యువ

ఈ సాక్స్ చాలా స్మార్ట్ గురూ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాప్స్ వచ్చాక ఎన్నో పనులు సులువయ్యాయి. ఏ పనైనా చిటికెలో చేయడం యాప్స్ వల్ల వీలైంది. ఈ ప్రక్రియను మున్ముందుకు తీసుకెళ్లే దిశగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఆ కోవకే చెందుతుంది సెన్సోరియా యాప్. ఈ యాప్‌ను స్మార్ట్ సాక్స్‌కు అనుసంధానిస్తారు. స్మార్ట్ సాక్స్ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? ఈ సాక్స్ ట్రాకర్లకు ఎంతో అనువైనవి. మామూలుగా ఎంత దూరం పరుగెట్టారు? హార్ట్ రేట్ ఎలా ఉంది? వంటి విషయాలే కాకుండా డేటా, గణాంకాల ఆధారంగా లెక్కగట్టి రియల్‌టైమ్ అప్‌డేట్స్‌ను ఇచ్చే సాక్స్ ఇవి. సాక్స్‌కు అమర్చిన ఎలక్ట్రానిక్ యాంక్లెట్ (కడియం లాంటి పరికరం), బిల్టిన్ సెన్సర్ల వల్ల ఇది సాధ్యమవుతుంది. రన్నింగ్ లేదా జాగింగ్ చేసేటప్పుడు పాదం నేలను ఎలా తాకుతోంది? దానివల్ల ఎలాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది? అసలు పాదం నేలను ఎలా తాకాలి వంటి సమాచారాన్ని కూడా అందిస్తుందట. ఈ స్మార్ట్ సాక్స్‌ను సెన్సోరియా యాప్‌కు అనుసంధానిస్తారు. ఈ యాప్ ఎప్పటికప్పుడు ఆడియో నోటిఫికేషన్లను జారీ చేస్తూ ఉంటుంది.