ఉత్తరాయణం

చిన్న వయసులో డ్రైవింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పట్టణ ప్రాంతాలలో చాలాచోట్ల పాఠశాల వయసు నుండే పిల్లలకు బైక్, కారు డ్రైవింగ్ నేర్పించి తల్లిదండ్రులు వారిని రోడ్లపైకి వదలుతున్నారు. ఈ పిల్లలు మిక్కిలి దూకుడుగా, అతి వేగంతో అజాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదకారకులవుతున్నారు. వీరికి వీరే ప్రమాదాలను కొని తెచ్చుకోవడమేగాక అవతలి వారికీ ప్రమాదాలను తెస్తున్నారు. వీరికి చిన్న వయసులోనే డ్రైవింగ్ నేర్పి తల్లిదండ్రులు తాము ఎంత తప్పుచేస్తున్నారో గ్రహించాలి. ఇలాంటి వారిని పట్టుకొని బైకు లేదా కార్లను స్వాధీనం చేసుకోవాలి. ఆ వాహనదారులను శిక్షించాలి. ఆ వాహనదారుల లైసెన్సులను రద్దుచేయాలి. ఇలాంటి పిల్లల తల్లిదండ్రులకు గుణపాఠం చెప్పాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్

భారతీయ సంస్కృతిని కాపాడాలి
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ప్రసార మాధ్యమాలు, ఇంటర్నెట్ ద్వారా విదేశీ సంస్కృతి దేశంలోనికి శరవేగంతో చొచ్చుకు వస్తోంది. ఒకనాడు తప్పు అనుకొనే విషయాలను ఆధునిక జీవనశైలిలో భాగమని, స్వేచ్ఛ, ఆనందాలకు వీటిని అనుకరిస్తే తప్పులేదన్న సందేశాన్ని బాహాటంగా అందిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేస్తూ లక్షలు ఆర్జిస్తున్న యువతీ యువకులు అన్ని కట్టుబాట్లు, సంప్రదాయాలు, సనాతన జీవనశైలికి త్రిలోదకాలిచ్చి పార్టీలు, పబ్‌లంటూ తిరుగుతున్నారు. పెళ్లికాకుండానే విశృంఖల శృంగార కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గర్ల్‌ఫ్రెండ్ లేక బాయ్‌ఫ్రెండ్ లేకపోవడం ఒక తప్పిదంగా పరిగణిస్తున్నారు. సహజీవనం పేరిట వ్యభిచారానికి పాల్పడుతున్నారు. మద్యం, సిగరెట్లు, మాదక ద్రవ్యాలు, నీలి సాహిత్యం, పెద్దలపై గౌరవం లేకుండా ప్రవర్తించడం వంటివి ఆధునిక జీవన శైలిలో ఒక భాగంగా మారాయి. ప్రపపంచంలోనే అతి గొప్పదైన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే దిశగా ప్రతీ ఒక్కరు తమవంతు కృషిచేయాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం

రక్షణ లేని ఏటిఎంలు
ఆర్థిక లావాదేవీలు సులభతరంగా ప్రజలకు అందుబాటులోకి తేగలమని అధిక ఆర్థిక వ్యయంతో ప్రతిచోట ఏటీఎంలు స్థాపించారు. కాని వారికి సరైన రక్షణ లేని కారణంగా ప్రాణాలు పోగొట్టుకొన్న సంఘటనలు కోకొల్లలు! కాని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూస్తూ చర్య తీసుకొనకపోవడం సిగ్గుచేటు. ఇకనైనా ఏటీఎం శాఖలకు స్వస్తిపలికి యధా ప్రకారం బ్యాంకుల నుండి ఆర్థిక లావాదేవీలు కలుగునట్లు చూడగలరని మనవి.
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు

హెల్మెట్ బదులు తలపాగా
హెల్మెట్ బరువు ఎక్కువ సైజు ఎక్కువ ఇబ్బందులు ఎక్కువ. అదే గుడ్డతో చేసిన తలపాగ అయితే తలకు 2,3 చోట్ల గడ్డం క్రింద 1 చుట్టుచుట్టు కుంటే హేపీగా వుంటుంది. సురక్షితంగా వుంటుంది. ఖరీదు తక్కువ. హెల్మెట్ వలన కలిగే ఉపయోగాలన్ని తలపాగా వలన కూడా వుంటాయి. ఈ పద్దతి సుప్రీంకోర్టుకు చెప్పాలి నచ్చజెప్పాలి. మరియు ఈ పద్ధతులన్నీ ఐచ్ఛికం చేయాలి. ఎందుకంటే హెల్మెట్ లేక తలపాగా వలన తల తల భాగాలు బాగుంటాయి. ప్రాణం పోదు. కాని శరీరంలో ఇతర భాగాలు విరిగిపోయి పాడైపోయి జీవితం నరకయాతన పడే బదులు తలకు తగిలే ఒకే ఒక్క దెబ్బతో ప్రాణం పోవటం మంచిది. పుట్టినవాడు గిట్టకమానడు. కనుక సుప్రీంకోర్టు మరియు ప్రభుత్వంలో హెల్మెట్ లేక తలపాగా ఐచ్ఛికం చేయాలి.
- గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ