లోపం కూడా కారణం. అందువల్ల బాధ్యులపై చర్య తీసుకోవలసిన అవసరం ఉంది.
-కామిడి సతీష్‌రెడ్డి, పరకాల