ఉత్తరాయణం

లైబ్రరీల్లో సమస్యల తిష్ట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రంథాలయాలు దేవాలయాలతో సమానం. మన మేధోసంపత్తిని పెంచేవి గ్రంథాలయాలు మాత్రమే. స్వాతంత్య్ర ఉద్యమంలో గ్రంథాలయోద్యమం కీలకపాత్ర పోషించింది. అలాంటి విజ్ఞాన సర్వస్వాలైన గ్రంథాలయాలు నేడు ఆదరణ కోల్పోతున్నాయి. తెలంగాణ గ్రామీణ ప్రాంత గ్రంథాలయాల్లో సమస్యలు తిష్టవేశాయి. దినపత్రికలు సక్రమంగా రాకపోవడం, బెంచీలు, కుర్చీలు లేకపోవడం, గ్రంథాలయాధికారులు అందుబాటులో వుండకపోవడం లాంటి సమస్యలు తప్పడం లేదు. దీంతో విద్యార్థులు, నిరుద్యోగులు పూర్తిస్థాయిలో వీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. కొన్ని లైబ్రరీల్లో విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ఇరుకైన గదులలో పాఠకులు పుస్తకాలు చదవాల్సిన దుస్థితి నెలకొంది.
-కామిడి సతీష్‌రెడ్డి, జడలపేట

సాయిభక్తులు హిందువులే
వేదాలను నమ్మినవారే హిందువులని, షిరిడీ సాయి భక్తులు ఎంతమాత్రం హిందువులు కారని కొందరు వాదించడం తగదు. మనదేశంలో ఎంతమంది హిందువులకు వేదాలపై అవగాహన ఉంది. వారు వేదాలు చెప్పినట్లే జీవిస్తున్నారా? అంతమాత్రాన వీరిని హిందువులు కాదని ఎవరూ అనరు. షిరిడీ సాయి భక్తులు వెంకటేశ్వరస్వామిని, రాముడిని, కృష్ణుడిని దైవాలుగా కొలుస్తుంటారు. బాబా భక్తులకు వేదాల పరిజ్ఞానం లేదని, వారు హిందువులు కాదంటే ఎలా కుదురుతుంది? దేవుళ్లను విభజించడం, భక్తులను విభజించడం సరికాదు.
- జి.శ్రీహరిరావు, గంగవరం

అందని ప్రభుత్వ వైద్యం
మలేరియా, చికున్‌గున్యా, డెంగ్యూ సహా అనేక జబ్బులు నేడు ప్రజలను విలవిలలాడిస్తున్నాయి. సీజన్ మారినప్పుడల్లా ఈ రోగాలు ప్రబలుతున్నాయి. పారిశుద్ధ్య లోపం వ్యాధుల వ్యాప్తికి ప్రధాన కారణం. ఆర్థికస్థోమత లేనివారు తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వ వైద్యంపై ఆధారపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు భారీగా నిధులు కేటాయిస్తున్నా ఫలితాలు ఏమేరకు ప్రజలకు చేరుతున్నాయనే విషయాన్ని పట్టించుకునే నాథుడు లేడు. నిధుల్లో 80 శాతం వరకూ వైద్య సిబ్బంది జీతభత్యాలకే సరిపోతున్నాయి. కుక్కకాటుకు అవసరమయ్యే సాధారణ మందులు కూడా అందుబాటులో ఉండటం లేదు. రోగనిర్ధారణే ఒక ప్రహసనంగా మారిపోయింది. ప్రజారోగ్య రంగాన్ని ప్రభుత్వాలు ఏళ్ల తరబడి నిర్లక్ష్యం చేస్తున్నాయి. వ్యాధుల నివారణకు యుద్ధప్రాతిపదికపై చర్యలు చేపట్టాలి.
- వులాపు బాలకేశవులు, గిద్దలూరు

మాతృభాషపై చిన్నచూపు
ఆంగ్ల భాషపై వ్యామోహం పెంచుకుంటూ మాతృభాషను నిర్లక్ష్యం చేయడం కన్నతల్లిని అవమానంచినంత పాపం. ఆంగ్లంలో పట్టు సాధించడం కోసం మాతృభాషను నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదు. దేశంలో ఏ ప్రాంతం వారైనా తమ మాతృభాషను పిల్లలకు విధిగా నేర్పించాలి. 10వ తరగతి వరకు నిర్బంధంగా మాతృభాషను బోధించాలి. ఉన్నత విద్యాభ్యాసం మాతృభాషలో సాగించిన వారికి ఉద్యోగాలలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. ఇద్దరు పిల్లలు మాట్లాడుకునేటప్పుడు ప్రాంతీయ భాషనే ఉపయోగించేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలి. చైనా, ఫ్రాన్స్, రష్యా అధ్యక్షులు ఇటీవల భారత్‌లో పర్యించినప్పుడు వారికి ఇంగ్లీషు తెలిసినా తమ మాతృభాషలోనే ప్రసంగించారన్న అంశం అందరికీ స్ఫూర్తిదాయకం కావాలి. ఆంగ్లం, హిందీయే కాక దేశంలో వున్న భాషలన్నీ నేర్చుకున్నా తప్పులేదు. కానీ, ఎవరి మాతృభాషను వారు చిన్నచూపు చూడడం సమంజసం కాదు.
-సి.ప్రతాప్, శ్రీకాకుళం

కరవు భత్యం పెంచాలి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకగా రెండు శాతం కరవు భత్యం (డిఎ) పెంచారు. ఇదే విధానాన్ని అనుసరించి కరవు భత్యం పెంచేందుకు ఎపి ప్రభుత్వం కూడా చొరవ చూపాలి.
-జవ్వాది వెంకటరమణ, విశాఖపట్నం