ఉత్తరాయణం

దేశద్రోహం కేసు పెట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘్భరత సైన్యం జరిపిన మెరుపుదాడులకు ప్రభుత్వం రుజువులు బయటపెట్టాలి’- అని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్, దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ రభస చెయ్యబూనటం చాలా అసహ్యకరంగా ఉంది. పాకిస్తాన్‌లో ఉన్న ప్రముఖులే ‘పాకిస్తాన్ ఆత్మహత్యకు పాల్పడటం మంచిది కాదు’- అని తమ సూచనలు వెల్లడిస్తూంటే వారం కిందట మొరాదాబాద్ (యుపి)లో సంజయ్ నిరుపమ్ పార్టీ గణాచారిగణాలు ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని ఊరేగింపు చేసారు!. గతంలో ఒక ఆంధ్ర సి.ఎం. అమెరికాలోని ఓ సంస్థ ద్వారా శాటిలైట్‌ను తెలుగు రాష్ట్రాల్లో ప్రయోగింపచేసాడనీ, ఆ వీడియో కాపీని ఒకదాన్ని ఈ సి.ఎం.కు ఇచ్చి రెండో కాపీని పాకిస్తాన్‌కు ఆ సంస్థ ఇచ్చిందనీ, అది తెలిసే కేంద్ర హోం మంత్రి రాజనాథ్‌సింగ్ తెలంగాణ సిఎంకు ఫోన్ చేసాడనీ వార్తలు వచ్చాయి. వీటికి ప్రభుత్వం రుజువులు బయటపెడ్తే సంజయ్ నిరుపమ్ లాంటి వాళ్లు పాకిస్తాన్‌కు అందించరని గ్యారంటీ ఏమిటి? అందుకనే ఇలాంటివారిపై దేశద్రోహం కేసు పెట్టాలి!
- గుండు సుబ్రహ్మణ్యదీక్షితులు, ఏలూరు

బెయిలుపై వచ్చి నేరాలా?
ఇటీవల జరుగుతున్న దారుణాలలో కొంత భాగం- జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చిన నేరస్థులచే చేయబడుతున్నవి. ఈ విషయాలపై రాష్ట్రాల హోంశాఖలు అప్రమత్తత వహించాలి. నేరస్థులను సంస్కరించే దిశగా వారిని ప్రజాజీవన స్రవంతిలో మంచి పౌరులుగా మార్చడం మంచిదే. బెయిలుపై వచ్చిన వారిని సిఐడి, ఇంటెలిజెన్స్, ఇతర పోలీస్ శాఖలు అనుక్షణం గమనిస్తూ ఉండాలి. బెయిల్‌ను దుర్వినియోగం చేసి ఘాతుకాలకు పాల్పడిన వారి విషయంలో జామీనుదారులపైన కూడ చర్యలు తీసుకునే విషయమై పాలకులు, న్యాయ నిపుణులు ఆలోచన చేయాలి. శిక్షలు పడి, బెయిల్‌పై ఉన్న వారిపట్ల అప్రమత్తత అవసరం కదా?
- ప్రొఫెసర్ కె.ఎన్.రావు, కావలి

నామినేటెడ్ పోస్టులివ్వాలి..
ఆంధ్రప్రదేశ్‌లో గత రెండేళ్ళలో నామినేటెడ్ పోస్టుల నియామకాలలో బి.సి.లు కానివారికి ఎక్కువ ప్రాధాన్యం కల్పించారు. టిడిపి అధికారంలోకి రావడానికి కారణమైన కోట్లాది బి.సి. కులస్థులను నిర్లక్ష్యం చేయడం తగదు. ఖాళీ అయిన రాజ్యసభ స్థానాల్ని బిసిలకు కేటాయించలేదు. కులాలకు సంబంధించి ఏర్పాటు చేసిన కార్పొరేషన్లలో సంబంధిత కులాల వారిని నియమించారే తప్ప, మిగతా పదవుల్లో బిసిలకు న్యాయం జరగలేదు. ప్రాధాన్యం ఉన్న నామినేటెడ్ పదవుల్లో అత్యధికులు అగ్రకులాలవారే ఉన్నారన్నది అక్షర సత్యం. బిసి మంత్రులు ఈ అంశంలో సహకరించాల్సిందిగా కోరుతున్నాం.
- సింహాద్రి కోటిలింగేశ్వరరావు, రాజమండ్రి

ఎమ్మెల్యేలకు ఇళ్లే లేవా?
తెలంగాణ ప్రభుత్వానికి పుష్కలంగా మిగులు నిధులున్నాయని పాలకులు చెప్పడం సంతోషం కలిగించే విషయం. అయతే, ప్రతి రూపాయి కూడా అర్థవంతంగా ఖర్చుకావాలని సామాన్యులు కోరుకుంటారు. నిజానికి ఏ నియోజకవర్గంలోనైనా ఎమ్మెల్యేలు సొంత నివాసం లేకుండా లేరు. వారికి కార్యాలయం వుండాలని, వారు నిత్యం ప్రజలకు అందుబాటులో వుండాలని ప్రభుత్వం భావిస్తే అద్దె భవనాలను తీసుకుని తగినంత కిరాయి చెల్లించవచ్చు. చాలామంది ఎమ్మెల్యేలకు వారి ఇళ్లలోనే కార్యాలయాలు ఏర్పాటు చేసుకునే స్థోమత ఉంది. ఒక్కో ఎమ్మెల్యే నివాసం,కార్యాలయాల నిర్మాణానికి రెండేసి కోట్లు కేటాయించాలనేది దుబారా అంశం. ఇప్పటికే ఎంతోమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవీ కాలం ముగిసి ఏళ్ళు గడుస్తున్నా ప్రభుత్వ భవనాలను ఖాళీచేయని ఉదంతాలు చూస్తున్నాం. అనవసర ఖర్చులు తగ్గించి, సంక్షేమ పథకాల వైపు ప్రభుత్వం దృష్టి సారించాలి.
- విఆర్‌ఆర్‌ఎ రాజు, హైదరాబాద్

ప్లాస్టిక్‌పై నిషేధం ఎక్కడ?
ప్లాస్టిక్ కవర్లను నిషేధించామని అధికారులు చెబుతున్నా పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వస్తువులు కొంటే చాలా దుకాణాల్లో క్యారీబ్యాగుల్లో పెట్టి ఇవ్వడం చూస్తున్నాం. రీ సైక్లింగ్ చేసిన ప్లాస్టిక్‌తో తయారుచేసే రంగురంగుల క్యారీబ్యాగులు పర్యావరణానికి మరింత అనర్థదాయకం. ఈ బ్యాగుల వల్ల మన ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని, ప్రాణాంతక వ్యాధులు వ్యాపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని హోటళ్లలో వేడి పదార్థాలను సైతం ప్లాస్టిక్ బ్యాగుల్లో వేసి ఇస్తున్నారు. ఇలా తెచ్చుకున్న ఆహారాన్ని తినడం మరీ ప్రమాదకరం. ప్లాస్టిక్ బ్యాగులను నిషేధిస్తున్నట్లు మొదట్లో అధికారులు కొంత హడావుడి చేసినా, వాటి ఉత్పత్తి, వినియోగం తగ్గలేదు. నిషేధం అమలు తీరును పర్యవేక్షించే నాథుడే లేనందున పరిస్థితి యథాస్థితికి చేరింది. పర్యావరణానికి, మూగజీవాలకు చేటు కలిగిస్తున్న ప్లాస్టిక్ బ్యాగులపై పూర్తిస్థాయిలో నిషేధాన్ని అమలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, వనస్థలిపురం