ఉత్తరాయణం

కాదు కాదు కాల్పనికత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాదు కాదు! కాల్పనికత-
కనిపించే వాస్తవికత-
భారతీయ సోదరా! బహుపరాక్! బహుపరాక్!-
వాస్తవికతను గుర్తించు-
వివేకంతో ప్రవర్తించు!-
శరీరంలో పైత్యతత్వం ప్రకోపిస్తే-
పిచ్చితనం తలకెక్కుతుంది-
ఉచ్ఛనీచాలు మరచిపోతాడు-
పిచ్చివాగుడు పెచ్చరిల్లి-
నడివీధిలో నగ్నంగా తిరుగుతాడు-
కనిపించిన వారి నెల్లా రక్కుతాడు-
విషాన్ని కక్కుతాడు-
మనిషైనా అంతే-మత్తెక్కిన ఏనుగైనా అంతే-
పిచ్చిపట్టిన పెంపుడు కుక్కైనా అంతే
పెరటిలో పుచ్చిపోయిన చెట్టైనా అంతే!-
పిచ్చివాని కాళ్ళకూ చేతులకూ సంకెళ్ళు తప్పవు-
మదించిన ఏనుగుకు మావటీని అంకుశం పోటు తప్పదు-
వెఱ్ఱిపట్టిన కుక్కబుర్ర పగలగొట్టక తప్పదు-
పుచ్చిన చెట్టునూ కొట్టివేయకా తప్పదు-
ప్రకృతి సహజ వాస్తవికతను మనం గుర్తించక తప్పదు
అందుకే సోదరా! వాస్తవాన్ని గుర్తించు-
వివేకంతో ప్రవర్తించు!-
దేశ స్వాతంత్య్రంపైన వ్యక్తి స్వేచ్ఛసవారీ చేస్తూ ఉంటే-
దేశభక్తిపైన స్వామి భక్తిపచార్లు కొడుతూ ఉంటే-
పౌరసత్వాలపైన వారసత్వాలు ఊరేగుతూ ఉంటే-
స్కాముల పాములు స్వైరవిహారం చేస్తూ ఉంటే-
ఇజాల ముసుగులో నిజాలు సమాధి ఔతూ ఉంటే-
సంస్కరించే లక్ష్యంతో ముందుకు వచ్చాడొక సామాన్యుడు-
ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రధాని గద్దెనెక్కాడు-
భగ్గుమన్నాయి అసూయాపరుల గుండెలు-
ముగ్గులోకి దించాయి మూల బలగాలను-
ఇన్నాళ్ళూ తినమరగిన ఇజాల గజాలు వీధినపడ్డాయి-
పిల్ల ఏనుగులను వెంటేసుకొని అల్లరిచేస్తున్నాయి-
మాతృ దేశ గౌరవాన్ని మంటగలుపుతున్నాయి-
కనిపెంచిన తల్లిపైన కారు కూతలు కూస్తున్నాయి-
విద్యాలయాలలో విద్యలయమై వెఱ్ఱితనం చిందులు వేస్తోంది-
నడిబజారులో నంగనాచి కబుర్లతో గుబులు పుట్టిస్తున్నాయి-
స్వాతంత్య్రం అంటే స్వదేశ నిందకు లైసెన్స్ కాదు-
దేశ క్షేమాన్ని పెంచే ఫ్రీసెన్స్-
అది తెలుసుకోవాలంటే ఆలోచనల్లో ఉండాలి కామన్‌సెన్స్-
చైనాను ప్రశంసించే చిట్టిబాబులకు,-
‘‘తియాననే్మన్ స్క్వేర్’’లోని తియ్యటి చాక్లెట్లు బుల్లెట్లు రుచి చూపించాలి
‘‘శఠేశాఠ్యం’’ శఠలకు లాటీయే ఘాటైన మందు-
అందుకే మరి! - వాస్తవాన్ని గుర్తించు-
వివేకంతో ప్రవర్తించు-
- ఉమాపతి బి.శర్మ, సికిందరాబాద్ (9246171342)

‘సెట్’ను నిర్వహించాలి
పిహెచ్‌డి ప్రవేశాల కోసం, అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఉద్యోగాల భర్తీకోసం నిర్వహించే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్)2015ను నేటి వరకు నిర్వహించకపోవడం శోచనీయం. 2012, 2013, 2014లలో వరుసగా మూడుసార్లు ‘సెట్’ను విజయవంతంగా నిర్వహించిన ఉస్మానియా విశ్వవిద్యాలయం మరొకసారి ‘సెట్’ని నిర్వహించే బాధ్యతను కలిగి ఉన్నప్పటికీ ‘సెట్’ నిర్వహణపై పెదవి విప్పకపోవడం ఎంతమాత్రం సమంజం కాదు. ఇప్పటికైనా సంబంధిత బాధ్యులు, ‘సెట్’ను నిర్వహించడానికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
- జె.జె.సి.పి. బాబూరావు, మహబూబ్‌నగర్

చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి
పెరుగుతున్న మండుటెండలలో మార్చి నెలలోనే రోహిణీ కార్తెను చూస్తున్నాము. ఇక రాబోయే రెండు నెలలు వాతావరణం ఇంకెంత భయంకరంగా ఉంటుందో తలచుకుంటేనే భయం వేస్తున్నది. భాగ్యనగరంలో, ఎల్‌బి నగర్ రింగ్ రోడ్డు వంటి బస్టాపుల్లో బస్సు షెల్టర్లు లేక జనం ఆర్టీసీ బస్సుల కోసం మండుటెండల్లో గంటల తరబడి పడిగాపులు గాస్తున్నారు. భాగ్యనగరంలో అనేక జిల్లా, సిటీ బస్టాపుల వద్ద బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలి. అన్ని పట్టణాల్లోను, గ్రామ బస్టాపుల్లోను ప్రభుత్వం స్వ చ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేసి ప్రయాణికుల దాహార్తిని తీర్చాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్

రైతు సంక్షేమ బడ్జెట్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతు సంక్షేమం కోసమే ఉద్దేశించింది. అన్ని రంగాలకు అత్యం త ప్రాధాన్యతలనిచ్చారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ఎలాంటి పన్నులు లేకుండా, ఏ రంగానికి ధరలు పెంచకుండా తెలంగాణ సర్కార్ ప్రజలకు ఆర్థికభారం కాకుం డా చేసింది. మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందించేందుకు బడ్జెట్‌లో ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం బాగుంది. రాష్ట్రంలో దాదాపు 35 లక్షలమందికి ఆసరా పింఛన్లను అందిస్తున్నది. అయితే ఈ పింఛన్లు ప్రతినెల 25వ తేదీలోపు బ్యాంకుల్లో జమచేస్తున్నారు. అట్లాకాకుండా ప్రతినెల 5వ తేదీలోపునే జమచేస్తే బాగుంటుంది. ఆహార భద్రత పథకంపై విచారణ జరిపిస్తే ధనికులకు కేటాయించబడ్డ ఆహార భద్రతా కార్డులు బయటపడతాయి.
- కొలిపాల శ్రీనివాస్, బెల్లంపల్లి