విశాఖ

ప్రత్యేక హోదా కోసం ఒకే ఎజెండాతో ముందుకు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సీపట్నం, ఫిబ్రవరి 15: స్వార్థ ప్రయోజనాలను పక్కన పెట్టి ప్రత్యేక హోదా సాధన కోసం ఒకే ఎజెండాతో పోరాటానికి సిద్ధం కావాలని ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కె. ఎన్. ఆర్. లాడ్జి ఆవరణలో జనఘోష సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలన్నీ వారి వారి జెండాలను పక్కన పెట్టి అందరూ ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ఉద్యమాలతోనే కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం మాట తప్పిందన్నారు. చట్టపరంగా చేయాల్సిన ప్రత్యేక హోదాను వదులుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక ఫ్యాకేజీకి అంగీకరించడం మహాపరాధంగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విభజనలో ఎ.పి.కి తీరని నష్టం జరిగిందన్నారు. ఈనష్టాన్ని పూడ్చడంతో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఈపరిస్థితుల్లో కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు స్వాతంత్య్ర పోరాటం తరహాలో మరో పోరాటానికి సిద్ధం కావాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. సాగునీటి వనరులు లేకపోవడం వలనే ఉత్తరాంధ్ర జిల్లాలు అన్ని రంగాల్లో వెనుకబడ్డాయన్నారు. రైతులకు గిట్టుబాటు ధర లభించక పోవడం వలన రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. పోలవరం , ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టుల నిర్మాణంతోనే ఉత్తరాంధ్ర అబివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు కేంద్రం మొండి చేయి చూపించిందన్నారు. విశ్వవిద్యాలయాల ఏర్పాటులో సైతం అన్యాయం జరిగిందన్నారు. భవిష్యత్ తరాల వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమవుతుందన్నారు. సి.పి. ఐ. రాష్ట్ర సహాయ కార్యదర్శి జె.వి.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తాయని , తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. విభజన చట్టంలోని అంశాలను సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. విశాఖ ప్రాంతం నుండి రైల్వే కు పెద్ద ఎత్తున ఆదాయం లభిస్తున్నా రైల్వే జోన్ ఏర్పాటు చేయడం లేదన్నారు. ప్రత్యేక హోదాతో పాటు రైల్వే జోన్ కోసం రాజీలేని పోరాటాలు సాగిస్తామని ఆయన స్పష్టం చేసారు. మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందు నుండి పోరాటం సాగిస్తుందన్నారు. పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రత్యేక హోదా సాధనపై ప్రజలను చైతన్యవంతులను చేసారన్నారు. మార్చి 1న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, 5న డిల్లీలో జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేపడతామన్నారు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం దిగి రాకపోతే పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యులంతా మూకుమ్మడి రాజీనామాలు చేస్తారని ఆయన స్పష్టం చేసారు. ప్రత్యేక హోదా 15 ఏళ్ళు కావాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ర్యాలీగా శ్రీకన్య కూడలికి చేరుకుని అక్కడ వారంతా మానవహారంగా ఏర్పడి ప్రత్యేక హోదాపై నినాదాలు చేసారు. ఈసమావేశంలో వై ఎస్సార్ సి.పి. కేంద్ర కమిటీసభ్యుడు అంకంరెడ్డి జమీలు, పి.సి.సి. ఉపాధ్యక్షుడు మీసాలసుబ్బన్న, సి.పి. ఐ. జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, డాక్టర్ పి.రాజశేఖర్, వైకాపా నాయకులు పెట్ల భద్రాచలం, పోతల శ్రీను, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు అత్తిలి విమల, ఉత్తరాంధ్ర చర్చావేదిక ప్రతినిధులు పి.వి.జి. కుమార్, సత్యవతి తదితరులు పాల్గొన్నారు.