ఉత్తరాయణం

పర్యావరణాన్ని కాపాడుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవ సమాజాన్ని ఓ వైపు ఉగ్రవాద, అణుబాంబు భయం, మరో వైపు ‘గ్లోబల్ వార్మింగ్’ (్భమి వేడెక్కకడం) తీవ్రంగా భయపెడుతున్నాయి. పారిశ్రామిక దేశాలు ఇష్టమొచ్చినట్టుగా గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తుండడంతో భూగోళం అంతకంతకూ వేడెక్కిపోతోంది. ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్ని చెబుతున్నా అగ్రరాజ్యాలు పట్టించుకోకపోవడం శోచనీయం. మంచు కరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగిపోతున్నాయి. వాతావరణ మార్పులు తీవ్ర వ్యాధులకు కారణమవుతున్నాయి. ఈ విలయాలను ఆపాలంటే అభివృద్ధి చెందిన దేశాలన్నీ చిత్తశుద్ధితో వ్యవహరించాలి. భావితరాలు నిశ్చింతగా జీవనం గడపాలంటే వాయు కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించడం తప్పనిసరి. పరిస్థితులు చక్కబడాలంటే పౌరులందరు విధిగా కొన్ని సామాజిక బాధ్యతలు నిర్వర్తించాలి. పరిసరాల్లో మొక్కల్ని విరివిగా నాటాలి. ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణం నిబంధనను కచ్చితంగా అమలు చేయాలి. సౌర విద్యుత్ వాడకాన్ని ప్రోత్సహించాలి. విద్యుత్, నీరు, కాగితం దుర్వినియోగాన్ని అరికట్టాలి. వ్యక్తిగత వాహన వినియోగాన్ని తగ్గించుకునే మార్గాలను అనే్వషించాలి.
-గూరుడు అశోక్, గోదూర్
పసలేని పవన్ విమర్శలు
‘జనసేన’ అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఈమధ్య సారం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. దక్షిణాది వారు నల్లగా ఉన్నా వివక్ష లేకుండా వారితో కలిసి పనిచేస్తున్నామని ఒక భాజపా నేత అన్నందుకు- ఆయనపై ఒంటికాలిపై లేచాడు పవన్. ఆ నేత అన్నదాంట్లో తప్పేం ఉంది? తెలుగు సినిమాల్లో నల్లవారి పట్ల వివక్ష కొనసాగడం పవన్‌కి తెలియదా? ఆ వివక్ష నిర్మూలనకు ఆయనేం చేశాడు? మిర్చి రైతులకు మద్దతుగా కేంద్రం క్వింటాల్‌కు 5 వేలు ప్రకటించడాన్ని విమర్శిస్తునన్నాడు. సినిమాల్లో నటిస్తూ కోట్లు ఆర్జిస్తున్న పవన్ రైతుల కోసం ఏ మేరకు విరాళం ఇచ్చాడు? షూటింగ్‌లు లేనప్పుడు హైదరాబాద్‌లో తీరుబడిగా కూర్చుని పవన్ ఇలా మొసలి కన్నీరెందుకు?
చంద్రిక, కాకినాడ
‘ఆధార్’తో అనర్థాలు..
బ్యాంకులు, పోస్ట్ఫాసులు, రైల్వేశాఖ, మొబైల్ నెట్‌వర్క్‌లో ఏ పని కావాలన్నా ఆధార్ కార్డు కాపీని సంతకం చేసి ఇమ్మంటున్నారు. అమాయక ప్రజలు అలాగే ఇచ్చేస్తున్నారు. ఆధార్ జిరాక్స్ కాపీలు చేజిక్కించుకున్న సంఘ వ్యతిరేక శక్తులు తమ స్వార్థానికి వాడుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏమీ తెలియని ప్రజలు చిక్కుల్లో పడుతున్నారని అంటున్నారు. ఆధార్ ఇచ్చేటప్పుడు సంతకం, తారీఖు, ఎందుకు ఇస్తున్నామో కారణం రాసి మరీ ఇమ్మని వాట్సప్‌లో మెసేజీలు వస్తున్నాయి. తస్మాత్ జాగ్రత్త..!
-ఎన్.రామలక్ష్మి, సికింద్రాబాద్