జాతీయ వార్తలు

ఉత్తరాఖండ్‌పై చర్చకు సిద్ధం: కేంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఉత్తరాఖండ్ పరిస్థితులపై చర్చకు సిద్ధమేనని సోమవారం లోక్‌సభలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఉత్తరాఖండ్‌లో రాష్టప్రతి పాలనకు సంబంధించిన వివాదం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్నందున, సరైన రూలింగ్ ప్రకారం చర్చ జరగాల్సి ఉందని అధికారపక్ష సభ్యులు అన్నారు. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా బిజెపి కుట్ర పూరితంగా వ్యవహరించిందని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. హైకోర్టు తీర్పును గౌరవించి అసెంబ్లీలో విశ్వాస పరీక్ష పెడితే ఎవరికి మద్దతు ఉందో తేలిపోయేదని, అందుకు అవకాశం ఇవ్వకుండా కేంద్రం సుప్రీం కోర్టుకు వెళ్లడంతో అయోమయం కొనసాగుతోందని వారు అన్నారు. కాంగ్రెస్‌లో అనైక్యత వల్లే ఆ రెండు రాష్ట్రాల్లో పరిస్థితి ఇలా దిగజారిందని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.