ఉత్తరాయణం

గ్యాస్ కిట్ల నాణ్యత పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్లకు లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ వాడకాన్ని ప్రభుత్వం అనుమతించింది. గ్యాస్ కిట్ల నాణ్యత సరిగా లేకపోవడంవల్ల గతంలో ప్రమాదాలు సంభవించాయి. దీన్ని దృష్టిలోపెట్టుకుని ప్రమాదాల నివారణకు ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం ఆమోదించిన డిజైన్లను మాత్రమే ఆమోదించాలి. గ్యాస్‌ను కార్లకు ఇంధనంగా వాడటంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే బాగుంటుంది. దానివల్ల ప్రమాదాల నివారణ కూడా సాధ్యమవుతుంది. కార్లకు, గృహావసరాలకు వాడే గ్యాస్ సిలిండర్ల డిజైన్లు వేరువేరుగా ఉంటే గుర్తించడం తేలికవుతుంది. అలాగే ఆర్టీసీ బస్సులకు కూడా ఎల్.పి. జి.ని ఇంధనంగా వాడితే సంస్థ నష్టాలు తగ్గుతాయి.
- గోదూరు అశోక్, కరీంనగర్

‘సిద్ధు’లూ-సుద్దులూ
చెప్పకేం గానీ ఎన్నయనా సుద్దులు
నవ రాజకీయాల్లో,
దేశమంతా నవజ్యోత్ సిద్ధూలు
అవకాశవాద దీక్షా కంకణ బద్ధులు
ఆపలేవు వారిని సైద్ధాంతిక హద్దులు
వారు చూసేవి కేవలం లాభనష్టాల పద్దులు
అవసరం తీరిన పార్టీకి పిడిగుద్దులు
చేరబోయే పార్టీకి
నిన్న తిట్టిన నోటితోనే ముద్దులే ముద్దులు
- డా. డివిజి శంకరరావు, పార్వతీపురం

గోమూత్రంపై పన్నా!?
గోమూత్రంపై పన్నుట. ప్రస్తుత ప్రభుత్వానికి ఈ విపరీతమైన ఆలోచన ఎలా వచ్చింది? ఒక్క ఆవుకేం ఖర్మ మొత్తం చతుష్పాద జంతువుల మూత్రంపై పన్ను విధిస్తే రాబడే రాబడి. ఇక మనుషులు సరేసరి. వీరి మూత్రంపై కూడా పన్ను వేస్తే ఇక లోటు బడ్జెట్ మాటే ఉండదు. గోమూత్రాన్ని ఉపయోగించే ఔషధాలపై పన్ను వేస్తే సరి. అంతే కాని మొత్తం గోమూత్రంపై పన్ను విధించడం ఎంతవరకు సబబు? ఇది వెనకటి ఔరంగజేబు జుట్టుపై పన్ను విధించిన చందంగా ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ఆలోచించాలి.
-కె.వి. రమణమూర్తి, కాకినాడ

సాంస్కృతిక విధ్వంసం
విజయవాడ నగరంలో పుష్కరాల నిర్వహణ పేరిట అధికార్లు సాంస్కృతిక విధ్వంసానికి పాల్పడటం అమా నుషం. నిన్నటివరకు అశేష భక్త జనావళిచే పూజలం దుకున్న వేల ఏళ్లనాటి సీతమ్మపాదాలు, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాలను రోడ్డుపక్కనే ఆలనా పాలనా లేకుండా పడేయడం, రామవరప్పాడు ప్రాచీన మసీదును కూలగొట్టడం, దుర్గమ్మ గుడి రోడ్డులో ఉన్న మదర్ థెరిస్సా, మహాత్మాగాంధీ, సుభాష్‌చంద్రబోస్ విగ్రహాలను పెళ్లగించి కార్పొరేషన్ ఆఫీసులో ఒక మూలన పడేయడం వంటి చర్యల కారణంగా అశేష భక్త జనావళి, ప్రజల మనోభావాలను తీవ్రంగా దెబ్బతిం టున్నాయ. ప్రాచీన దేవతామూర్తుల విగ్రహాలను తొల గించే విషయంలో పాటించాల్సిన ఆగమశాస్త్ర విధానా లకు తిలోదకాలిచ్చి రాత్రికి రాత్రే అనాగరికంగా, అమా నుషంగా తొలగించడం దారుణం. ప్రాచీన హిందూ సం ప్రదాయాలకు తీవ్ర విఘాతం కలిగించేలా పాలక వర్గం తీసుకుంటున్న చర్యలు తక్షణం నిలిపేయాలి. అభివృద్ధి అవసరమే. కానీ ప్రజల మనోభావాలను దెబ్బతీసి కాదు.
- ఎం. కనకదుర్గ, తెనాలి

మొక్కలు నాటేవారిని ప్రోత్సహించాలి
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో చెట్లు నాటాలి. తన ఇల్లు, తన భూమిలో చెట్లు నాటాలని ఉత్సాహంగా ఉన్న వారిని నీరుకార్చే విధంగా నిబంధనలు ఉన్నాయ. నివాసం, ఆధార్, జాబు కార్డు ఉన్నవారికి ఆ గ్రామం, పట్టణంలోనే స్వంత భూమి ఉండాలని, అట్లా ఉన్నవారికే మొక్కలు ఇస్తారని చెబుతున్నారు. మరి చాలా కుటుంబాలు బతుకుతెరువు కోసం వేరే గ్రామాల్లో నివసిస్తూ కష్టపడి సంపాదించుకొని మరోచోట భూములను కొనుగోలు చేస్తారు. మరికొందరికి వారసత్వంగా పూర్వికుల గ్రామాల్లో భూములు ఉంటాయ. అక్కడ వీరికి ఆధార్, జాబ్ కార్డులు ఉండవు. అలాంటి వారికి ఎక్కడోక్కడ మొక్కలు నాటే అవకాశం ఇవ్వాలి. మెయంటెన్స్ ఇచ్చి ప్రోత్సహించాలి. చెట్లు నాటాలన్న ఉత్సాహం ఉన్నవారిని తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహించాలి. లేకపోతే హరిత హారంలో పాల్గొనాలని ఉత్సాహం ఉండే ఎందరిలోనో నిరుత్సాహం కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.
- అర్వపల్లి, ఉపేందర్ ముదిరాజ్, కేసముద్రం