జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌లో ముదిరిన రాజకీయ సంక్షోభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ సిఎం హరీష్ రావత్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో రాజకీయ సంక్షోభం ముదురుపాకాన పడింది. రావత్‌కు అసెంబ్లీలో బలం లేదని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బిజెపి సభ్యులు వాదిస్తున్నారు. కాగా, తనకు తగినంతమంది మద్దతుదారులున్నారని రావత్ వాదిస్తున్నారు. 35 మంది ఎమ్మెల్యేలు బిజెపి అధ్యక్షుడు అమిత్ షాను, రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసేందుకు దిల్లీ చేరుకున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని బిజెపి ఎమ్మెల్యేలు ప్రకటించారు. దీంతో మంత్రివర్గ సహచరులు, తన వర్గం ఎమ్మెల్యేలతో రావత్ అత్యవసరంగా భేటీ అయ్యారు. అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌కు వ్యతిరేకంగా ఓటింగ్ జరిగితే పాల్గొనరాదని కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సిఎం రావత్ తన మద్దతుదార్లతో ఈరోజు రాత్రి రాష్ట్ర గవర్నర్‌ను కలిసే అవకాశం ఉందని సమాచారం.