ఉత్తరాయణం

ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుకు ప్రాచీన భాష హోదాకు సంబంధించి భారతీయ భాషల ప్రాంతీయ కేంద్రాన్ని అమరావతిలో ఏర్పాటుచేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు చేపట్టాలి. 2008లో తెలుగుకు ప్రాచీన భాష హోదా లభించింది. అయితే ప్రాంతీయ కేంద్రం ఇంతవరకు ఏర్పాటుకాకపోవడం తెలుగువారి దురదృష్టమని చెప్పాలి. నిజానికి 2012లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఈ కేంద్రం ప్రారంభించేందుకు గాను తగు భవనాన్ని సమకూర్చాలని అప్పటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. అయి తే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఆ దస్త్రం అపరిష్కృతంగానే మిగిలిపోయింది. ఇకనైనా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అమరావతిలో ఈ కేంద్రాన్ని ఏర్పాటుచేయించేందుకు తగు కృషిచేయాలి.
- వాండ్రంగి కొండలరావు, పొందూరు

డిఎస్‌సి నిర్వహించాలి
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయనా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా డిఎస్‌సి నిర్వహించకపోవడం విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వం డిఎస్‌సిని నిర్వహించాలి. అదికూడా జిల్లా కమిటీల ద్వారా గతంలో నియమించిన విధంగానే కొనసాగాలి. కాలయా పన తగదు. లక్షల మంది అభ్యర్థులు ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకొని డిఎస్‌సి కోసం వేయకళ్లతో ఎదురుచూ స్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాలు పూర్తి చేస్తేనే పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు వస్తాయ.
- కమ్మరి శ్రీనివాసాచారి, దౌల్తాబాద్, మెదక్ జిల్లా

మట్టి వినాయక విగ్రహాలే శ్రేయస్కరం
వినాయక చవితి సందర్భంగా వినాయకుని విగ్రహాలను మట్టితో లేదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసి ఆకర్షణీయంగా అమ్మకాలు జరపడం తెలిసిందే. అయతే వినియోగదారులు అధికంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో చేసి ఆకర్షణీయంగా కనబడే వినాయక విగ్రహాలను కొం టారు. కాని పర్యావరణానికి ఇవి కీడు చేస్తాయ. అం దువల్ల ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మట్టి వినాయకుడి విగ్రహాలను మాత్రమే వాడాలి.
- ఎస్.ఎస్. రాజు, హైదరాబాద్

అనవసర వివాదాలు
గతనెలలో జార్ఖండ్ ముఖ్యమంత్రి ఒక వివాదాస్పద ప్రకటన చేసినట్టు మీడియాలో వచ్చింది. ఇంతకూ ఆ వ్యా ఖ్య ఏమంటే, ‘్భరత్‌ను సొంత దేశంగా అనుకునేవారె వరైనా గోవును తల్లిగా భావించాలి’ అని. దీనిపై నానా రభస సృష్టించారు. అసలు మనదేశంలో వివాదాస్పదం చేయవలసిన అవసరంలేని పచ్చి నిజాలను వివాదాస్పదం చేస్తుండడం, అలాగే నిజంగా వివాదాస్పదంగా భావిం చవలసిన ఘోర కృతాయలను తేలిక విషయాలుగా చూపించడం జరుగుతోంది. యుగ యుగాలుగా భారత దేశంలో మాన్యులు, సామాన్యులు, అసామాన్యులు అంతా గోవును తల్లిగానే చూసేవారు. విదేశీయుల పాల నలో గోసంతతికి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయ. కాగా కశ్మీర్‌కు ప్రత్యేక రాజ్యాంగం ఉండటం, ముస్లింలకు మాత్రమే బహుభార్యాత్వం అమల్లో ఉండడం, హిం దూదేవాలయాలు మాత్రమే ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉ్డంటం..నిజానికి ఇవన్నీ అసలైన వివాదాస్పద విషయా లు. మార్చవలసినవి కూడా ఇవే. అవసరమైన వాటిని వదిలిపెట్టడమే విచిత్రం.
- పి.వి.నరసింహారావు, రాజమహేంద్రవరం