ఉత్తరాయణం

అసహనం ఎవరిలో ఉంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందువులకు ఇల్లు అద్దెకివ్వకపోవడం, స్నేహితులు వెడ్డింగ్ కార్డు యిస్తే వాటిమీద హిందూ దేవుళ్ల చిత్రం ఉంటే బయట పారేయడం, మర్యాదకైనా పండ్లు ఇస్తే ప్రసాదం కాదుకదా అనడం, వంటివి చూస్తుటే క్రైస్తవుల్లో అసహనం ప్రస్ఫుటమవుతోంది. మరి క్రైస్తవ సాహిత్యాన్ని బస్సు ప్రయాణికులకు, రైతుల బజారులోని రైతులకు పంచిపెట్టడం ఒప్పా? హిందువులను, వారి ఆచార వ్యవహారాలను క్రైస్తవులు ద్వేషించడం చూస్తుంటే అసహనం హిందువుల్లో ఉన్నట్టా? వారిలో ఉన్నట్టా?
- బి.ఆర్.సి. మూర్తి, విజయవాడ

తగినంత తాగునీరివ్వండి
విశాఖను త్వరలోనే స్మార్ట్ సిటీగా మార్చేస్తామని ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రకటనలు విడుదల చేస్తోంది. స్మార్ట్ సిటీ సంగతి దేవుడెరుగు, ముందు తాగునీరు తగినంతగా యివ్వండి మహాప్రభో అంటూ నగరవాసులు గోల పెడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రిజర్వాయర్లలో నీటి వనరులు అడుగంటిపోయాయి. నగరంలో నీటి సరఫరా అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా శివారు ప్రాంతాలైన గంగవరం, పెదగంట్యాడ, మధురవాడ, ఆనందపురం ప్రాంతాల్లో నగర వాసులు తీవ్ర మంచినీటి కొరతను ఎదుర్కొంటున్నారు. బోరుబావులు, కొళాయిలు ఎండిపోయాయి. జి.వి.ఎం.సి. సరఫరా చేసే ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయో తెలియదు. కొన్ని ప్రాంతాల్లో బురద, తెల్లని నులి పురుగులతో కూడిన నీరు సరఫరా అవుతోంది. వేసవిలో కష్టాలు మరింత ఎక్కువవుతాయని ప్రజలు భయపడుతున్నారు.

- సి. ప్రతాప్, శ్రీకాకుళం
ప్రజాస్వామ్యానికి చేటు
ప్రజలనుంచి నేరుగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు అవకాశవాద దృక్పథంతో ఊసరవెల్లిలా పార్టీలు మార్చడం ప్రజాస్వామ్యానికి తీరని చేటు. అధికారం కోసం విలువలకు తిలోదకాలివ్వడాన్ని జాతి క్షమించదు. ప్రలోభాలకు లోబడి దుస్తులను, మార్చినంత సులభంగా పార్టీలు మార్చడం క్షమించరాని నేరం. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్పీ నుంచి తెదేపాలోకి పలువులు శాసన సభ్యులు వలసపోయిన సంగతి తెలిసిందే. అలాగే తెలంగాణలో తేదేపా నుంచి టిఆర్‌ఎస్‌లోకి దాదాపు పూర్తిగా ఎమ్మెల్యేలు వలసపోయారు. ఈవిధంగా పార్టీలు మారడం, తమను ఎన్నుకున్న ప్రజలను అవమాన పరచడమే. ప్రజలు ఒక పార్టీపై అభిమానంతో ఓటు చేస్తే వేరే పార్టీలోకి చేరడ మేంటి? ఇటువంటివారిని పదవులనుంచి తొలగించాలి.
- వాండ్రంకి కొండలరావు, శ్రీకాకుళం

ఎయిడెడ్ ఉద్యోగుల గోడు వినండి
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఉద్యోగ విరమణ సమయంలో ఆర్జిత సెలవులు నగదుగా మార్చుకునే సౌకర్యం, ఎయిడెడ్ సిబ్బందికి ఎండమావులేనా? 2008 నుంచి దీనికి సంబంధించిన ఫైలు పెండింగ్‌లో పడివుంది. పదవ వేతన సవరణ సంఘం సిఫార్సు చేసినా ఫలితం లేదు. ఇప్పటికైనా నవ్యాంధ్ర ప్రభుత్వం ఎయిడెట్ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ సదుపాయం కల్పించాలి.
- ఆశం సుధాకర్ రావు, గూడలి, నెల్లూరు జిల్లా

చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు తమపై వస్తున్న ఆరోపణలు అబద్ధాలని నిరూపించడానికి సిబిఐతో కాని, సిట్టింగ్ న్యాయమూర్తితో గాని విచారణ జరిపించాలి. ముఖ్యంగా దేశ రాజధాని విషయంలో భూకుంభకోణం జరిగిందంటూ వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడానికైనా వారీ చర్య తీసుకోవాలి. ప్రశ్నించే వారిని చంద్రబాబు కసురుకోవడం మానాలి. రైతులకు, మహిళకు ఇచ్చిన హామీలు, నిరుద్యోగ సమస్య పరిష్కారం వంటి వాటిపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలి. ఇప్పటి వరకు ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం, ఇచ్చిన హామీ నెరవేరలేదు. రాయలసీమలో, ఉత్తరాంధ్రలో ప్రజలు కరవు కోరల్లో చిక్కుకొని ఇబ్బందులు పడుతున్నారు. అభివృద్ధి పనులను ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో చేపట్టినప్పుడు మాత్రమే ప్రజల్లో ప్రభుత్వం పట్ల విశ్వా సం కలుగుతుంది. పట్టింపులేని ధోరణితో ముందుకెళితే ప్రజల్లో విశ్వాసం కోల్పోవడం తథ్యం. ఇప్పటికే ప్రజల్లో అసంతృప్తి రగులుతోంది.
- ఈశ్వర్, ప్రొద్దుటూరు