క్రీడాభూమి

యువరాజ్‌కు నిరాశే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, ఫిబ్రవరి 6: యువరాజ్ సింగ్‌కు ఈ వేలంలో నిరాశ తప్పలేదు. అందరి కంటే ఎక్కువ మొత్తం అతనికే లభిస్తుందని విశే్లషకులు అంచనా వేశారు. గత ఏడాది 16 కోట్ల రూపాయలను దక్కించుకొని, ఐపిఎల్‌లో రికార్డును సృష్టించిన అతను మరోసారి అదే స్థాయి మొత్తాన్ని ఆశించాడు. కానీ, అనూహ్యంగా అతను ఏడు కోట్ల రూపాయలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యువీని కొనుక్కొంది. అంతగా పేరు లేని నేగీ కంటే యువీకి తక్కువ మొత్తం లభించడం గమనార్హం. 50 లక్షల బేస్ ప్రైస్ ఉన్న క్రిస్ మోరిస్, రెండు కోట్ల కనీస ధర గల యువీలకు ఒకే విధంగా చెరి ఏడు కోట్ల రూపాయలు లభించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది. యువీని సన్‌రైజర్స్ హైదరాబాద్, మోరిస్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లు వేలం పాడుకున్నాయి.
చాలా ప్రయత్నించాం
యువరాజ్ సింగ్‌ను తమ జట్టులోకి తీసుకోవాలని చివరి వరకూ ప్రయత్నించినట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు డైరెక్టర్ అమృత్ థామస్ అన్నాడు. అయితే, సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు కోట్ల వరకూ వెళ్లడంతో తాము వెనక్కు తగ్గామని అన్నాడు. యువీ పట్ల తాము ఆసక్తిని ప్రదర్శించలేదని అనుకోవడం తగదని వ్యాఖ్యానించాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్, పుణే వారియర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లకు గతంలో ప్రాతినిథ్యం వహించిన యువీ 98 మ్యాచ్‌ల్లో 2,099 పరుగులు సాధించాడు. అతనికి ఈసారి అత్యధిక ధర పలుకుతుందని అం చనా వేసినప్పటికీ, అతను మూడో స్థానానికి పడిపోయాడు.
నెహ్రా ధర రూ. 5.5 కోట్లు
షేన్ వాట్సన్, యువరాజ్ సింగ్‌తోపాటు రెండు కోట్ల బేస్ ప్రైస్‌గల వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రాకు 5.5 కోట్ల రూపాయలు లభించాయి. చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆడిన మరో పేసర్ మోహిత్ శర్మ కనీస ధర 1.5 కోట్ల రూపాయలుకాగా, అతనికి నెహ్రా కంటే యాభై లక్షల రూపాయలు అధికంగా దక్కాయి. అతనిని కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ 6.5 కోట్లకు దక్కించుకోగా, నెహ్రాను సన్ రైజర్స్ హైదరాబాద్ తీసుకుంది. రెండు కోట్ల రూపాయలే బేస్ ప్రైజ్‌గల మిచెల్ మార్ష్‌ను రైసింగ్ పుణే సూపర్‌జెయింట్స్ 4.5 కోట్లకు తన జట్టులో చేర్చుకుంది.