యువ

భద్రం.. బీ కేర్‌ఫుల్ బ్రదరూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది డిజిటల్ యుగం. డిజిటైజ్ కానిదేదీ లేదు. అలాంటప్పుడు పాస్‌వర్డ్‌లదే కదా కీలకపాత్ర! కానీ, వాటిని క్రియేట్ చేయడంలోనూ, జాగ్రత్తగా గుర్తుంచుకోవడంలోనూ చాలామంది నిర్లక్ష్యం కనబరుస్తూ ఉంటారు. పాస్‌వర్డ్‌లు హ్యాకర్ల బారిన పడితే జరగరాని అనర్థాలు జరుగుతాయి. అలాంటివారిని దృష్టిలో ఉంచుకుని, ఇద్దరు ఇంజనీరింగ్ కుర్రాళ్లు కనిపెట్టిన టెక్నాలజీ, ఇప్పుడు పాస్‌వర్డ్‌లకు శ్రీరామరక్షగా మారింది. సురక్షితమైన పాస్‌వర్డ్‌లు తయారు చేయడంలో వీరిద్దరూ కఠోర శ్రమ చేశారు. అనుకున్నది సాధించారు. ప్రభుత్వంనుంచి అవార్డులూ రివార్డులూ కూడా పొందారు. వారే సూర్య సుభాష్, కౌశిక్ భరద్వాజ్. హైదరాబాద్‌లోని సివిఎస్‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్న ఈ ఇద్దరూ పాస్‌వర్డ్‌ల భద్రత గురించి ఎప్పుడూ ఆలోచించేవారు. పాస్‌వర్డ్ తయారీలో బ్లాక్‌చైన్ టెక్నాలజీ, ఆర్ట్ఫిషియల్ టెక్నాలజీలను సమ్మిళితం చేసి, కొత్త టెక్నాలజీని వినియోగించడం ఈ కుర్రాళ్ల విలక్షణత. వినియోగదారుడి గుర్తింపుకు అతని కీ బోర్డ్ టైపింగ్ ప్యాటర్న్‌ను బయోమెట్రిక్‌గా పరిగణించే వినూత్న విధానానికి వారు తెర తీశారు. ఈ విధానం హ్యాకర్ల బారిన పడటమనేది జరగదు.
‘కౌశిక్, నేను కలిసి చాలా కాలేజ్ ప్రాజెక్ట్స్ చేశాం. ఒకరోజు సైబర్ సెక్యూరిటీపై మాట్లాడుకుంటూ ఉండగా పాస్‌వర్డ్స్ భద్రత అంశం వచ్చింది. దీనిపై కృషి చేయాలనుకున్నాం. మాకు మరో ఐదారుగురు తోడయ్యారు. దీంతో మా ప్రాజెక్ట్ ‘ప్రైమ్‌యూత్’ మరింత బలపడింది’ అన్నాడు సూర్య సుభాష్.
‘మొదట్లో మమ్మల్ని ఎవరూ నమ్మేవారు కాదు. పైగా మేం ఇంకా చదువుకుంటూ ఉండటం, మా వయస్సు 20 ఏళ్లే కావడంతో మాకు చేయూత అందించేందుకు కూడా ఎవరూ ముందుకొచ్చేవాళ్లు కాదు. అయితే మేం నిరాశ చెందకుండా కృషి చేశాం. అది సత్ఫలితాలనిస్తోంది. ఇటీవల జరిగిన హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ డిజైన్ సమ్మిట్‌లో బెస్ట్ ప్రోడక్ట్ అవార్డ్‌ను గెలుచుకున్నాం. అలాగే జెఎన్‌టియు నిర్వహించిన స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌లోనూ అవార్డు సాధించాం’ అంటూ వివరించాడు సూర్య సుభాష్. కౌశిక్ మాట్లాడుతూ తన తల్లిదండ్రులు కూడా తాను చేస్తున్న ప్రాజెక్ట్‌పై అంతగా ఆసక్తి కనబరచేవారు కాదని, తాను విడమరిచి చెప్పాక, తమ ప్రాజెక్ట్‌కు లభిస్తున్న ఆదరణను గమనించాక వారు ప్రోత్సహించడం మొదలుపెట్టారని చెప్పాడు. కౌశిక్ యూట్యూబర్ కూడా. టెక్నాలజీపై అతను పోస్ట్ చేసిన వీడియోలకు దాదాపు మూడు లక్షలకు పైగానే వ్యూస్ లభించాయి.