విజయనగరం

నేడు గురజాడ శత వర్థంతి నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం , నవంబర్ 29: విద్యల నగరం విజయనగరంలో వెల్లివిరిసిన సాహితి కుసుమం తన రచనల ద్వారా సాహితి సౌరభాలను విశ్వవ్యాప్తంగా పరిమళింపచేసిన మహాకవి గురజాడ అప్పారావు శత వర్థంతి సారస్వత నీరాజనం సోమవారం ఘనంగా నిర్వహించేందుకు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. మహాకవి నడయాడి నివసించిన స్వగృహాంలో ఆయన చిత్ర పటానికి పూలమాల అలంకరణ అనంతరం గురాజడ తన సాహితి రచలకు వినియోగించిన వస్తువులతో ఊరేగింపు నిర్వాహిస్తారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలలు,కళాశాలల్లో ఉదయం 10.30 గంటలకు మహాకవి రచించిన దేశమంటే మట్టి కాదోయ్ అనే దేశభక్తి గీతాలాపన విద్యార్థులతో పెద్ద ఎత్తున నిర్వహించి ఆ మహాకవికి సాహితి నివాళులు అర్పించడానికి జిల్లా భాషా, సాంస్కృతిక విభాగం ఏర్పాట్లు చేసింది. మహాకవి సాహితి ర్యాలీ గురజాడ విగ్రహానికి ప్రముఖుల నివాళి అనంతరం శత వర్థంతి కార్యక్రమాల ప్రధాన వేదిన ఆనంద గజపతి కళాక్షేత్రంలో సాహితి సదస్సు ఏర్పాటు చేసారు. ఈ సదస్సుకు ముఖ్య అతిధిగా తెలుగు విశ్వ విద్యాలయం పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్ గోపి పాల్గొన్నారు. ప్రముఖ సాహితి వేత్తలు డాక్టర్ చాగంటి తులసి, చింతకింది శ్రీనివాసరావు, ఆచార్య కె మలయవాసిని, పాల్గొంటారు. సాయంత్రం డాక్టర్ .జక్కు రామకృష్ణ, లక్ష్మణరావుల సమన్వయంలో కవి సమ్మేళనం నిర్వహిస్తారు. సాయంత్రం జరిగే ముగింపు సభలో కేంద్ర సాహిత్య అకాడమి ఆవార్డు గ్రహీత డాక్టర్ యార్లగడ్డ లక్ష్మిప్రసాద్‌కు గురజాడ సమాఖ్యచే విశిష్ట పురస్కారం ప్రదానం చేస్తారు. ఈకార్యక్రమంలో సీనిరచయిత గొల్లపూడి మారుతిరావు పాల్గొన్నారు.