ఉత్తరాయణం

దేశ సమైక్యతను కాపాడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశ రాజకీయవేత్తలు కేవలం తమ రాజకీయ ప్రయోజనాలే తప్ప, ప్రజల యొక్క ఐకమత్యాన్ని గురించి ఏమాత్రం పట్టించుకోరు. దేశంలో కులాలను విడదీసి ప్రజల్లో ఐకమత్యత లేకుండా చేసి, తమ రాజకీయ ప్రయోజనాలు పొందుతున్నారు. రిజర్వేషన్ల పేరు తో ప్రజలను యస్.సి, యస్.టి, బి.సి., ఒ.సిలుగా విభజించింది చాలక ఇప్పుడు యస్.సిలను మళ్లీ వర్గీకరించాలన్న ఆలోచన వచ్చింది. భారత రాజ్యాంగ నిర్మాత, మహనీయుడు డా.బి.ఆర్.అంబేద్కర్ కోరికను మన రాజకీయవేత్తలు నీరుగార్చారు. ఆయన పదేళ్ల తర్వాత రిజర్వేషన్లు రద్దుచేయమని చెప్పటం జరిగింది. అలాకాక, తమ రాజకీయ ప్రయోజనాలకై రిజర్వేషన్లను పొడిగిస్తూనే వున్నా రు. మన రాజకీయవేత్తలకు దేశ ప్రజల ఐకమత్యం గాదు ముఖ్యము, వారికి పదవి, అధికారమే ముఖ్యము. దేశములో ప్రజలు సమానంగా, ఐక్యంగా వుండాలనే రద్దుచేయమని కోరినారు. అంతేగాక దేశములో కుల తోకలను గూడ శాసనం ద్వారా తీసివేయాలి. దేశంలో వారికున్న ‘పేర్ల ద్వారా కులాలు బహిర్గతం కారాదు. హిందూ సమాజాన్ని ఐకమత్యంగా వుంచాలన్నదే ప్రజల ధ్యేయంగా వుండాలి. శ్రీ బి.ఆర్.అంబేద్కర్ ఆలోచనలకు గౌరవమిచ్చి, వారి ఆలోచనను అమలుచేయండి. దేశ ఐక్యతను కాపాడటానికి ఆలోచించండి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం

చక్కని కార్యక్రమాలు
దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో చక్కని కార్యక్రమా లు వస్తున్నాయి. మర్యాదరామన్న కథలు సమస్య పరిష్కారం, నేరమా, చాకచక్యంగా శిక్ష చక్కగా చూపబడ్తున్నాయి. ఇలాంటివి పిల్లలకు, నేర్చుకునే వాళ్ళకి నేర్చుకున్నంత. ఆలాపన సాలూరివారి పిల్లవాడు చక్కని తీర్పులిస్తూ బావుంటున్నాయి. ఓ ముప్ఫయి సంవత్సరాలముం దు ఇవి బాగా ఆదరింపబడినాయి. ప్రైవేటు చానల్సు వచ్చి వీటిని అనారోగ్యకరంగా వెనక్కు నెట్టేయి. వీటి నిర్వాహకులు ఈరోజు డబ్బింగు కార్యక్రమాలు వద్దంటున్నారు. సత్తావుంటే పోటీతత్వంతో నాణ్యత చూపాలి గాని ఇది పద్ధతి కాదు. వేలాది డబ్బింగు కళాకారులు రోడ్డుపై బడ డం న్యాయంకాదు.
- విఆర్‌ఆర్‌ఎరాజు, హైదరాబాద్

మహిళా బిల్లుకు మోక్షమెప్పుడో?
యుపిఎ ప్రభుత్వ పదవీ కాలంలో చట్ట సభల్లో మహిళలకు వీలు కలిగించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొం దకుండా నిలిచిపోవడం గమనార్హం. కాని దరిమిలా పది సంవత్సరాలు గడిచినా సదరు బిల్లు ఆమోదించబడకపోవడం మహిళలను అవమానించడమే. ఇది ఎంతమాత్రం తగదు. దేశ జనాభాలో సగం మంది మహిళా వోటర్లు వున్నప్పటికి పురుషాధిక్యతవలననే యింతవరకు ఆమోదానికి నోచుకోకపోవడం విశేషం. ప్రస్తుతం చిత్తశుద్ధిగల రాజకీయ పక్ష నేతలందరు మహిళా రిజర్వేషను బిల్లుకు అనుకూలంగా చట్టం చేయాలి. ఇందుకోసం అన్ని రాజకీయ పక్ష మహిళా నేతలు ఉద్యమించాలి.
- కొలుసు శోభనాచలం, గరికపర్రు

విద్యార్థుల జీవితాలతో చెలగాటం
ఆశ జీవితాన్ని ఆటపట్టిస్తే ఆశయం జీవితానికి విలువ నేర్పుతుంది. కానీ ఆశ అత్యాశగా మారి దురాశగా రూపాంతరం చెందితే అరాచకానికి, అక్రమాలకు హద్దులే ఉండవు. నీతినియమాలకు, నైతిక విలువలకు తావే ఉండదు. ఇదే ప్రస్తుతం అన్ని రంగాలతోపాటు విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. కష్టపడకుండా తెల్లాసేసరికి కోట్లకు పడగెత్తాలని కొందరి దురాశ విద్యారంగంలో పెచ్చరిల్లుతుండటంతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు ప్రశ్నార్థకంగా మారిపోతున్నాయి. కష్టపడి చదివి ఫలితాలు సాధించాల్సిన విద్యార్థుల్లో కొందరు వక్రమార్గంలో లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నిస్తుండడం దురదృష్టకరం. ఇందుకు వారి తల్లిదండ్రులు కూడా సహకరించడం, లక్షలాది రూపాయలు బ్రోకర్లకు ఇవ్వడం చూ స్తే అసలు సమాజం ఎటువైపు ప్రయాణిస్తుంది. ఏమవుతుంది? వీరంతా రేపు డాక్టర్లయితే రోగుల పరిస్థితేమిటి? తదితరమైనవన్నీ జవాబులేని ప్రశ్నలే. కొందరు చేసిన తప్పిదాలకు అందరి జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. డబ్బులతో ర్యాంక్ కొనుక్కోవాలనే ఆశపడే వా రికి తగిన దండన వుండాలి. ఈ ప్రశ్నాపత్రాల లీకేజీల ద్వార కోట్లాది రూపాయలు దోచుకునే వుంటారు.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు

వెనకటి పద్ధతులే శ్రేయస్కరం
మన పూర్వీకులు వ్యవసాయం అభివృద్ధి పరచే పద్ధతులు ఎంతో సులువైనవి! చెరువుకట్టల మీద దొడ్లల్లో జీలుగ వెంపలి తంగేడు మొదలగు చెట్లను పెంచి వాటిని మాగాణి భూముల్లో వేసి ఎరువుగా మార్చి అధిక వరి ఉత్పత్తి సాధించేవారు. పంట మార్పిడి విధానాలు అవలంభించి దుర్భిక్షం లేకుండా చేసేవారు. ధాన్య నిల్వలు పాతరలు, బొట్టలు వాడే ప్రక్రియల్లో శ్రద్ధ చూపేవారు. కూరగాయల పెంపకంలో పాడి వృద్ధి చేయడంలో శ్రద్ధ తీసుకొని అతి తక్కువ ఖర్చుతో ఫలసాయాన్ని వృద్ధిలోకి తెచ్చిన మన పెద్దల సూత్రాలు అమూల్యం. ఇప్పుడు రైతులు రసాయన ఎరువులు అత్యధికమొత్తంలో వాడి తీవ్రంగా నష్టపోతున్నారు. చీడపీడలు ఆయా మందులకు తట్టు కునే స్థాయకి చేరుకోవడంతో తెగుళ్లు నియం త్రించడం చాలా కష్టతరమై నష్టాలకు దారితీస్తోంది. అందువల్ల సేంద్రియ ఎరువుల వాడకం శ్రేయస్కరం పూర్వీకులు అనుసరించిన పద్ధతులనే అనుసరించడం లాభదాయ కం. పర్యావరణానికి అనుకూలం.
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు